https://oktelugu.com/

2024 Maruthi Swift: మరో వారంలో మార్కెట్లోకి 2024 స్విప్ట్.. క్రాష్ టెస్టింగ్ లో ఎంత రేటు సాధించిందో తెలుసా?

2024 స్విప్ట్ మరో వారంలో ఆటోమోబైల్ మార్కెట్లోకి రాబోతుంది. జపాన్ న్యూ కార్ అసెస్ మెంట్ ప్రోగ్రామ్ (JNCAP) క్రాష్ టెస్టింగ్ లో 4 స్టార్ రేటింగ్ పొందింది.

Written By:
  • Srinivas
  • , Updated On : April 22, 2024 / 02:01 PM IST

    Maruthi crash testing

    Follow us on

    2024 Maruthi Swift:  మారుతి కంపెనీకి చెందిన సుజుకీ స్విప్ట్ ఎవర్ గ్రీన్ గా నిలుస్తోంది. ఈ కారు కు ఆదరణ ఇప్పటికీ పెరిగిపోతుంది. అయితే పాత మోడల్ స్థానంలో స్విప్ట్ నెక్ట్స్ జనరేషన్ త్వరలో మార్కెట్లోకి రాబోతుంది. దీని గురించి ఇప్పటికే ఆన్ లైన్ లో వివరాలను పొందుపర్చారు. దీంతో కారు మార్కెట్లోకి రాకముందే క్రేజ్ పెరిగింది. తాజాగా కొత్త స్విప్ట్ క్రాష్ టెస్టింగ్ చేసుకుంది. ఇందులో వచ్చిన రేటింగ్ పై అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇంతకీ 2024 స్విప్ట్ క్రాష్ టెస్టింగ్ లో ఎంత రేటింగ్ సాధించుకుందో చూద్దాం..

    2024 స్విప్ట్ మరో వారంలో ఆటోమోబైల్ మార్కెట్లోకి రాబోతుంది. జపాన్ న్యూ కార్ అసెస్ మెంట్ ప్రోగ్రామ్ (JNCAP) క్రాష్ టెస్టింగ్ లో 4 స్టార్ రేటింగ్ పొందింది. ఈ టెస్టింగ్ లో మొత్తం స్విప్ట్ 197కు 177.8 పాయింట్లు సాధించింది. దీంతో ఈ కారు ద్వారా రక్షణ సదుపాయం ఎక్కువే అని తెలుస్తోంది. అయితే ఫ్రంట్ సీట్లలో కూర్చున్న వారి కంటే వెనుక సీట్లలో కూర్చున్న వారి సేప్టీ తక్కవే అని చెప్పాలి. ఫ్రంట్ ఆఫ్ సెట్ లో 12 కు 10.4 పాయింట్లు సాధించగా.. బ్యాక్ సేప్టీ విషయంలో 12 కి 7.66 పాయింట్లు మాత్రమే సాధించింది.

    2018లో స్విప్ట్ భారత మార్కెట్లో NCAP టెస్ట్ లో 2 స్టార్ రేటింగ్ మాత్రమే సాధించింది. జపాన్ లో మాత్రం 4 స్టార్ సాధించింది. కొత్త మారుతిలో వేగంగా ప్రయాణించిప్పుడు, తీవ్ర ప్రమాదాలు ఏర్పడినప్పుడు భద్రత తక్కువగా ఉంటుందని తెలుస్తోంది. ఎందుకంటే పాత స్విప్ట్ కంటే కొత్త స్విప్ట్ మెరుగైన స్టార్ ను పొందింది. ఈ నేపథ్యంలో కొత్త కారును సొంతం చేసుకోవడానికి ఇప్పటికే చాలా మంది బుకింగ్ చేసుకుంటున్నారు.

    2024 మే మొదటి వారంలో ఈ కారు లాంచ్ కానుంది. రూ.11,000 చెల్లించి దీనిని బుకింగ్ చేసుకోవచ్చు. అయితే ప్రస్తుతం అంచనా రూ.7 లక్షల ప్రారంభ ధర అని అంచనా వేస్తున్నారు. కానీ లాంచింగ్ సమయంలోనే అధికారికంగా ధరను ప్రకటించే అవకాశం ఉంది. కొత్త స్విప్ట్ 1.2 లీటర్ 3 సిలిండర్ పెట్రోల్ ఇంజిన్ ను కలిగి ఉంది. హ్యాచ్ బ్యాక్ వేరియంట్ లో రాబోతున్న ఈ కారు కోసం చాలా మంది వినియోగదారులు ఎదురుచూస్తున్నారు.