https://oktelugu.com/

Mercedes Benz: మెర్సిడెజ్ బెంజ్ నుంచి కొత్త కారు.. దీని ధర తెలిస్తే చెమటలు పడుతాయి..

2025 కొత్త ఏడాది సందర్భంగా చాలా కంపెనీలు కొత్త కార్లను మార్కెట్లోకి తీసుకొచ్చాయి. ఈ నేపథ్యంలో Mercedes నుంచి కొత్త కారును రిలీజ్ చేశారు. EQS 450 అనే పేరుతో ఉన్న ఈ మోడల్ SUV వేరియంట్ లో మార్కెట్లోకి వచ్చింది.

Written By:
  • Swathi Chilukuri
  • , Updated On : January 11, 2025 / 06:14 PM IST

    Mercedes Benz

    Follow us on

    Mercedes Benz: భారత్ లో కార్ల వినియోగం రోజురోజుకు పెరిగిపోతుంది. అయితే ఇండియన్లు హ్యాచ్ బ్యాక్ కార్లతో పాటు లగ్జరీ కార్లను కూడా సొంతం చేసుకోవడానికి వెనుకాడడం లేదు. అనాది కాలం నుంచి ధనవంతులు లగ్జరీ కార్లలో తిరగాలన్న కోరిక ఉండేది. కానీ ఇప్పుడు సామాన్యులు సైతం ప్రీమియం కార్ల కోసం సెర్చ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో విదేశీ కంపెనీకి చెందిన కొన్ని ఖరీదైన కార్లు భారత్ లో మంచి విక్రయాలు జరుపుకుంటున్నాయి. వీటిలో జర్మనీకి చెందిన Mercedes Benzకారు అత్యంత ప్రాముఖ్యత పొందింది. బెంజ్ కారు ఉంటే వారిని ప్రత్యేకంగా కీర్తిస్తారు. గత 30 సంవత్సరాలుగా ఈ కారు భారతీయులను ఆకట్టుకుంటోంది. వినియోగదారులకు మరింత చేరువ కావడానికి కొత్త ఏడాది 2025లో కొన్ని మోడళ్లను పరిచయం చేశారు. ఆ కార్లు ఎలా ఉన్నాయో చూద్దాం..

    2025 కొత్త ఏడాది సందర్భంగా చాలా కంపెనీలు కొత్త కార్లను మార్కెట్లోకి తీసుకొచ్చాయి. ఈ నేపథ్యంలో Mercedes నుంచి కొత్త కారును రిలీజ్ చేశారు. EQS 450 అనే పేరుతో ఉన్న ఈ మోడల్ SUV వేరియంట్ లో మార్కెట్లోకి వచ్చింది. ఇందులో పెట్రోల్ కు బదులుగా బ్యాటరీని చేర్చారు. దీంతో ఇది ఎలక్ట్రిక్ కారుగా గుర్తింపు పొందింది. ఈ బ్యాటరీ 355 బీహెచ్ పీ పవర్ తో పనిచేస్తుంది. 800 ఎన్ ఎం టార్క్ ను రిలీజ్ చేయనుంది. 120 కిలో వాట్ బ్యాటరీ ప్యాక్ ను కలిగిన ఈ బ్యాటరీని ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే 820 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది. అంతేకాకుండా 6.1 సెకన్లలో 100 కిలోమీటర్ల అందుకునే వేగం ఉంది. అయితే 200 కిలోవాట్ ఫాస్ట్ చార్జ్ కావడానికి డీసీ ఛార్జర్ ను అమర్చారు.

    EQS 450 బ్యాటరీ 80 శాతం ఛార్జింగ్ కావడానికి 31 నిమిషాలు పడుతుంది. ఇందులో 21 అంగుళాల అల్లాయ్ వీల్స్ ఆకట్టుకునే విధంగా ఉన్నాయి. 4 మ్యాటిల్ ఆల్ వీల్ డ్రైవ్ సిస్టమ్ ను అమర్చారు. ఎల్ ఈడీ లైట్స్, బంపర్ పై సిల్వర్ ఎలిమెంట్స్ ఆకర్షించే విధంగా ఉన్నాయి. వీటితో పాటు ఇంటీరియర్ లో లేటేస్ట్ టెక్నాలజీతో కూడిన ఫీచర్లు ఉన్నాయి. సౌండింగ్ కోసం 5 స్పీకర్స్, ఇల్యూమినేటెడ్ రన్నింగ్ బోర్డ్స్ అమర్చారు. మెరుగైన డ్యాష్ బోర్డుతో పాటు యాపిల్ కార్ ప్లే వంటివి ఉన్నాయి.

    ఈ ఖరీదైన కారులో సేప్టీ ఫీచర్స్ కోసం 360 డిగ్రీ కెమెరాను అమర్చారు. ఇందులో మొత్తం 9 ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి. లెవల్ 2 అడాస్ ఫంక్షన్, యాక్టివ్ స్టీరింగ్ వంటివి ఆకర్షిస్తాయి. EQS 450 కొనుగోలు చేయాలంటే భారీ మొత్తం చెల్లించాలి. ఈ కారు మార్కెట్లో రూ.1.28 కోట్ల తో విక్రయిస్తున్నారు. దీనిని వచ్చే ఆటో ఎక్స్ పో లో ప్రదర్శించే అవకాశం ఉంది. శక్తివంతమైన ఎలక్ట్రిక్ బ్యాటరీతో పాటు ఆకట్టుకునే ఫీచర్స్ ఈ కారుకు హైలెట్ అని అంటున్నారు. మరి ఈ కారు సేల్స్ ఏ విధంగా ఉంటాయో చూడాలి.