Motorola Edge 60 Fusion 5G: మిడ్ రేంజ్ పీపుల్స్ మొబైల్ కొనేటప్పుడు బడ్జెట్లో ఉండాలని కోరుకోవడం తోపాటు ఫీచర్లు కూడా కావాలనుకుంటారు. ఇలాంటి అవసరాలను దృష్టిలో ఉంచుకొని కొన్ని కంపెనీలు ఆకట్టుకునే ఫీచర్లతో పాటు బడ్జెట్ లోనే మొబైల్స్ ను విక్రయించాలని నిర్ణయిస్తాయి. ఇందులో భాగంగా Motorola కంపెనీకి చెందిన ఓ మొబైల్ అడ్వాన్స్ లేటెస్ట్ టెక్నాలజీ ఫీచర్స్ ఉండి.. బలమైన బ్యాటరీ తో పాటు అద్భుతమైన కెమెరా పనితీరుతో తక్కువ ధరకే రాబోతుంది. దీని గురించిన సమాచారం ఆన్లైన్లో ఉండడంతో చాలామంది దీనిని కొనుగోలు చేయాలని అనుకుంటున్నారు. అయితే ఈ ఫోన్ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం..
Motorola కంపెనీకి చెందిన Edge 60 Fusion 5G ఇటీవల ఆవిష్కరించింది. అయితే ఈ మొబైల్ డిస్ప్లే వేరే లెవెల్ అనుకోవచ్చు. ఇందులో సిక్స్ పాయింట్ సిక్స్ సెవెన్ అంగుళాల POLED డిస్ప్లే ఉండనుంది. ఇది 120 Hz రిఫ్రెష్ రేట్ తో పనిచేస్తుంది. 7400 మీడియాటెక్ dimencity చిప్ సెట్ తో పనిచేసే ఇందులో 12 జిబి రామ్, 256 నుంచి 512 GB స్టోరేజ్ ఉండనుంది. దీంతో మల్టీ టాస్కింగ్ యూస్ చేసే వారికి, గేమింగ్ కోసం ఈ మొబైల్ బాగా పనిచేస్తుంది. అంతేకాకుండా ఫోటోలు, వీడియోలు స్టోర్ చేసుకోవడానికి కావాల్సినంత స్పేస్ ఉండనుంది.
ఈ మొబైల్లో కెమెరా పనితీరు అద్భుతం అని చెప్పవచ్చు. ఇందులో 50 MP మెయిన్ కెమెరా ఉండడంతో కావలసిన ఫోటోగ్రఫీ అందిస్తుంది. అలాగే 13 MP ఫ్రంట్ కెమెరా ఉండి సెల్ఫీలు, వీడియో కాలింగ్ కోసం అనుగుణంగా ఉంటుంది. ఈ రెండు కెమెరాలతో 4k వీడియోను తీసుకుని చాన్స్ ఉంది. ప్రొఫెషనల్ ఫోటోగ్రఫీ కోరుకునే వారికి ఈ కెమెరా అద్భుతమైన పరిచయీలను కనబరుస్తుంది.
ఈ మొబైల్లో బ్యాటరీ కూడా మెరుగ్గా ఉందని చెప్పవచ్చు. ఇందులో 5500 mAh బ్యాటరీ అమర్చారు.. ఇది 68 W సపోర్టుతో ఫాస్టెస్ట్ చార్జింగ్ కానుంది. అలాగే 7700 mAh బ్యాటరీ స్టోర్ వరకు సపోర్ట్ చేసే అవకాశం ఉంది. ఈ బ్యాటరీ 120 W ఫాస్టెస్ట్ చార్జింగ్ తో తొందరగా చార్జింగ్ చేసుకునే అవకాశం ఉంది. బిజీగా ఉండేవారు.. రోజువారి అవసరాల కోసం మొబైల్ వాడేవారికి ఈ చార్జింగ్ సపోర్ట్ ఇవ్వనుంది. ఈ మొబైల్లో ఆండ్రాయిడ్ 15 సాఫ్ట్వేర్ సపోర్ట్ చేయగా ఇందులో అట్మాస్ స్పీకర్స్ ను ఇన్స్టాల్ చేశారు. అలాగే డిస్ప్లే రక్షణ కోసం గొరిల్లా గ్లాస్ 7i రక్షణ ఇవ్వనుంది.
అయితే ఇన్ని ఫీచర్లు ఉన్నప్పటికీ దీని ధర మాత్రం తక్కువగానే ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మొబైల్ ను రూ.11,680 ధరతో విక్రయిస్తున్నారు. బడ్జెట్లో మొబైల్ కొనాలని అనుకునే వారికి ఇది ఎంతగానో ఉపయోగపడనుంది. ఫ్లిప్కార్ట్ సంస్థ దీనిని విక్రయిస్తోంది.