spot_img
Homeబిజినెస్Maruti Suzuki Dzire: ఆ కార్ల పోటీ నుంచి తట్టుకొని నెంబర్ వన్ స్థానంలో నిలిచింది..

Maruti Suzuki Dzire: ఆ కార్ల పోటీ నుంచి తట్టుకొని నెంబర్ వన్ స్థానంలో నిలిచింది..

Maruti Suzuki Dzire: ప్రస్తుతం ఆటో మోబైల్ మార్కెట్లో SUV లదే హవా సాగుతోంది. మరోవైపు ఎలక్ట్రిక్ కార్ల కోసం ఎగబడుతున్నారు. ఇలాంటి తరుణంలో హాచ్ బ్యాక్ కార్లకు గడ్డు పరిస్థితి అని కొందరు అంచనా వేశారు. కానీ వీటినుంచి గట్టి పోటీ ఎదుర్కొని ఓ కంపెనీకి చెందిన కారు ముందుకెళ్ళింది. అంతేకాకుండా వాటిని దాటేసి నెంబర్వన్ స్థానంలో నిలిచింది. దశాబ్దాలుగా ఈ కారును ఆదరిస్తున్న వినియోగదారులు 2026 ఆర్థిక సంవత్సరంలో కూడా ఎక్కువగా కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. అందుకు కారణం ఇందులో ఉండే ఫీచర్స్ తో పాటు అనుకూలమైన ధర అని అంటున్నారు. ఇంతకీ ఈ కారు ఏదంటే?

Maruti Suzuki కంపెనీ నుంచి హ్యాచ్ బ్యాక్ కార్లు ఎక్కువగా మార్కెట్లోకి వస్తుంటాయి. కానీ ఇప్పటివరకు వచ్చిన కార్లలో Dzire ప్రత్యేకంగా నిలుస్తుందని చెప్పుకోవచ్చు. మినీ SUV గా పేర్కొనే ఈ కారుకు ఎప్పటికీ ఆదరణ ఉంటుందని కొన్ని లెక్కలను బట్టి తెలుస్తోంది. ఇందులో భాగంగా 2026 ఆర్థిక సంవత్సరంలో అగ్రశ్రేణి కార్లను తట్టుకొని సైతం నెంబర్వన్ స్థానంలో నిలిచింది. ఈ ఏడాది మొత్తంలో డిజైర్ కారు 2,07,906 యూనిట్ల అమ్మకాలు చేసుకుంది. ఆ తర్వాత టాటా నెక్సాన్ 1,96,244 యూనిట్ల విక్రయాలతో రెండో స్థానంలో నిలిచింది. అయితే ఇది SUV కారు కావడం విశేషం. మరోవైపు మూడో స్థానంలోనూ SUV సెగ్మెంట్ కు చెందిన హ్యుందాయ్ క్రెటా 1,84,083 యూనిట్ల కార్ల విక్రయాలతో నిలిచింది.

అయితే SUV, UV కార్లకు డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలోనూ హ్యాచ్ బ్యాక్ కారు అయినా డిజైర్ కారును ఎక్కువగా కొనుగోలు చేయడానికి ఇందులో ఉండే ఫీచర్స్ తో పాటు అందుబాటులో ధర ఉండడమే అని తెలుస్తోంది. ఈ కారు ఎక్స్టీరియర్ డిజైన్ విషయానికి వస్తే LED హెడ్ లాంప్స్ ఆకర్షినియంగా ఉంటాయి. దీని కి పెద్ద గ్రిల్ తో పాటు ఫాగ్ లాంప్ ఆకర్షనీయంగా ఉంటుంది. ఫాగ్ lamp సైతం ప్రీమియం లుక్ తో ఉంటుంది. అలాగే ఈ కారులో 1.2 లీటర్ నేచురల్లీ అస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్ ఉండరు ఉంది. దీనితోపాటు CNG వేరియంట్ కూడా సపోర్ట్ చేస్తుంది. ఈ ఇంజన్లకు 5 స్పీడ్ ఆటోమేటిక్ గేర్ బాక్స్ ఉండడంతో డ్రైవింగ్ చేసేవారికి అనుగుణంగా ఉంటుంది. అంతేకాకుండా నగరాల్లో ప్రయాణించేవారు ఈ గేర్ బాక్స్ తో స్మూత్ గా ముందుకు వెళ్తారు. లీటర్ ఇంధనానికి ఈ కారు పెట్రోల్ వెర్షన్లో 24.79 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుండగా..CNG వెర్షన్ లో 33.73 కిలోమీటర్ల మైలేజ్ అందిస్తుంది.

మధ్యతరగతి ప్రజలకు అనుగుణంగా ఫీచర్లు ఉండడంతో పాటు ధర కూడా తక్కువగానే ఉంటుంది. దీనిని ప్రస్తుతం మార్కెట్లో రూ.6 లక్షల ప్రారంభ ధరతో విక్రయిస్తున్నారు.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version