Moto G85 Price: Smartphone రంగంలో Motorola కంపెనీ దూసుకుపోతుంది. ఇప్పటికే ఎన్నో ఆకర్షణీయమైన మొబైల్స్ ను మార్కెట్లోకి తీసుకువచ్చిన ఈ కంపెనీ ఎప్పటికప్పుడు యూత్ తో పాటు వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా కొత్త కొత్త మొబైల్స్ ను పరిచయం చేస్తుంది. 2026 కొత్త సంవత్సరం సందర్భంగా ఈ కంపెనీ నుంచి తేలికైన బరువు కలిగిన.. ఆకర్షణీయమైన డిజైన్‌తో కూడిన.. మెరుగైన కెమెరా, బలమైన బ్యాటరీ వ్యవస్థతో కొత్త ఫోన్ సందడి చేస్తోంది. చాలామంది దీని గురించి తెలుసుకొని వెంటనే కొనాలని అనుకుంటున్నారు. ముఖ్యంగా కెమెరా అవసరం ఉన్నవారు ప్రత్యేకంగా ఈ మొబైల్ ను కొనుగోలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇంతకీ ఈ మొబైల్ ఏది? దాని పూర్తి వివరాల్లోకి వెళితే..
Motorola కంపెనీ నుంచి కొత్తగా Moto G85 మార్కెట్లో సందడి చేస్తోంది. ఈ మొబైల్ చూడగానే ఆకర్షణీయంగా కనిపిస్తుంది. సన్నని మందంతో ఉన్న ఇది వంపులు తిరిగి చేతిలో పట్టుకోవడానికి అనుగుణంగా ఉంటుంది.. ఇందులో ఉండే డిస్ప్లే కూడా మొబైల్ యూస్ చేసే వారికి ఉపయోగకరంగా ఉండనుంది. ఎందుకంటే ఈ డిస్ప్లే POLED డిజైన్ ను కలిగి ఉంది. స్మూత్ స్క్రోలింగ్ కోసం ఈ డిస్ప్లే చాలా బాగా ఉపయోగపడుతుంది. అలాగే ఈ మొబైల్ బ్యాక్ సైడ్ మృదువైన స్పర్శ ఉండడంతో కొత్త అనుభూతిని పొందవచ్చు.
ఈ మొబైల్లో కెమెరా గురించి ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు. ఇందులో 50 MP మెయిన్ కెమెరాను అమర్చారు. ఇది OIS సాఫ్ట్వేర్ తో పనిచేస్తుంది. అలాగే 8 MP అల్ట్రా వైడ్ మాక్రో కెమెరా కూడా పనిచేయనుంది. ఏఐ తరహాలో ఫోటోలు రావడానికి ఈ కెమెరాలు బాగా పనిచేస్తాయి. అంతేకాకుండా సెల్ఫీ ఫోటోలో తో పాటు వీడియో కాలింగ్ కోసం 32 MP ఫ్రంట్ కెమెరాను అమర్చారు. దీంతో సోషల్ మీడియా కంటెంట్ సృష్టించే వారికి ఇది చాలా వరకు ఉపయోగపడుతుంది.
మోటోరోలా జి 85 మొబైల్లో బలమైన బ్యాటరీ వ్యవస్థను అమర్చారు. ఇందులో 5000 mAh బ్యాటరీని చేర్చారు. ఈ బ్యాటరీ 30 W ఫాస్టెస్ట్ చార్జింగ్‌తో పనిచేస్తుంది. రోజువారి వినియోగదారులతో పాటు బిజీగా ఉండే వారికి తొందరగా చార్జింగ్ అవసరం ఉన్నవారికి ఇది చాలావరకు ఉపయోగపడుతుంది. అలాగే ఈ మొబైల్లో ఆండ్రాయిడ్ 14 సాఫ్ట్వేర్ ఉండడంతో కొన్ని రకాల యాప్స్ అనుగుణంగా ఉండరున్నాయి. వీటితోపాటు ఐపీ52, స్టీరియో స్పీకర్లు, ఫింగర్ ప్రింట్స్ వంటి ఫీచర్లు కూడా ఉండడంతో యూత్ కు అనుగుణంగా ఉండనుంది. అలాగే ఫింగర్ ప్రింట్స్ సేఫ్టీకి ప్రత్యేకంగా నిలుస్తుంది. ఇక ఇందులో 8gb రామ్‌తోపాటు 12gb స్టోరేజ్ ఉండడంతో కావలసిన ఫైల్స్ ను స్టోర్ చేసుకోవచ్చు.
ఇప్పటివరకు మార్కెట్లో ఉన్న ఈ రకమైన మొబైల్ కు మోటరోలా g85 గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉందని కంపెనీ ప్రతినిధులు అంటున్నారు. ఎందుకంటే దీనిని రూ.17,999 ప్రారంభ ధరతో విక్రయిస్తున్నారు. మిగతా ఫోన్ల కంటే ఈ మొబైల్ ధర తక్కువగా ఉండడంతో చాలామంది దీని వైపే చూస్తున్నట్లు తెలుస్తోంది.