Motorola Edge 40: నేటి కాలంలో చాలామంది సోషల్ మీడియా కంటెంట్ సృష్టిస్తున్నారు. మొబైల్ తోనే ఫోటోలు, వీడియోలు తీసి ఇంస్టాగ్రామ్, ఫేస్బుక్ వీడియోలు తయారు చేస్తున్నారు. అయితే ఒకప్పుడు ఫోన్ కెమెరాతో వీడియోలు తీయడం వల్ల క్లారిటీ ఉండేది కాదు. కానీ ఇప్పుడు మార్కెట్లోకి వచ్చే మొబైల్స్ అప్డేట్ అయినా క్వాలిటీ కెమెరాతో వస్తున్నాయి. అంతేకాకుండా తక్కువ ధరకే ఇవి అందుబాటులో ఉంటున్నాయి. ఇలాంటి వాటిలో Motorola కంపెనీకి చెందిన ఓ మొబైల్ లో అడ్వాన్స్ ఫీచర్లు ఉండడంతో పాటు తక్కువ ధరకే అందిస్తున్నారు. ఈ మొబైల్ ఆకట్టుకునే డిజైన్ ఉండడంతోపాటు సోషల్ మీడియా కంటెంట్ సృష్టికర్తలకు కావాల్సిన కెమెరాలు అందిస్తుంది. మరి ఇందులో ఎంత మెగాపిక్సల్ కెమెరా ఉందో ఇప్పుడు చూద్దాం..
దశాబ్దాలుగా Motorola కంపెనీ వినియోగదారులకు అనుగుణంగా మొబైల్స్ ను తీసుకువస్తుంది. లేటెస్ట్ గా Motorola Edge 40 మొబైల్ కొత్త ఫీచర్లతో ఆకర్షిస్తుంది. ఇందులో ప్రధానంగా డిస్ప్లే గురించి చెప్పుకోవచ్చు. 6.55 అంగుళాల HD+ POLED డిస్ప్లేను అమర్చారు. ఇది 144 Hz రిఫ్రిజిరేట్ పని చేస్తుంది. సోషల్ మీడియాలో ఎక్కువగా బ్రౌజింగ్ చేసే వారికి, గేమింగ్ కోరుకునే వారికి ఈ డిస్ప్లే అనుగుణంగా ఉంటుంది. అలాగే ఇది HDR+కి కూడా సపోర్టు ఉండడంతో స్మూత్ స్క్రోలింగ్ ఉండనుంది. ఈ మొబైల్లో 8020 Deminsity ప్రాసెసర్ తో పాటు 8 GB రామ్ కూడా ఉండడంతో మల్టీ టాస్కింగ్ యూస్ చేసే వారికి వేగం ఎక్కువగా ఉంటుంది. వీడియో స్ట్రీమింగ్ తో పాటు రోజువారి ఫోన్ ఉపయోగించిన కూడా ఎలాంటి వేడి కాకుండా ఉంటుంది.
ఈ మొబైల్లో కెమెరా గురించి ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు. ఇందులో 50 MP మెయిన్ కెమెరా ను అమర్చారు. ఇది ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ తో పనిచేస్తుంది. అలాగే 13 MP అల్ట్రా వైట్ కెమెరా ఉండనుంది. పగలు, రాత్రి అనే సమయం లేకుండా కావలసిన ఫోటోలు స్పష్టంగా వస్తాయి. తక్కువ కాంతిలో కూడా అద్భుతమైన ఫోటోగ్రఫీని పొందవచ్చు.33 MP ఫ్రంట్ కెమెరా ఉండడంతో సెల్ఫీ వీడియో, వీడియో కాల్స్ కోసం క్వాలిటీ పొందవచ్చు. అలాగే రోజువారి ఫోటోగ్రఫీ కోరుకునే వారికి కూడా ఇది సపోర్ట్ గా ఉండనుంది.
మోటోరోలా ఎడ్జ్ 40 మొబైల్లో 4400 mAh బ్యాటరీని చేర్చారు. ఇది కావలసిన వీడియోలను అందించే విధంగా సపోర్ట్ చేస్తుంది. అలాగే ఈ బ్యాటరీ కి 68 వాట్ చార్జింగ్ సపోర్ట్ చేయడంతో గంటల తరబడి ఫోన్ ను ఉపయోగించినా కూడా చార్జింగ్ తగ్గకుండా ఉంటుంది. అలాగే ఇందులో స్టీరియో స్పీకర్లతో పాటు వైఫై 6, బ్లూటూత్ 5.2 వంటివి ఉండడంతో యూత్కు బాగా నచ్చే అవకాశం ఉందని అంటున్నారు. ఈ మొబైల్లో రూ.9,999 కే విక్రయించే అవకాశం ఉందని తెలుస్తోంది.