Homeబిజినెస్MG Motors : ఎంజీ నుంచి మరో సెన్సేషన్.. ఈ ఏడాదిలో 2 అదిరిపోయే కార్లు

MG Motors : ఎంజీ నుంచి మరో సెన్సేషన్.. ఈ ఏడాదిలో 2 అదిరిపోయే కార్లు

MG Motors : కొత్త ప్రీమియం కారు కొనాలని ఆలోచిస్తున్నారా.. అయితే ఈ వార్తను తప్పకుండా చదవండి. ఎంజీ మోటార్ ఈ ఏడాది అనేక కొత్త ప్రీమియం మోడళ్లను విడుదల చేయడానికి రెడీ అవుతుంది. కంపెనీ రాబోయే మోడళ్లలో ఎంజీ M9, మ్యాజెస్టర్ ఉన్నాయి. కంపెనీ ఆటో ఎక్స్‌పో 2025లో ఎంజీ M9ని ఆల్రెడీ ప్రదర్శించింది. అంతేకాకుండా కంపెనీ దీని ప్రీ-బుకింగ్‌లను కూడా ప్రారంభించింది. ఈ రెండు రాబోయే కార్ల ఫీచర్ల గురించి వివరంగా తెలుసుకుందాం.

Also Read : బడ్జెట్ రెడీ చేసుకోండి.. త్వరలో హ్యుందాయ్ నుంచి  3 కొత్త SUVలు

కంపెనీ ఎంజీ M9లో ఎలక్ట్రికల్‌గా స్లైడింగ్ బ్యాక్ డోర్స్,టెయిల్‌గేట్, మసాజ్, మెమరీ, వెంటిలేషన్, పవర్ అడ్జస్ట్‌మెంట్ ఫంక్షన్‌లతో కూడిన లేటెస్ట్,సెకండ్-రో సీట్లు వంటి ప్రీమియం ఫీచర్లను అందించవచ్చు. దీనితో పాటు MPVలో 64-కలర్ యాంబియంట్ లైటింగ్ సిస్టమ్, లేన్ కీపింగ్ అసిస్ట్, బ్లైండ్ స్పాట్ డిటెక్షన్, రియర్ అటానమస్ ఎమర్జెన్సీ బ్రేకింగ్ సిస్టమ్, రియర్ కలెక్షన్ వార్నింగ్ సిస్టమ్ , 360º కెమెరా సిస్టమ్ కూడా ఇవ్వవచ్చు.

400 కిమీ కంటే ఎక్కువ రేంజ్
పవర్‌ట్రెయిన్ గురించి మాట్లాడితే MG M9లో 90 kWh బ్యాటరీ ప్యాక్‌ను ఉపయోగిస్తున్నారు. ఎంపీవీ బ్యాటరీని kW (AC), 150 kW (DC) ఛార్జర్‌తో ఛార్జ్ చేయవచ్చు. ఈ ఎంపీవీ రేంజ్ దాదాపు 430 కిమీ ఉంటుందని మీడియా నివేదికలు పేర్కొంటున్నాయి.

త్వరలో రానున్న మ్యాజెస్టర్
మరోవైపు కంపెనీ ఈ ఏడాది తన పాపులర్ మరో మోడల్ మ్యాజెస్టర్‌ అప్ డేటెడ్ వెర్షన్ కూడా విడుదల చేయవచ్చు. ఇది గ్లోస్టర్ ఫేస్‌లిఫ్టెడ్ వెర్షన్. డిజైన్ పరంగా SUVలో క్రాస్-బార్ పెద్ద, స్కైర్ షేప్ రేడియేటర్ గ్రిల్, చంకీయర్ స్కిడ్ ప్లేట్, స్ప్లిట్ హెడ్‌ల్యాంప్, కనెక్టెడ్ టెయిల్ ల్యాంప్, కొత్త ఎగ్జాస్ట్ అవుట్‌లెట్‌లు ఉంటాయి. దీనితో పాటు ఇంటీరియర్‌లో 12.3-అంగుళాల డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, కొత్త 12.3-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ కూడా ఇవ్వనున్నారు.

పవర్‌ట్రెయిన్ ఇలా ఉండవచ్చు
పవర్‌ట్రెయిన్ పరంగా SUVలో 2.0-లీటర్ డీజిల్ ఇంజన్ ఉంటుంది. ఇది 159bhpపవర్, 373.5Nm పీక్ టార్క్‌ను ప్రొడ్యూస్ చేయగలదు. కంపెనీ ఈ కారు ఇంజన్‌ను 8-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ , ఆన్-డిమాండ్ 4WD సిస్టమ్‌తో అందించనుంది. ఈ కొత్త మోడల్ మేలో విడుదలయ్యే అవకాశం ఉంది.

Also Read : కియారాకు కోట్ల విలువైన గిఫ్ట్.. సిద్ధార్థ్ ఇచ్చిన లగ్జరీ కారు చూస్తే వావ్ అనాల్సిందే!

Rakesh R
Rakesh Rhttps://oktelugu.com/
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
RELATED ARTICLES

Most Popular