https://oktelugu.com/

Maruti Suzuki Swift : ఈ కారు మైలేజీకి ఫిదా అవుతున్న కస్టమర్లు.. ఇక సీఎన్‌జీకి చెక్ పడినట్లే..!

గత మోడళ్ల కంటే కొత్త స్వీఫ్ట్ లో కస్టమర్ల భద్రతపై కంపెనీ శ్రద్ధ తీసుకుంది. ఇది 6 ఎయిర్‌బ్యాగులు, ముందు, వెనుక సీట్లకు సీట్‌ బెల్ట్ లు రిమైండర్‌తో కూడిన 3 పాయింట్ సీట్‌బెల్ట్‌లు,

Written By:
  • NARESH
  • , Updated On : May 25, 2024 10:00 pm
    Maruti Suzuki Swift

    Maruti Suzuki Swift

    Follow us on

    Maruti Suzuki Swift : ఇండియా దిగ్గజ కంపెనీ మారుతి సుజుకీ ఇప్పటి వరకు ఎటువంటి ఎలక్ట్రిక్ కారును విడుదల చేయలేదు. అయినప్పటికీ సంప్రదాయ ఇంధన కార్లతో మార్కెట్లో ఎప్పుడూ ముందే ఉంటుంది. ఇప్పటికే CNG కార్ల రంగంలో సత్తా చాటుకుంది. దేశంలో CNG కార్లను అత్యధికంగా విక్రయిస్తుంది. ఇప్పుడు కంపెనీ వినియోగదారుల కొత్త అవసరాలకు అనుగుణంగా పెట్రోల్ కార్లను సిద్ధం చేస్తోంది. గతంలో కంటే మెరుగైన ఇంజిన్ పనితీరు, డిజైన్, ఫీచర్లు, మైలేజీతో పరిచయం చేసిన కొత్త తరం స్విఫ్ట్‌ను రీసెంట్ గా రిలీజ్ చేసింది.

    కొత్త స్విఫ్ట్‌లో ప్రత్యేకత ఏంటంటే దాని కొత్త 1.2 లీటర్ Z-సిరీస్ ఇంజిన్. ఇది గతంలోని లాగా 4 సిలిండర్ ఇంజిన్ కాదు. వైబ్రేషన్ కూడా తక్కువగా ఉండే 3 సిలిండర్ ఇంజిన్. ఇది గతంలో వాటి కంటే ఎక్కువ ఇంధన సామర్థ్యం కలిగి ఉందని కంపెనీ స్పష్టం చేసింది. ఇది కాకుండా కంపెనీ కస్టమర్ల భద్రతపై పూర్తి శ్రద్ధ వహించింది. అన్ని వేరియంట్లలో కొన్ని భద్రతా లక్షణాలను ప్రామాణికంగా ప్రవేశ పెట్టింది. కొత్త స్విఫ్ట్ మైలేజ్ AMT వేరియంట్‌లో అద్భుతమైనది. దీని కారణంగా దాని ధర విభాగంలో అత్యంత ఇంధన సామర్థ్యం కారుగా మారింది.

    కొత్తతరం స్విఫ్ట్ ధర ఎక్స్ షోరూమ్ ధర రూ. 6.49 లక్షల నుంచి మొదలవుతుంది. టాప్ వేరియంట్ ధర ఎక్స్ షోరూమ్ ధర రూ. 9.65 లక్షలు వరకు ఉంటుంది. కొత్త తరం స్విఫ్ట్ 5 వేరియంట్లలో తీసుకువచ్చారు. – LXi, VXi(O), VXi, ZXi, ZXi+. ఈ కారు 9 విభిన్న కలర్లలో అందుబాటులో ఉంది.

    AMTలో మైలేజీ..
    కొత్త స్విఫ్ట్ టెక్నాలజీ, స్టాండర్డ్ కు సాటిలేని కలయిక అని కంపెనీ పేర్కొంది. స్విఫ్ట్ 1.2 లీటర్ Z-సిరీస్ మైల్డ్ హైబ్రిడ్ ఇంజిన్‌ను కలిగి ఉంది. మునుపటి కారు కంటే ఎక్కువ ఇంధన సామర్థ్యం కలిగి ఉందని కంపెనీ పేర్కొంది. 82 హెచ్‌పీ పవర్, 108 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. మాన్యువల్ గేర్‌బాక్స్‌తో పాటు, ఇంజిన్ కూడా CVT ట్రాన్స్‌మిషన్‌తో ఉంటుంది. ఇది దాని మాన్యువల్ వేరియంట్లలో 24.8 కేఎంపీఎల్ మైలేజీని ఇస్తుంది, AMT వేరియంట్లలో 25.75 కేపీఎంల్ మైలేజీని ఇస్తుందని కంపెనీ పేర్కొంది.

    ఫీచర్ల గురించి తెలుసుకుంటే.. కొత్త స్విఫ్ట్‌లో9 అంగుళాల టచ్‌ స్క్రీన్, 6 స్పీకర్ ఆర్కామిస్ ఆడియో సిస్టం, వెనుక వెంట్‌తో కూడిన ఆటోమేటిక్ ఏసీ, వైర్‌ లెస్ ఫోన్ ఛార్జింగ్, క్రూయిజ్ కంట్రోల్, పుష్-బటన్ స్టార్ట్/ స్టాప్, కనెక్ట్ ఉన్నాయి.

    New Maruti Suzuki Swift | Detail Review In Telugu  | 2024 Swift | 4th Gen Swift | V automobiles

    మునుపటి కంటే భద్రత..
    గత మోడళ్ల కంటే కొత్త స్వీఫ్ట్ లో కస్టమర్ల భద్రతపై కంపెనీ శ్రద్ధ తీసుకుంది. ఇది 6 ఎయిర్‌బ్యాగులు, ముందు, వెనుక సీట్లకు సీట్‌ బెల్ట్ లు రిమైండర్‌తో కూడిన 3 పాయింట్ సీట్‌బెల్ట్‌లు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రాం (ESP), హిల్ హోల్డ్ అసిస్ట్, ఎలక్ట్రానిక్ బ్రేక్ ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్ (EBD), యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్ (ABS), బ్రేక్ అసిస్ట్ (BA) వంటి ఫీచర్లు ఉన్నాయి. ఇందులో విశేషం ఏంటంటే అన్ని ఫీచర్లు స్టాండర్డ్ గా ఉన్నాయి. అంటే స్విఫ్ట్ టాప్ మోడల్‌తో పాటు బేస్ మోడల్‌లోనూ ఈ ఫీచర్లు అన్నీ ఉన్నాయి.

    2024 Maruti Swift Exclusive Telugu Review | Price, Mileage, Engine specs, etc.