Bank Holidays : అకౌంట్స్ హోల్డర్స్ అలర్ట్.. వచ్చే నెలలో బ్యాంకులు ఇన్ని రోజులు హాలిడే..

ప్రతీ ఆదివారం పని చేయవు. అలాగే సెకండ్, ఫోర్త్ సాటర్ డే (శనివారం) కూడా హాలిడేనే. వీటిని కలుపుకుంటే.. బ్యాంక్ లకు చాలా హాలిడేలు ఉన్నాయని తెలుస్తుంది.

Written By: NARESH, Updated On : May 25, 2024 10:04 pm

How many Bank Holidays next month

Follow us on

Bank Holidays : ఆర్థిక లావాదేవీలకు కేంద్రమైన బ్యాంకులు మూసి ఉంటే ఖాతాదారులు చాలా ఇబ్బందులు పడతారని మనకు తెలిసిందే. ఎంత డిజిటలైజేషన్ వచ్చినా పెద్ద మొత్తంలో డబ్బు వేయాలన్నా.. తీయాలన్నా.. బ్యాంకులకు వెళ్లాల్సిందే. ఇక ఏవైనా సమస్యలు ఎదురైనా బ్యాంకులను ఆశ్రయించాల్సిందే. అయితే ఆ బ్యాంకులు ఎక్కువ రోజులు మూసి ఉంటే ఎంతటి ఇబ్బందులు ఎదురవుతాయంటే?

దేశంలో వచ్చే నెలలో బ్యాంకులకు ఎక్కువ హాలిడేస్ ఉన్నాయి. ఏఏ రోజుల్లో బ్యాంకులకు హాలిడే ఉందో మనం పరిశీలిద్దాం. బ్యాంక్ హాలిడేస్ అనేవి ఒక్కో రాష్ట్రంలో ఒక్కో విధంగా ఉంటాయి. ఒక రాష్ట్రంలో బ్యాంక్ లకు హాలిడే ఉంటే.. మరో రాష్ట్రంలో పని చేయవచ్చు. ఆ రాష్ట్రాన్ని బట్టి మారుతూ ఉంటాయి. ఏఏ ప్రాంతంలో ఎప్పుడెప్పుడు పని చేయవో చూద్దాం.

జాతీయ పండుగలైన రిపబ్లిక్ డే, స్వాతంత్య్ర దినోత్సవం, గాంధీ జయంతి, క్రిస్టమస్ రోజుల్లో పని చేయవు. వీటిని జాతీయ సెలవులు అంటారు. మతపరమైనవి కొన్ని ఉంటాయి. అవి దీపావళి, దసరా, వినాయక చవితి, బుద్ధపూర్ణిమ, ఈద్ ఈ రోజుల్లో కూడా బ్యాంకులకు హాలిడే.

ప్రతీ ఆదివారం పని చేయవు. అలాగే సెకండ్, ఫోర్త్ సాటర్ డే (శనివారం) కూడా హాలిడేనే. వీటిని కలుపుకుంటే.. బ్యాంక్ లకు చాలా హాలిడేలు ఉన్నాయని తెలుస్తుంది. వచ్చే నెల జూన్ లో ఏఏ రోజుల్లో బ్యాంకులు పని చేయవో చూద్దాం.

జూన్ లో సాధారణ జాతీయ సెలవులు లేవు. 2 జూన్, 2024, ఆదివారం తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం బ్యాంకులు పని చేయవు. 9 జూన్, 2024, ఆదివారం కూడా క్లోజ్‌. అదే రోజు మహారాణా ప్రతాప్ జయంతి. హిమాచల్ ప్రదేశ్, రాజస్థాన్‌, హర్యానాలో ఘనంగా నిర్వహిస్తారు. 10 జూన్, 2024, సోమవారం శ్రీగురు అర్జున్ దేవ్ జీ బలిదానం రోజు. ఈ రోజు పంజాబ్‌లో బ్యాంకులకు సెలవు.

14 జూన్, 2024 శుక్రవారం పహిలి రాజా. ఒరిస్సాలో ఈ రోజు బ్యాంకులు క్లోజ్. 15 జూన్, 2024 శనివారం కూడా అక్కడ రాజా సంక్రాంతి. ఈ రోజున ఒరిస్సాలో బ్యాంకులు పని చేయవు.

15 జూన్, 2024 శనివారం వైఎంఏ డే. మిజోరంలో సెలవు. 17 జూన్, 2024, సోమవారం బక్రీద్. కొన్ని రాష్ట్రాలు మినహా జాతీయ సెలవు.

21 జూన్, 2024 శుక్రవారం సావిత్రి వ్రతం. కొన్ని రాష్ట్రాల్లో పని చేయవు. ఛత్తీస్‌గఢ్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, పంజాబ్‌లో పని చేయవు. 30 జూన్, 2024 ఆదివారం సెలవు.

ఇవి కేవలం బ్యాంకులకు సెలవులు మాత్రమే. ఈ రోజుల్లో బ్యాంకుతో నేరుగా పని పెట్టుకుంటే కష్టం గానీ డిజిటల్ మనీని ట్రాన్స్ ఫర్ చేసుకోవచ్చు. ఫోన్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్ సేవలు పొందవచ్చు.