MG Windsor EV : ఇండియన్ మార్కెట్‌లో గత 8 నెలలుగా దుమ్మురేపుతున్న కారు అప్ డేట్ వెర్షన్ రాబోతుంది. ఈ కారు విడుదల కాగానే అత్యంత వేగంగా అమ్ముడయ్యే ఎలక్ట్రిక్ కారుగా రికార్డు సృష్టించడం ఖాయమని అంటున్నారు. ఇప్పటికే క్రెటా ఈవీ, నెక్సాన్ ఈవీలకు గట్టి పోటీనిచ్చిన ఈ కారు ఇప్పుడు మే 6న లాంగ్ రేంజ్ వెర్షన్‌తో మార్కెట్‌ను షేక్ చేయడానికి సిద్ధమవుతోంది. అసలు విషయం ఏంటంటే లాంచ్‌కు ముందే ఈ కారు గురించిన చాలా విషయాలు లీక్ అయ్యాయి.
ఎంజీ మోటార్ ఇండియా ఇటీవల విండ్‌సర్ ప్రో టీజర్‌లను విడుదల చేసింది. విండ్‌సర్ ఈవీ అప్‌గ్రేడెడ్ వేరియంట్ మే 6న విడుదల కానుంది. అయితే, ఇప్పుడు మరిన్ని ఆసక్తికరమైన విషయాలు బయటకు వచ్చాయి. ఎంజీ విండ్‌సర్ లాంగ్ రేంజ్ వేరియంట్‌కు విండ్‌సర్ ప్రో అని పేరు పెట్టింది.
ఈ కారు కొత్త మోడల్‌లో అల్లాయ్ వీల్ డిజైన్‌లో మార్పులు చేశారని మీడియా కథనాలు పేర్కొంటున్నాయి. ఇప్పుడు ఇది డైమండ్-కట్ ఫినిషింగ్‌తో కూడిన అల్లాయ్‌లను కలిగి ఉంటుంది. ఇవి హెక్టర్‌లో ఉపయోగించిన అల్లాయ్ వీల్స్ లాంటివే. ఇంకో విషయం ఏంటంటే.. దీనిపై ADAS (Advanced Driver Assistance Systems) బ్యాడ్జింగ్ కూడా ఉంటుంది. అంతేకాకుండా, కంపెనీ కొత్త కలర్ ఆప్షన్‌లను కూడా అందించవచ్చు. విండ్‌సర్ ఈవీలో ఇంతకుముందున్న క్లే బేజ్ కలర్ స్కీమ్‌ను కంపెనీ నిలిపివేసి దాని స్థానంలో సిల్వర్‌ను ప్రవేశపెట్టింది.
Also Read : ఎలక్ట్రిక్ కార్ మార్కెట్‌లో మరో సెన్సేషన్.. క్రెటా, పంచ్‌లకు చుక్కలే
విండ్‌సర్ ప్రో ఇంటీరియర్ విషయానికి వస్తే సీట్లను బేజ్ కలర్‌లో ఉంచనున్నారు. ఇవి బ్లాక్ సీట్ల కంటే కొంచెం ఎక్కువ ప్రీమియంగా కనిపిస్తాయి. వీటి ప్రధాన ప్రయోజనం ఏమిటంటే.. కారును ఎండలో పార్క్ చేసినప్పుడు తక్కువ వేడిగా ఉంటాయి. అయితే, బేజ్ సీట్లను ఎక్కువ కాలం శుభ్రంగా ఉంచడం కొంచెం కష్టమే. అవి చాలా త్వరగా మురికిగా మారిపోతాయి.
విండ్‌సర్ ప్రో ఫీచర్ల గురించి మాట్లాడితే సేఫ్టీ కోసం ఇప్పుడు ఇందులో ADAS టెక్నాలజీ ఉంటుంది. అంతేకాకుండా, V2L (Vehicle-to-Load) అనే కొత్త ఫీచర్‌ను కూడా చేర్చారు. దీని ద్వారా కారు బ్యాటరీని ఉపయోగించి ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను కూడా ఛార్జ్ చేసుకోవచ్చు. ఇంకా విండ్‌సర్ ప్రోలో ఎలక్ట్రిక్ టెయిల్‌గేట్ కూడా ఉంటుంది.
ప్రస్తుతం ఉన్న విండ్‌సర్ ఈవీ 38 kWh బ్యాటరీ ప్యాక్‌తో అందుబాటులో ఉంది. ఇది MIDC ప్రకారం 332 కిలోమీటర్ల రేంజ్‌ను అందిస్తుంది. అయితే విండ్‌సర్ ప్రోలో 50.6 kWh బ్యాటరీ ప్యాక్ ఉంటుంది. ఇది CLTC సైకిల్ ప్రకారం 460 కిలోమీటర్ల రేంజ్‌ను అందిస్తుందని కంపెనీ చెబుతోంది. కాబట్టి, పెద్ద బ్యాటరీ ప్యాక్‌తో, విండ్‌సర్ రేంజ్ ఖచ్చితంగా పెరుగుతుంది.
Also Read : పొగకు బై బై.. హ్యుందాయ్ నెక్సో హైడ్రోజన్ కారు వచ్చేసింది!