Midsize SUV Car : మిడ్ సైజ్ SUVల్లో బెస్ట్ కార్లు ఇవే..

ఇవి చిన్న కార్లే అయినా ఎస్ యూవీ రేంజ్ లో ఫీచర్స్ ఉండి వినియోగదారులను ఆకర్షిస్తాయి. ప్రస్తుతం మార్కెట్లో హ్యుందాయ్ క్రెటా తో పాటు మారుతి గ్రాండ్ విటారా, హోండా ఎలివేట్ లాంటి కార్లు పోటీపడుతున్నాయి.

Written By: Chai Muchhata, Updated On : February 24, 2024 9:36 am

Midsize SUV Cars

Follow us on

Midsize SUV Car :  నేటి కాలంలో కారు కొనాలనుకునేవారు SUVలను ఎక్కువగా కోరుకుంటున్నారు. అయితే చిన్న ఫ్యామిలీ ఉండి తక్కువ అసవరాలు ఉన్నవారు పెద్దగా బడ్జెట్ ను వెచ్చించలేరు. ఈ క్రమంలో ఎస్ యూవీ రేంజ్ లో ఉంటూ తక్కువబడ్జెట్ తో అందించే కార్లు అందుబాటులో ఉన్నాయి. వీటినే మిడ్ సైజ్ ఎస్ యూవీలు అంటారు. ఇవి చిన్న కార్లే అయినా ఎస్ యూవీ రేంజ్ లో ఫీచర్స్ ఉండి వినియోగదారులను ఆకర్షిస్తాయి. ప్రస్తుతం మార్కెట్లో హ్యుందాయ్ క్రెటా తో పాటు మారుతి గ్రాండ్ విటారా, హోండా ఎలివేట్ లాంటి కార్లు పోటీపడుతున్నాయి.కానీ తర్వలో మరో మూడు కార్లు మార్కెట్లోకి రానున్నాయి. వీటి గురించి వివరాల్లోకి వెళితే..

దేశంలో నెంబర్ వన్ గా ఉన్న మారుతికి టాటా గట్టిపోటీ ఇస్తోంది. ఈ తరుణంలో ఈ కంపెనీ కర్వ్(Curvavi EV)ని మార్కెట్లోకి తీసుకురావడానికి ప్రయత్నాలు ప్రారంభించింది. ఇది 1.2 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ తో పాటు 125 బీహెచ్ పీ పవర్, 225 ఎన్ ఎం టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. 6 స్పీడ్ మాన్యువల్, 7 స్పీడీ్ ఆటోమేటిక్ గేర్ బాక్స్ తో 115 బీహెచ్ పీ పవర్, 260 ఎన్ ఎం టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. దీనిని జూలై లేదా సెప్టెంబర్ లో రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

రెనాల్ట్ కంపెనీ నుంచి గతంలో రిలీజ్ అయినా ‘డస్టర్’ వినియోగదారులను ఆకర్షించిన విషయం తెలిసిందే. ఇప్పుడు దీనిని కొత్తతరహాలో తీసుకొస్తున్నారు. రెనాల్ట్, నిస్సాన్ భాగస్వామ్యంలో ఎస్ యూవీ రేంజ్ లో డిజైన్ చేస్తున్నారు. ఇందులో 10.1 అంగుళాల టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ తో పాటు అడాస్ టెక్నాలజీ, లైట్ వెయిట్ హైబ్రిడ్ పవర్ ట్రెయిన్ ను కలిగి ఉంటుంది. ఎల్ ఈడీ టర్న్ ఇండికేటర్ లు, కొత్త టెయిల్ గేట్ ఆకర్సిస్తుంది.

నిస్సాన్ కంపెనీ నుంచి కొత్తగా 5 సీటర్ అందుబాటులోకి రాబోతుంది. ఇది ఎస్ యూవీ రేంజ్ లో ఫీచర్లను కలిగి ఉంది. నిస్సాన్ కంపెనీ ఓవైపు కొత్త తరం డస్టర్ నిర్మాణంలో భాగం పంచుకొని..మరొవైపు సొంతంగా కొత్త మోడల్ ను తీసుకొస్తుంది. ఇది డస్టర్ కంటే భిన్నంగా ఉంటుందని చెబుతున్నారు. ఇందులో హైబ్రిడ్ ఇంజిన్ తో పాటు ఎలక్ట్రిక్ పవర్ ట్రెయిన్ ఉంటున్నట్లు తెలుస్తోంది.