రైతులకు మోదీ సర్కార్ శుభవార్త.. భారీగా సబ్సిడీ పెంపు..?

కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ సర్కార్ రైతులకు శుభవార్త చెప్పింది. రైతులకు ప్రయోజనం చేకూరే విధంగా కీలక నిర్ణయం తీసుకుంది. డీఏపీ ఫెర్టిలైజర్ సబ్సిడీ డబ్బుల పెంపునకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలపడం గమనార్హం. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల రూ.14,775 కోట్ల అదనపు భారం కేంద్రంపై పడనుందని తెలుస్తోంది. కేంద్రం నిర్ణయం వల్ల రైతులకు పాత ధరలకే డీఏపీ అందుబాటులోకి రానుందని తెలుస్తోంది. అంతర్జాతీయ మార్కెట్‌లో డీఏపీ ధరలు భారీగా పెరిగిన సంగతి తెలిసిందే. […]

Written By: Navya, Updated On : June 17, 2021 1:37 pm
Follow us on

కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ సర్కార్ రైతులకు శుభవార్త చెప్పింది. రైతులకు ప్రయోజనం చేకూరే విధంగా కీలక నిర్ణయం తీసుకుంది. డీఏపీ ఫెర్టిలైజర్ సబ్సిడీ డబ్బుల పెంపునకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలపడం గమనార్హం. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల రూ.14,775 కోట్ల అదనపు భారం కేంద్రంపై పడనుందని తెలుస్తోంది. కేంద్రం నిర్ణయం వల్ల రైతులకు పాత ధరలకే డీఏపీ అందుబాటులోకి రానుందని తెలుస్తోంది.

అంతర్జాతీయ మార్కెట్‌లో డీఏపీ ధరలు భారీగా పెరిగిన సంగతి తెలిసిందే. దేశీ మార్కెట్‌లో కూడా డీఏపీ ధరలు పెరగాల్సి ఉండగా కేంద్ర ప్రభుత్వం పెరుగుదల లేకుండా సబ్సిడీ మొత్తాన్ని పెంచడం గమనార్హం. కేంద్రం నిర్ణయం వల్ల డీఏపీ కొనుగోలు చేసే రైతులపై ఎలాంటి ప్రతికూల ప్రభావం పడదు. దేశంలోని రైతులు యూరియా తర్వాత ఎక్కువగా ఉపయోగించే ఫెర్టిలైజర్ డీఏపీ అనే సంగతి తెలిసిందే.

డీఏపీ సబ్సిడీ నిర్ణయాన్ని కేంద్రం అమలులోకి తీసుకురావడంపై రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర కేబినేట్ సైతం ఆమోదం తెలపడంతో రైతులు రూ.1200కే డీఏపీని కొనుగోలు చేయొచ్చు. గతేడాది డీఏపీ బస్తా ధర 1,700 రూపాయలుగా ఉండేది. ఆ సమయంలో కేంద్ర ప్రభుత్వం 500 రూపాయలు సబ్సిడీ అందించేది. ఆ తర్వాత డీఏపీ ధర 1200 రూపాయలకే కొనుగోలు చేయాల్సి వచ్చింది.

ఇప్పుడు డీఏపీ ధర పెరగడంతో కేంద్రం కూడా సబ్సిడీ ధరను పెంచడం గమనార్హం. రైతులకు ఖర్చులు సంవత్సరంసంవత్సరానికి పెరుగుతున్న నేపథ్యంలో కేంద్రం రైతులకు మేలు జరిగేలా ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం.