https://oktelugu.com/

Best Safety Car: ఈ కారు గురించి తెలిస్తే లేట్ చేయకుండా వెంటనే కొనేస్తారు..

ఓ వైపు లో బడ్జెట్ తో ఎక్కువ సేప్టీ ఫీచర్స్ ను అందిస్తూ ఓ కంపెనీ ఓ మోడల్ ను అందుబాటులో ఉంచింది. ఈ కారు గురించి తెలిసిన చాలా మంది వెంటనే కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు.

Written By:
  • Srinivas
  • , Updated On : February 24, 2024 / 09:40 AM IST

    Tata Tiyago

    Follow us on

    Best Safety Car:సొంత వెహికల్ కొనుగోలు చేయాలనుకునేవారు ముందుగా బడ్జెట్ గురించి ఆలోచిస్తారు. కొన్ని కంపెనీలో సామాన్యుల బడ్జెట్ కు అనుగుణంగా కార్లను అందుబాటులో ఉంచాయి. అయితే బడ్జెట్ తో పాటు కారులో ప్రయాణించేటప్పుడురక్షణ కూడా చాలా అవసరం. ఈ నేపథ్యంలో ఓ వైపు లో బడ్జెట్ తో ఎక్కువ సేప్టీ ఫీచర్స్ ను అందిస్తూ ఓ కంపెనీ ఓ మోడల్ ను అందుబాటులో ఉంచింది. ఈ కారు గురించి తెలిసిన చాలా మంది వెంటనే కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. ఇంతకీ ఆ కారు ఏదో తెలుసుకోవాలని ఉందా?

    దేశంలో సామాన్యులు కారు కొనడానికి ముందుగా మారుతి కంపెనీ వైపు చూస్తారు. సామాన్యులు కొనేలా అందుబాటు ధరలో ఉండే మారుతి కార్లంటే చాలా మంది లైక్ చేస్తారు. కానీ ఇప్పుడు మారుతి కంపెనీకి టాటా గట్టి పోటీ ఇస్తోంది. ఇటీవల తేలిన లెక్కల్లో మారుతి కంటే టాటాకు చెందిన కార్లు ఎక్కువగా అమ్ముడుపోయాయి. ఇందులో టాటా టియాగో ఒకటిగా నిలిచింది. టాటా టియాగో తక్కువ బడ్జెట్ లోనే కాకుండా ఎక్కువగా సేప్టీ ఫీచర్స్ ను అందిస్తుంది.

    ఈ కారులో 1.2 లీటర్ పెట్రోల్ ఇంజిన్ తో పాటు CNG వేరియంట్ ను కలిగి ఉంది. పెట్రోల్ వేరియంట్ లో 86 బీహెచ్ పీ పవర్, 113 ఎన్ ఎం టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 5 స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ తో పాటు 5 స్పీడ్ ఆటోమేటిక్ గేర్ బాక్స్ ను కలిగి ఆకర్షిస్తుంది. ఈ క్రమంలో ఇది లీటర్ పెట్రెల్ కు 19.01 మైలేజ్ ఇస్తుండగా.. సీఎన్ జీ ఎంపికలో 26.49 కిలోమీటర్ల వరకు వెళ్లచ్చు. టాటా టియాగో రూ.5.65 లక్షల ప్రారంభ ధరతో విక్రయిస్తున్నారు. టాప్ ఎండింగ్ రూ.8.90 లక్షలు గా ఉంది.

    టాటా టియాగో ఫీచర్స్ విషయానికొస్తే 7అంగుళాల టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ తో పాటు ఎల్ ఈడీ ప్రొజెక్టర్ హెడ్ లైట్లు, బ్యాక్ సైడ్ వైపర్, డీఫాగర్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఇందులో సౌండింగ్ కోసం 8 స్పీకర్ సౌండ్ సిస్టమ్ ను అమర్చారు. ఇక రక్షణ విషయంలో ఈ కారు అత్యంత భద్రతను ఇస్తుందని చెప్పొచ్చు. ఇందులో డ్యూయెల్ ఫ్రంట్ ఎయిర్ బ్యాగులు, పార్కింగ్ సెన్సార్, ఈబీడితో కూడిన కార్నర్రింగ్ స్టెబిలిటీ ఉన్నాయి.