Motorola Edge 50 Pro: మోటరోలా ఎడ్జ్ 50..ఇవీ దీని ప్రత్యేకతలు

భారత్ లో 5 జీ ఫోన్ లకు విపరీతమైన గిరాకీ ఉండటం.. వినియోగదారులు అధికంగా ఉండటంతో.. మోటరోలా ఇక్కడి మార్కెట్ పై దృష్టి సారించింది. గతంలో కొన్ని మోడల్స్ ప్రవేశపెట్టినప్పటికీ అవి ఆశించినంత స్థాయిలో వినియోగదారుల ఆదరణ చూరగొనలేదు.

Written By: Suresh, Updated On : March 12, 2024 4:01 pm

Motorola Edge 50 Pro

Follow us on

Motorola Edge 50 Pro: 5 జీ విప్లవం వచ్చిన తర్వాత.. స్మార్ట్ ఫోన్ కంపెనీలు కొత్త కొత్త రకాలను మార్కెట్లోకి తీసుకొస్తున్నాయి.. అధునాతనమైన ఫీచర్లతో కస్టమర్లను ఆకట్టుకుంటున్నాయి. ఈ క్రమంలో ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ మోటోరోలా ఎడ్జ్ 50 ప్రో పేరుతో కొత్త రకాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. దీన్ని త్వరలో భారత మార్కెట్లోకి ప్రవేశపెట్టనుంది. గత ఏడాది ఏప్రిల్ లో మోటరోలా ఎడ్జ్ 40 ప్రో ఫోన్ ను ఆవిష్కరించింది. ఆ మోడల్ సూపర్ హిట్ కావడంతో దానికి కొనసాగింపుగా మోటరోలా ఎడ్జ్ 50 ప్రో ను తెరపైకి తీసుకొచ్చింది. అయితే దీని ధరను ఎంతో మాత్రం మోటరోలా చెప్పలేదు.

ఇవీ ప్రత్యేకతలు

ఇందులో ట్రిపుల్ రేర్ కెమెరా సెట్ అప్ ఉంది. క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 3 ఎస్వోసీ చిప్ సెట్ ను ఇందులో అమర్చారు. బ్లాక్, పర్పుల్, వైట్ విత్ స్టోన్ లైక్ ప్యాట్నర్ రంగుల్లో లభ్యం కానుంది. మోటోరోలా ఎడ్జ్ 50 ప్రో ఫోన్ 165 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ కలిగి ఉంది. 6.7 అంగుళాల డిస్ ప్లే ఈ మోడల్ లో అందుబాటులో ఉంది. 12 జీబీ ర్యామ్, 125 వాట్ల వైర్డ్ చార్జింగ్, 50 వాట్ల వైర్ లెస్ ఫాస్ట్ చార్జింగ్ కెపాసిటీ గల 4500 ఎంఏహెచ్ సామర్థ్యం ఉన్న బ్యాటరీ ఈ మోడల్ లో ఉంది. 50 మెగా పిక్సెల్ ప్రైమరీ సెన్సర్ విత్ ఎఫ్ 1.4 అపెర్చర్, ఎల్ఈడి ఫ్లాష్ యూనిట్, 13 ఎంఎం వైడ్ యాంగిల్ కెమెరా, 73 ఎంఎం టెలి ఫోటో షూటర్ విత్ 6x జూమ్ ఈ మోడల్ లో మోటరోలా కల్పించింది.

భారత్ లో 5 జీ ఫోన్ లకు విపరీతమైన గిరాకీ ఉండటం.. వినియోగదారులు అధికంగా ఉండటంతో.. మోటరోలా ఇక్కడి మార్కెట్ పై దృష్టి సారించింది. గతంలో కొన్ని మోడల్స్ ప్రవేశపెట్టినప్పటికీ అవి ఆశించినంత స్థాయిలో వినియోగదారుల ఆదరణ చూరగొనలేదు. ఈ క్రమంలో గత ఏడాది ఎడ్జ్ 40 రకాన్ని అందుబాటులోకి తీసుకువచ్చింది. అది బాగా క్లిక్ కావడంతో.. దానికి కొనసాగింపుగా ఎడ్జ్ 50 రకాన్ని తెరపైకి తీసుకొచ్చింది.. ఏప్రిల్ 3న ఈ మోడల్ ను మార్కెట్లో ప్రవేశపెట్టనుంది.