Maruti Suzuki WagonR 2026: Maruti Suzuki నుంచి దశాబ్దాల కింద మార్కెట్లోకి వచ్చిన కొన్ని కార్లు ఇప్పటికీ సేల్స్ అవుతున్నాయి అంటే ఆ కార్ల వాల్యూ ఏంటో అర్థం చేసుకోవచ్చు. అయితే నేటి తరం వారికి అనుగుణంగా ఈ కార్లను అప్డేట్ చేస్తూ మార్కెట్లోకి తీసుకువస్తున్నారు. మారుతి సుజుకి నుంచి రిలీజ్ అయిన వ్యాగన్ఆర్ మోడల్ ను చాలామంది సొంతం చేసుకున్నారు. అయితే ఈ కారు ఇప్పుడు 2026 కొత్త సంవత్సరం సందర్భంగా మార్కెట్లోకి రాబోతుంది. దీని ఫీచర్లు, టెక్నాలజీ, ఇంజన్ పనితీరును ఇప్పటి వారికి అనుగుణంగా మార్చేశారు. కొత్తగా రాబోతున్న ఈ కారు ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం..
Maruti Suzuki Wagon R కారు అనగానే చాలామందికి ఆసక్తిగా ఉంటుంది. 2026 కొత్త సంవత్సరంలో వచ్చే ఈ కారులో ఇంజన్ పనితీరును మెరుగుపరిచారు. ఇందులో ఉన్న ఇంజన్ 1.0 లీటర్ పెట్రోల్ ఇంజన్ తో పని చేయనుంది. దీంతోపాటు CNG ఆప్షన్ కూడా ఉంది. ఇప్పటివరకంటే ఈ ఇంజన్ను మెరుగుపరచడంతో మరింత స్మూత్ నెస్ తో పాటు మైలేజ్ పెరిగిందని చెప్పుకోవచ్చు. గతంలో 30 కిలోమీటర్ల లోపు మైలేజ్ ఇచ్చే ఈ కారు ఇప్పుడు 34 కంటే ఎక్కువగా దూరం ప్రయాణం చేయవచ్చు. చిన్న ఫ్యామిలీతో పాటు కొత్తగా కారు కొనాలనుకునే వారికి బడ్జెట్ కు అనుగుణంగా ఈ కారు ఉంటుంది. అలాగే ఈ కారు ఇంజిన్ పై మాన్యువల్ తో పాటు ఆటోమేటిక్ గేర్ షిఫ్టును కూడా డెవలప్ చేశారు. దీంతో ట్రాఫిక్ లోనూ స్మూత్ గా ప్రయాణం చేసే అవకాశం ఉంది.
వ్యాగన్ఆర్ కారు డిజైన్ విషయంలో గతంలో కొంతమందికి అనాసక్తి ఉండేది. కానీ ఇప్పుడు యూత్ కు సైతం నచ్చే విధంగా దీని డిజైన్ ను మార్చేశారు. క్యాబిన్ స్పేస్ ను పెంచుతూ విశాలంగా ఉండే విధంగా మార్చేశారు. ఈ కొత్త కారులో సిగ్నేచర్ టాల్ – బాయ్ డిజైన్ ఉండనుంది. దీంతో ఇంటీరియర్ లో స్థలం పెరిగే అవకాశం ఉంది. ఈ కారు ఇంటీరియర్ విషయానికి వస్తే.. 5 సీటర్ ఉండనుంది. వీటితో పాటు వాటర్ బాటిల్ ఉండే విధంగా సెట్ చేశారు. పవర్ విండోస్ తో పాటు ఆటోమేటిక్ ఏసీ కనెక్టివిటీ, కీ లెస్ ఎంట్రీ అప్డేట్ అయ్యాయి. అలాగే ఇందులో ఫీచర్లు కూడా నేటి తరం వారికి అనుగుణంగా ఉన్నాయి. స్మార్ట్ ఫోన్ కనెక్టివిటీతో పాటు ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఉండేవిధంగా సాఫ్ట్వేర్లు అప్డేట్ చేశారు. ఆపిల్ కార్ ప్లే తో కూడిన టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టం ఇందులో ఆకర్షిస్తుంది.
సేఫ్టీ కోసం ఈ కొత్త కారులో సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ ను ఏర్పాటు చేశారు. గతంలో ఉన్న కారు రూ.5 లక్షల లోపు వచ్చేది. కానీ ఇందులో ఫీచర్లు అప్డేట్ చేయడంతో దీనిని రూ.6.25 లక్షల ప్రారంభ ధర నుంచి రూ.6.95 లక్షల వరకు విక్రయించే అవకాశం ఉంది.