Motorola edge 60 Stylus Smartphone: ఇప్పుడంటే చైనా కంపెనీలు భారత స్మార్ట్ ఫోన్ మార్కెట్ మొత్తాన్ని దున్నేస్తున్నాయి గాని.. ఒకప్పుడు ప్రీమియం ఫోన్లలో మోటోరోలా(Motorola) నెంబర్ వన్ స్థానంలో ఉండేది. అయితే మధ్యలో మోటరోలా సంస్థ కాస్త వెనుకబడిపోవడంతో.. చైనా కంపెనీలు ఒక్కసారిగా ముందుకు వచ్చాయి. దీనికి తోడు తక్కువ ధరలో అద్భుతమైన ఫీచర్లను అందుబాటులోకి తీసుకురావడంతో మోటరోలా ఆత్మ పరిశీలన చేసుకోక తప్పలేదు. అయితే కొంతకాలంగా మోటరోలా కూడా పూర్తిగా మారిపోయింది. ఈ కాలానికి అనుగుణంగా కొత్త కొత్త ఫోన్లను తీసుకొస్తోంది.
2020 సంవత్సరంలో మోటరోలా edge stylish smartphone ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ధర కూడా దాదాపు 20వేల లోపు ఉంది. ఈ ఫోన్లో వన్ పాయింట్ ఫైవ్ కే డిస్ప్లే, 50 ఎంపీ సోనీ కెమెరా, మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్ వంటివి ఉన్నాయి.
ధర ఎలా ఉంటుందంటే
మోటరోలా ఎడ్జ్ 60 స్టైలస్ స్మార్ట్ ఫోన్ (Motorola edge 60 stylus smartphone) స్మార్ట్ఫోన్ మార్కెట్లో సంచలనం సృష్టిస్తోంది. ఈ మోడల్ మోటో ఇండియా వెబ్సైట్, ఫ్లిప్కార్ట్ లో అందుబాటులో ఉంది. 8gb రామ్+ 256 జీబీ స్టోరేజ్ అందుబాటులో ఉంది. ఇది 22, 999 రూపాయలకు లభ్యం అవుతుంది. స్పెషల్ డిస్కౌంట్ కింద కంపెనీ 20,999 కు విక్రయిస్తోంది.
అప్డేట్స్ అన్ని సంవత్సరాలు
ఈ ఫోన్ స్నాప్ డ్రాగన్ 7s జెన్ టు ఎస్ఓసి చిప్ సెట్ తో పనిచేస్తుంది. ఈ చిప్ 8GB LPDDR 4x ర్యామ్, 256 GB UFS 2.2 స్టోరేజీని సపోర్ట్ చేస్తుంది. ఆండ్రాయిడ్ 15 ఆధారిత hello UI తో పనిచేస్తుంది. మూడు సంవత్సరాల వరకు ఈ మోడల్ లో సెక్యూరిటీ అప్డేట్స్ లభిస్తాయి.
ఇక ఈ హ్యాండ్ సెట్ 120 హెచ్ జెడ్ రిఫ్రెష్ రేటు, 6.67 అంగుళాల 1.5 కే 2.5d p ఓ ఎల్ ఈ డి డిస్ప్లే అందిస్తుంది. ఈ డిస్ప్లే 3000 నిట్స్ పీక్ బ్రైట్నెస్ , 300 హెచ్ జెడ్ షాంప్లింగ్ రేట్ కలిగి ఉంటుంది. ఇది ఆక్వా టచ్ ఫీచర్ ను సపోర్ట్ చేస్తుంది. చివరికి తడి చేతులతో కూడా ఈ ఫోన్ ఉపయోగించవచ్చు. ఈ డిస్ప్లే ఆక్వర్ టచ్ ఫీచర్ కు ఉపయుక్తంగా ఉంటుంది. కార్మింగ్ గొరిల్లా త్రీ ప్రొటెక్షన్ ఈ మోడల్ కు ఉన్న ప్రధాన ఆకర్షణ.