Maruti Suzuki Ertiga: సాధారణంగా కారును కొనుక్కోవాలనే కోరిక దాదాపు ప్రతి ఒక్కరికీ ఉంటుంది. కుటుంబంతో అలా కారులో షికారు చేయాలని భావిస్తుంటారు. ఈ క్రమంలోనే తమ బడ్జెట్ రేంజ్ లో వచ్చే కార్లను కొనేందుకు ట్రై చేస్తుంటారన్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఈ కారును కొనేందుకు ప్రజలు క్యూ కడుతున్నారు. అంతేకాదు ఇప్పటికే ఈ కారు కోసం 60 వేలకు పైగా బుకింగ్స్ జరిగాయి. ఇంతకీ ఆ కారు ఏంటి? ఆ కారులో ప్రత్యేకతలు ఏంటి ? అనేది మనం కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
మారుతి సుజుకి ఎర్టిగా.. ప్రస్తుతం ఈ కారుకు మార్కెట్ లో విపరీతంగా డిమాండ్ ఉంది. ఈ క్రమంలోనే కారును కొనుగోలు చేసేందుకు షోరూమ్స్ వద్ద ప్రజలు క్యూ కడుతున్నారు. అదేవిధంగా కారును బుక్ చేసుకుంటున్న వారి సంఖ్య కూడా భారీగా పెరుగుతుండటం విశేషం.
నార్మల్ గా మధ్య తరగతి కుటుంబాలు ఇష్టపడే కార్లలో మారుతి సుజుకి ముందు వరుసలో ఉంటుందన్న విషయాన్ని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ క్రమంలోనే తాజాగా ఈ సంస్థ ఊహించని విధంగా ఆర్డర్లను పొందుతుందని తెలుస్తోంది. ఆటోమేకర్ ప్రస్తుతం 1.75 లక్షల యూనిట్లకు పైగా ఓపెన్ ఆర్డర్ లను అందుకుందని సమాచారం. ఇంకా ఈ సంఖ్య పెరుగుతూ వెళ్తుండటం గమనార్హం.
మారుతి సుజుకి సంస్థ నుంచి ఎన్నో మోడళ్లు మార్కెట్ లో అందుబాటులో ఉన్నాయి. వీటిలో మారుతి ఎర్టిగాకు ఫుల్ డిమాండ్ ఉంది. ఈ కారు ఒక్కటే ఇప్పటివరకు సుమారు 60 వేలకు పైగా ఆర్డర్ లను అందుకుంది. ఆ తరువాత బ్రెజ్జా 20 వేల యూనిట్లు, స్విఫ్ట్ డిజైర్ 17 వేల యూనిట్ల ఆర్డర్లను కలిగి ఉన్నాయి. ఈ నేపథ్యంలో కస్టమర్ల డిమాండ్ల మేరకు సంస్థ కూడా కృషి చేస్తోంది. అందుకు తగినట్లుగా ఉత్పత్తిని పెంచుతోంది.
భారీగా ఆర్డర్లను పొందిన మారుతి సుజుకి ఎర్టిగా 7 సీటర్ ఎంయూవీ వెర్షన్ లో అందుబాటులో ఉంటుంది. తొమ్మిది వేరియంట్లలో కారును ప్రవేశపెట్టగా.. దీని ధర రూ.8.69 లక్షల నుంచి రూ.13.03 లక్షల మధ్యలో ఉంది. ఇవి ఎక్స్ – షోరూమ్ ధరలు కాగా.. వేరియంట్లను భట్టి రేట్లు మారుతుంటాయి. ఇక మారుతి సుజుకి ఎర్టిగాలో 1462 సీసీ ఇంజిన్ ను ఉపయోగించగా.. లీటర్ కు 20.3 కిలోమీటర్ల నుంచి 26.11 కిలోమీటర్ల వరకు మైలేజ్ ను ఇస్తుంది. అలాగే ఈ ఎంయూవీ రెండు ట్రాన్స్ మిషన్లు మాన్యువల్, ఆటోమేటిక్ గేర్ బాక్సులలో ఉంటుంది.దాంతోపాటుగా పెట్రోల్, సీఎన్జీ ఇంజిన్ ఆప్షన్లలో మారుతి ఎర్టిగా అందుబాటులో ఉంది. సేఫ్టీ పరంగా మారుతి ఎర్టిగా ఎన్సీఏపీ క్రాష్ టెస్టులో 3 స్టార్ రేటింగ్ ను సాధించింది. కాగా ఎర్టిగాను సంస్థ ఏడు ఆకర్షణీయమైన రంగుల్లో ప్రవేశపెట్టింది.