MG Motors :ఎంపీ మోటార్స్ (JSW MG Motor) గత ఏడాది సెప్టెంబర్‌లో విడుదల చేసిన విండ్‌సర్ EV కొత్త రికార్డు సృష్టించింది. ఇది భారతదేశంలో అత్యంత వేగంగా అమ్ముడవుతున్న మొదటి ఎలక్ట్రిక్ కారుగా నిలిచింది. విండ్‌సర్ ఈవీని కేవలం 6 నెలల్లో 20 వేల మందికి పైగా వినియోగదారులు కొనుగోలు చేశారు. విండ్‌సర్ ఈవీ భారతీయ మార్కెట్‌లో హ్యుందాయ్ క్రెటా EV, టాటా నెక్సాన్ EV, కర్వ్ EV, మహీంద్రా XUV400 EV, టాటా పంచ్ EV వంటి అనేక ప్రసిద్ధ కార్లకు పోటీనిస్తోంది.
Also Read : CNG కార్లలో ఏది బెస్ట్?
విండ్‌సర్ ఈవీ బ్యాటరీ, ఛార్జింగ్
విండ్‌సర్ ఈవీలో 38 kWh బ్యాటరీ ప్యాక్ ఉంది. ఇది 332 కిలోమీటర్ల పరిధిని అందిస్తుందని పేర్కొన్నారు. అయితే, వాస్తవ పరిస్థితుల్లో దీని పరిధి 260 నుండి 280 కిలోమీటర్ల వరకు ఉంటుంది. DC ఫాస్ట్ ఛార్జర్‌ను ఉపయోగించి బ్యాటరీని 55 నిమిషాల్లో పూర్తిగా ఛార్జ్ చేయవచ్చు. దీనిలో పోర్టబుల్ ఛార్జర్, వాల్ బాక్స్ ఛార్జర్ ఎంపిక కూడా ఉంది.
ఎంజీ విండ్‌సర్ ఈవీ ధర
విండ్‌సర్ ఈవీ ఎక్సైట్ వేరియంట్ ధర రూ.13,99,800, ఎక్స్‌క్లూజివ్ ట్రిమ్ ధర రూ.14,99,800, టాప్-ఎండ్ ఎసెన్స్ వేరియంట్ ధర రూ.15,99,800 (ఎక్స్-షోరూమ్). ఈ కారును ఎంజీ బ్యాటరీ యాజ్ ఎ సర్వీస్ ప్లాన్ కింద కొనుగోలు చేస్తే, కారు ధర దాదాపు 4 లక్షల రూపాయలు తగ్గుతుంది. అయితే, దీని సబ్‌స్క్రిప్షన్ ప్లాన్‌లో ప్రతి కిలోమీటర్ ప్రయాణానికి 3.5 రూపాయలు చెల్లించాలి. మొదటి కారు కొనుగోలుదారులకు బ్యాటరీపై లైఫ్ టైమ్ వారంటీని, ఇతర కొనుగోలుదారులకు 8 సంవత్సరాలు లేదా 1,60,000 కి.మీ వారంటీని అందిస్తున్నారు.
ఎంజీ విండ్‌సర్ ఈవీ ఫీచర్స్
ఈ ఎలక్ట్రిక్ కారు లోపల అద్భుతమైన ఇంటీరియర్ ఉంది. ఇందులో నైట్ బ్లాక్ ఇంటీరియర్, రాయల్ టచ్ గోల్డ్ ఇంటీరియర్ హైలైట్స్, లెదర్ ప్యాక్ డ్రైవర్ ఆర్మ్‌రెస్ట్, ఫాబ్రిక్ సీట్ అప్హోల్‌స్టరీ, 60:40 వెనుక స్ప్లిట్ సీట్, ముందు, వెనుక హైట్ అడ్జస్టబుల్ చేయగల హెడ్‌రెస్ట్, ఓపెన్ ఫ్రంట్ కన్సోల్ స్టోరేజ్, LED లగేజ్ ల్యాంప్, వెనుక AC వెంట్లు, LED ఫ్రంట్ రీడింగ్ ల్యాంప్ వంటి సౌకర్యాలు ఉన్నాయి. ఈ ఎలక్ట్రిక్ కారులో ఎలక్ట్రిక్ పార్కింగ్ బ్రేక్, 6 ఎయిర్‌బ్యాగ్‌లు, ESP, ESS, డిస్క్ బ్రేక్‌లు, చైల్డ్ లాక్, అన్ని సీట్ల సీట్‌బెల్ట్ రిమైండర్ వంటి 19 సేఫ్టీ ఫీచర్లు ఉన్నాయి.
Also Read : SUV వెర్షన్ లో అమ్మకాల రాజు.. నెలకు 7 వేలకు పైగా విక్రయం.. ఈ కారు గురించి తెలుసా?