Hyundai : ప్రముఖ ఆటోమొబైల్ తయారీదారు హ్యుందాయ్ కార్లకు ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ ఉంది. భారతీయ వినియోగదారులలో కూడా హ్యుందాయ్ కార్లకు మంచి ఆదరణ ఉంది. వాటిలో హ్యుందాయ్ క్రెటా, వెన్యూ, ఎక్స్‌టర్ వంటి SUVలు బాగా పాపులారిటీ సంపాదించుకున్నాయి. ఇప్పుడు కంపెనీ రాబోయే రోజుల్లో అనేక కొత్త మోడళ్లను విడుదల చేయడానికి సిద్ధమవుతోంది. రాబోయే కార్లలో కంపెనీ పాపులర్ మోడళ్ల అప్ డేటెడ్ వెర్షన్లు కూడా ఉన్నాయి. అలాంటి అత్యంత ఎదురుచూస్తున్న కంపెనీ 3 రాబోయే SUVల ఫీచర్ల గురించి వివరంగా తెలుసుకుందాం.
Also Read : క్రెటా, విటారాకు ఇక కష్టకాలం.. సరికొత్తగా వస్తున్న రెనాల్ట్ డస్టర్
హ్యుందాయ్ క్రెటా హైబ్రిడ్
హ్యుందాయ్ తన అత్యధికంగా అమ్ముడవుతున్న SUV క్రెటాను రాబోయే సంవత్సరాల్లో విడుదల చేయడానికి రెడీ అవుతుంది. మీడియా నివేదికల ప్రకారం, నెక్స్ట్-జెన్ హ్యుందాయ్ క్రెటా 2027 నాటికి మార్కెట్‌లోకి ప్రవేశించవచ్చు. కొత్త క్రెటాలో పవర్‌ట్రెయిన్ పరంగా హైబ్రిడ్ ఇంజన్ ఆప్షన్ లభిస్తుంది. దీనితో పాటు SUV డిజైన్, క్యాబిన్‌లో కూడా పెద్ద మార్పులు చూడవచ్చు.
హ్యుందాయ్ వెన్యూ ఫేస్‌లిఫ్ట్
హ్యుందాయ్ తన అత్యధికంగా అమ్ముడవుతున్న SUV వెన్యూని అప్‌డేట్ చేయడానికి సిద్ధమవుతోంది. హ్యుందాయ్ వెన్యూ ఫేస్‌లిఫ్ట్‌ను అనేకసార్లు భారతీయ రోడ్లపై టెస్టింగ్ సమయంలో గుర్తించారు. కొత్త వెన్యూ ఎక్స్‌టీరియర్, ఇంటీరియర్‌లో వినియోగదారులు పెద్ద మార్పులను చూడవచ్చు. అయితే SUV పవర్‌ట్రెయిన్‌లో ఎటువంటి మార్పులు ఉండే అవకాశం లేదు.
హ్యుందాయ్ టక్సన్ ఫేస్‌లిఫ్ట్
అప్ డేటెడ్ ఈ SUV ఇప్పటికే గ్లోబల్ మార్కెట్‌లో అమ్మకానికి అందుబాటులో ఉంది. కొత్త SUV కొత్తగా రూపొందించిన గ్రిల్, కొత్త స్కిడ్ ప్లేట్లు, కొత్త చక్రాలు, షార్ప్ లైటింగ్ ఎలిమెంట్స్‌తో వస్తుంది. అంతేకాకుండా SUV క్యాబిన్‌లో పూర్తిగా కొత్తగా డిజైన్ చేసిన డాష్‌బోర్డ్, ఒక కొత్త స్లీక్ కర్వ్డ్ డిస్‌ప్లే ఉన్నాయి. ఈ కొత్త మోడల్ ఈ సంవత్సరం చివరిలో లేదా 2026లో భారతదేశానికి వచ్చే అవకాశం ఉంది.