Maruti Suzuki Eeco: మారుతి సుజుకి ఈకో దేశంలోనే అత్యంత చౌకైన 7-సీటర్ కారు. ఇది తన సెగ్మెంట్లో అత్యధికంగా అమ్ముడవుతున్న కారు కూడా. ఈ కారును కొనుగోలు చేయాలని అనుకుంటే ఈ నెలలోపే కొనేయండి. ఎందుకంటే ఈ కారు ఇప్పుడు కొంటే మీకు రూ.45,000 డిస్కౌంట్ లభిస్తుంది. కంపెనీ దీనిపై రూ.15,000 వరకు క్యాష్ డిస్కౌంట్, రూ.30,000 వరకు స్క్రాపేజ్ బోనస్ అందిస్తోంది. కంపెనీ అంబులెన్స్ మోడల్‌పై అత్యల్పంగా రూ.5,000 డిస్కౌంట్ ఇస్తోంది. మారుతి సుజుకీ ఈకో ధర రూ.5.70 లక్షల నుంచి రూ.6.96 లక్షల వరకు ఉంటుంది. ఇది ఎక్స్ షోరూం ధరలు మాత్రమే. కస్టమర్లు ఈ ఆఫర్‌ను జులై 31 వరకు మాత్రమే పొందగలరు.
కొనుగోలు చేయాలనుకున్న వేరియంట్ బట్టి ఆఫర్లు మారుతుంటాయి. పెట్రోల్ వేరియంట్‌లపై అత్యధికంగా రూ.45,000 వరకు డిస్కౌంట్ లభిస్తుంది. ఇందులో రూ.15,000 నగదు తగ్గింపు, రూ.30,000 స్క్రాపేజ్ బోనస్ ఉంటాయి. సీఎన్‌జి వేరియంట్‌లపై, కార్గో మోడల్స్ (పెట్రోల్, సీఎన్‌జి రెండింటిపై) రూ.40,000 వరకు మొత్తం డిస్కౌంట్ పొందవచ్చు. ఈ రూ.40,000లో రూ.10,000 క్యాష్ డిస్కౌంట్, రూ.30,000 స్క్రాపేజ్ బోనస్ ఉంటాయి. అయితే, అంబులెన్స్ మోడల్‌పై మాత్రం కేవలం రూ.5,000 స్క్రాపేజ్ బోనస్ మాత్రమే లభిస్తుంది.
Also Read: Maruti Suzuki Cars: మారుతీ కార్లు కొనాలనుకునే వాళ్లకు షాక్
మారుతి ఈకోలో కె సిరీస్ 1.2-లీటర్ ఇంజిన్ ఉంటుంది. ఇది పెట్రోల్‌తో 80.76 పీఎస్ పవర్, 104.5 ఎన్ఎం పీక్ టార్క్ జనరేట్ చేస్తుంది. అయితే, సిఎన్‌జితో ఇది 71.65 పీఎస్ పవర్, 95 ఎన్ఎం పీక్ టార్క్‌కు తగ్గుతుంది. టూర్ వేరియంట్ పెట్రోల్ ట్రిమ్ 20.2 కి.మీ/లీ మైలేజ్, సిఎన్‌జి కోసం 27.05 కి.మీ/కేజీ మైలేజ్ ఇస్తుంది. ప్యాసింజర్ ట్రిమ్ పెట్రోల్ మైలేజ్ 19.7 కి.మీ/లీటర్, సిఎన్‌జి కోసం 26.78 కి.మీ/కేజీకి తగ్గుతుంది.
ఈకోలో 11 సేఫ్టీ ఫీచర్లు ఉన్నాయి. ఇందులో 6 ఎయిర్‌బ్యాగ్‌లు స్టాండర్డ్‌గా, రివర్స్ పార్కింగ్ సెన్సార్‌లు, ఇంజిన్ ఇమ్మొబిలైజర్, డోర్స్‌కు చైల్డ్ లాక్, సీట్ బెల్ట్ రిమైండర్, ఇబిడితో కూడిన ఎబిఎస్ (యాంటీలాక్ బ్రేకింగ్ సిస్టమ్), డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్‌బ్యాగ్‌లు ఉన్నాయి. ఈకోకు ఇప్పుడు కొత్త స్టీరింగ్ వీల్, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ లభిస్తాయి. ఈ రెండు యూనిట్లను కంపెనీ తమ ఎస్-ప్రెస్సో, సెలెరియో నుండి తీసుకుంది. పాత స్లైడింగ్ ఏసీ కంట్రోల్‌ను కూడా కొత్త రోటరీ యూనిట్‌తో భర్తీ చేశారు.
ఈకోను 4 వేరియంట్లలో కొనుగోలు చేయవచ్చు. వీటిలో 5-సీటర్, 7-సీటర్, కార్గో, అంబులెన్స్, టూర్ బాడీ స్టైల్స్ ఉన్నాయి. ఈకో కొలతల విషయానికి వస్తే ఈ కారు పొడవు 3,675మి.మీ, వెడల్పు 1,475మి.మీ, ఎత్తు 1,825మి.మీ. అంబులెన్స్ వెర్షన్ ఎత్తు 1,930మి.మీ. దీని 5-సీటర్ వేరియంట్ రూ.5.32 లక్షల నుండి రూ.6.58 లక్షల(ఎక్స్-షోరూమ్) వరకు ఉన్నాయి. 7-సీటర్ వేరియంట్ రూ.5.61 లక్షలు(ఎక్స్-షోరూమ్).