https://oktelugu.com/

Matuthi eVX : మారుతి నుంచి తొలి eVX.. ధర తెలిస్తే కళ్లు తిరుగుతాయి..

కారు ధర గురించి పూర్తి వివరాలు బయటకు రాలేదు. కానీ రూ.25 లక్షల ప్రారంభ ధర ఉండే అవకాశాలు ఉన్నాయని అంచనా వేస్తున్నారు. అలాగే 5 సీటర్ కలిగిన eVX.. భవిష్యత్ లో వినియోగదారులను ఆకర్షించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని కంపెనీ ప్రతినిధులు తెలుపుతున్నారు.

Written By:
  • Srinivas
  • , Updated On : March 16, 2024 / 10:41 AM IST

    Maruthi evx

    Follow us on

    Matuthi eVX :కార్లు కొనాలనుకునేవారికి మారుతి కంపెనీ అందుబాటులో ఉంటుంది. వారికి కావాల్సిన విధంగా మోడళ్లను తయారు చేస్తోంది. హ్యాచ్ బ్యాక్ నుంచి ఎస్ యూవీల వరకు మారుతి కార్లంటే ఇష్టం లేని వారు తక్కువే అని చెప్పాలి. అయితే ఈ కంపెనీ ఓ వైపు సాంప్రదాయ కొనుగోలుదారులతో పాటు లేటేస్ట్ గా కోరుకునేవారికి అనుగుణంగా ఉత్పత్తులను చేస్తుంది. ఇందులో భాగంగా తాజాగా ఎలక్ట్రిక్ కారును మార్కెట్లోకి తీసుకురాబోతుంది. అయితే దీని గురించి ముందుగానే సమాచారం బయటకు రావడంతో కార్ల కొనుగోలుదారులు ఇంప్రెస్ అవుతున్నారు. ఈ సందర్భంగా మారుతి అందించే ఈ తొలి ఎలక్ట్రిక్ కారు ఎలా ఉంది? దాని ధర ఎంతో తెలుసుకుందాం..

    ప్రస్తుతం ఎలక్ట్రిక్ కార్ల హవా సాగుతోంది. ఈ నేపథ్యంలో మారుతి సైతం విద్యుత్ కారును తయారు చేస్తోంది. ఇప్పటి వరకు హ్యాచ్ బ్యాక్, కాంపాక్ట్ ఎస్ యూవీలను అందించిన మారుతి.. తొలిసారిగా ఎలక్ట్రిక్ కారు EV eVXను మార్కెట్లోకి తీసుకురాబోతుంది. దీనిని 2024 భారత మొబలిటీ ఎక్స్ పోలో ప్రదర్శించింది. EV eVXను పూర్తిగా పరీక్షించారు. ఇందులో ఫ్రంట్ ఫెండర్ పై మౌంట్ చేసిన ఛార్జింగ్ పోర్ట్ ఉంది. ఫ్రంట్ కెమెరాతో పాటు ORVM కింద మరో కెమెరా, వెనుక డోర్లపై మౌంటెడ్ హ్యాండిల్స్ ఆకట్టుకుంటున్నాయి. దీనిని ADS టెక్ కోసం ఉపయోగించే అవకాశం ఉందని తెలుస్తోంది.

    పూర్తి స్థాయి SUV అనుకునే ఈ కారులో పెద్ద స్టాండింగ్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, డిజిటల్ డ్రైవర్ డిస్ ప్లే ను అమర్చారు. eVX ఆటో డిమ్మింగ్, IRVM, బ్లైండ్ స్పాట్ మానిటర్ ఆకర్సి్తుంది. బిగ్ డిస్ ప్లే, వైర్ లెస్ చార్జర్ తో పాటు ఆటోమేటిక్ క్లైమేట్ సిస్టమ్ తో ప్రయాణికులకు పూర్తి రక్షణ ఉంటుంది. వీటితో పాటు పవర్డ్ డ్రైవర్ సీటు, వెంటిలేటేడ్ ఫ్రంట్ సీట్లు, కొత్త స్టీరింగ్ తో ప్రయాణం సులభతరం అవుతుంది.

    ఈ ఎలక్ట్రిక్ కారులో 60kWh బ్యాటరీ ప్యాక్ ను అమర్చారు. దీనిని ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే 550 కిలోమీటర్ల వరకు దూసుకెళ్తుంది. అయితే కారు ధర గురించి పూర్తి వివరాలు బయటకు రాలేదు. కానీ రూ.25 లక్షల ప్రారంభ ధర ఉండే అవకాశాలు ఉన్నాయని అంచనా వేస్తున్నారు. అలాగే 5 సీటర్ కలిగిన eVX.. భవిష్యత్ లో వినియోగదారులను ఆకర్షించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని కంపెనీ ప్రతినిధులు తెలుపుతున్నారు.