Homeబిజినెస్Maruthi EV: ఈవీ రేసులోకి మారుతి.. మార్కెట్ లోకి వరుస బెట్టి 6 లాంచ్..500 కిలో...

Maruthi EV: ఈవీ రేసులోకి మారుతి.. మార్కెట్ లోకి వరుస బెట్టి 6 లాంచ్..500 కిలో మీటర్ల మైలేజ్ రేంజ్ లో..!

Maruthi EV: మారుతి సుజుకీ-2031 వరకు ఏడాదికో ఎలక్ట్రిక్ (ఈవీ) కారును మార్కెట్ లోకి తసుకురావాలని ప్రణాళికలు వేసుకుంది. అప్పటి వరకు 6 కార్లను ప్రవేశపెట్టనుంది. ఇందులో మొదటి ఎలక్ట్రిక్ ‘కారుమారుతి సుజికీ EVX’ త్వరలో విడుదల కానుంది. ఈ సందర్భంగా కంపెనీ వార్షిక సర్వసభ్య సమావేశంలో (AGM) చైర్మన్ ఆర్సీ భార్గవ మాట్లాడారు. దేశంలో కార్బన్ న్యూట్రాలిటీ లక్ష్యం గురించి వివరించారు. AGM వద్ద మారుతి సుజుకీ తక్కువ ధర కార్లను అందించే వాగ్ధానానికి కట్టుబడి ఉండాలనే తన ప్రణాళికను ప్రకటించింది, దేశం పెద్ద, లగ్జరీ వాహనాలకే పరిమితం కావద్దని పేర్కొంది. కార్బన్ న్యూట్రాలిటీపై మారుతికి ఉన్న నిబద్ధతను హైలైట్ చేస్తూ. కొత్త సాంకేతికత, ఉత్పత్తుల అభివృద్ధి బలోపేతం, వేగవంతం చేసేందుకు కంపెనీ ఉత్తమ మార్గాలను అన్వేషిస్తుందని భార్గవ చెప్పారు. దేశీయ కంపెనీ, జపాన్ సుజుకీ కలిసి సాంకేతిక నైపుణ్యంతో EV అభివృద్ధిని కొనసాగించాలని.. జనవరి 17 నుంచి జరిగే 2025 ‘ఇండియా మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పో’లో కంపెనీ మొదటి ఎలక్ట్రిక్ మోడల్‌ పరిచయం చేయాలని కంపెనీ భావిస్తున్నట్లు భార్గవ చెప్పారు. ఈ నెల ప్రారంభంలో మారుతి సుజుకీ రెండో EV మోడల్ తయారీలో ఉన్నమాని, మొదటిది ప్రారంభించిన వెంటనే దీన్ని కూడా పరిచయం చేస్తామని చెప్పుకచ్చారు.

మారుతి సుజుకీ మొదటి ఎలక్ట్రిక్ మోడల్ eVX కాన్సెప్ట్ తో తయారు చేశారు. ఇది దేశంతో పాటు విదేశాల్లో సైతం అనేక సార్లు ప్రదర్శనకు ఉంచారు. EV రేసులోకి మారుతి ఆలస్యంగా ప్రవేసించినప్పటికీ 2031 వరకు ప్రతీ సంవత్సరం ఒక మోడల్‌ తెస్తామని గతంలోనే స్పష్టం చేసింది. కాలుష్యం, ఇంధన వినియోగాన్ని తగ్గించడంలో హైబ్రిడ్ పవర్‌ట్రెయిన్ల ప్రాముఖ్యతను భార్గవ వివరించడంతో మారుతి సుజుకీ తన హైబ్రిడ్ ప్రోగ్రామ్‌ను ముందుకు తీసుకువెళ్తుందని భావిస్తున్నారు. మారుతి సుజుకీ తక్కువ ధర చిన్న కార్లను అభివృద్ధి చేయాలనే దాని ప్రణాళికల గురించి మాట్లాడింది. ఈ విభాగం అసలు మారుతి 800తో విప్లవాత్మకంగా మారింది. ఫైనాన్సియల్ ఇయర్ 2025-26 చివరి వరకు చిన్న కార్ల మార్కెట్ తిరిగి పుంజుకుంటుందని, కంపెనీ అంచనా వేసింది.

మారుతి సుజుకి eVX వచ్చే సంవత్సరం ప్రొడ్యూసింగ్ లోకి వెళ్తుంది. కంపెనీ మొదటి ఆల్-ఎలక్ట్రిక్ ఆఫర్ అవుతుందని భావిస్తున్నారు. eVX కాన్సెప్ట్ కాంపాక్ట్ ఎలక్ట్రిక్ SUV, ఇది టాటా కర్వ్ EV, హ్యుందాయ్ క్రెటా EV, హోండా ఎలివేట్ EVతో పోటీపడుతోంది. ఇది ఆల్ వీల్ డ్రైవ్, ఆఫ్ రోడ్ సామర్థ్యాలను పెంచుతుందని భావిస్తున్నారు. సుజుకీ మోటార్ కొత్త SUVని ఒక్కసారి చార్జి చేస్తే 500 కిలో మీటర్ల రేంజ్ వస్తుందని కంపెనీ పేర్కొంది. అయితే బ్యాటరీ, దాని సామర్థ్యం గురించి ఎటువంటి సమాచారం ఇవ్వలేదు. క్యాబిన్, వైర్‌లెస్ ఆపిల్ కార్‌ ప్లే, ఆండ్రాయిడ్ ఆటోకు మద్దతిచ్చే పెద్ద ఇన్ఫోటైన్‌మెంట్ టచ్‌స్క్రీన్ డిస్‌ప్లే కలిగి ఉంటుందని భావిస్తున్నారు. EVX డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, స్మార్ట్‌ఫోన్ల కోసం వైర్‌లెస్ చార్జింగ్ స్లాట్, ఆటో మెటిక్ క్లైమేట్ కంట్రోల్, డ్రైవర్ కోసం ఎలక్ట్రానిక్‌గా అడ్జెస్ట్ వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లును కలిగి ఉంటుంది.

Mahi
Mahihttp://oktelugu.com
Mahendra is a Senior Political Content writer who has very good knowledge on Business stories. He is a senior journalist with good command on writing articles with good narative.
RELATED ARTICLES

Most Popular