Maruti Suzuki Grand Vitara SUV: దేశంలో టాప్ పొజిషన్లో ఉన్న కార్ల కంపెనీలో Maruti Suzuki నెంబర్ వన్ స్థానంలో ఉంటుంది. ఈ కంపెనీ నుంచి ఇప్పటివరకు ఎన్నో రకాల మోడల్స్ మార్కెట్ లోకి వచ్చి అలరించాయి. చిన్న కార్ల నుంచి ప్రీమియం కార్ల వరకు అన్ని వర్గాలను ఆకర్షించేందుకు ఈ కంపెనీ తీవ్ర ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది. ఇందులో భాగంగా SUV కార్లను కూడా పరిచయం చేసింది. ఈ వేరియంటులో వచ్చిన గ్రాండ్ విటారా కారు చాలామందిని ఆకట్టుకుంది. అయితే ఈ కారు మార్కెట్లోకి వస్తున్న వాటితో పోటీ పడలేకపోవడంతో దీని అమ్మకాలు తగ్గుతున్నట్లు తెలుస్తోంది. కానీ సెక్యూరిటీ పరంగా.. మైలేజ్ విషయంలో ఆకట్టుకుంటున్న ఈ కారు అమ్మకాలు తగ్గడానికి కారణం ఏంటి? అసలు ఇందులో ఎలాంటి ఫీచర్లు ఉన్నాయి?
Maruti Suzuki కంపెనీకి చెందిన గ్రాండ్ విటారా SUV మొదట్లో ఆదరణ ఉండేది. అయితే 2026 సంవత్సరంలో ఈ ఈ కారు కొనే వారి సంఖ్య తగ్గుతుంది. తాజాగా విడుదలైన డేటా ప్రకారం 2026 ఫిబ్రవరిలో ఇది 5,859 యూనిట్లు మాత్రమే విక్రయాలు చేసుకోగలిగింది. గత ఏడాదితో పోలిస్తే దీని అమ్మకాలు 45% తగ్గుదల ఉన్నట్లు తెలుస్తోంది. 2025 ఫిబ్రవరిలో ఈ కారును 10,669 యూనిట్లు విక్రయాలు చేశారు.
అయితే గ్రాండ్ విటారా SUV అమ్మకాలు తగ్గిపోవడానికి కారణాలు లేకపోలేదు. ఇదే కంపెనీకి చెందిన కొత్త విక్టోరిస్ SUV నీ మార్కెట్లోకి ప్రవేశపెట్టారు. ఇది గ్రాండ్ విటారాకు సమానంగా ఫీచర్స్, డిజైన్ ఉండడంతో పాటు గ్రాండ్ విటారా కంటే తక్కువ ధరతో అందుబాటులోకి రావడంతో చాలామంది వినియోగదారులు వీటి వైపు మొగ్గు చూపుతున్నారు. అంతేకాకుండా ప్రస్తుతం మార్కెట్లోకి SUV లు లేటెస్ట్ వెర్షన్ తో అందుబాటులోకి వస్తున్నాయి. ఈ కార్ల నుంచి పోటీ తీవ్రంగా ఉండడంతో గ్రాండ్ విటారా అమ్మకాలు తగ్గుతున్నట్లు తెలుస్తోంది.
అయితే గ్రాండ్ విటారా SUV ఫీచర్స్ గురించి తెలిస్తే దీని అమ్మకాలు ఎందుకు తగ్గుతున్నాయో అర్థం కావడం లేదని అంటుంటారు. ఈ కారు బాహ్య డిజైన్ విషయానికి వస్తే LED హెడ్ లాంప్స్ ఆకర్షిస్తాయి. వెనుక వైపు ఉన్న టెయిల్ లాంప్స్ ప్రీమియం లుక్ తో కనిపిస్తాయి. 17 అంగుళాల అల్లాహ్ ఈ వీల్స్ కారుకు అందాన్ని తీసుకువస్తాయి. ఈ ఇందులో 1.5 లీటర్ మైండ్ హైబ్రిడ్ పెట్రోల్ ఇంజన్ ఉండనుంది. ఇది 103 బిహెచ్పి పవర్ తో పాటు 139 ఎన్ఎం టార్క్ ను రిలీజ్ చేస్తుంది. దీనిని ప్రస్తుతం మార్కెట్లో రూ 10.77 లక్షల నుంచి 19.72 లక్షల వరకు విక్రయిస్తున్నారు. ఇది సిగ్మా, డెల్టా, డెల్టా ప్లస్ వంటి వేరియంట్లలో లభిస్తుంది