Homeబిజినెస్Best AMT cars in India list 2026: AMT గేర్ బాక్స్ కార్లను ఎందుకు...

Best AMT cars in India list 2026: AMT గేర్ బాక్స్ కార్లను ఎందుకు ఎక్కువగా కోరుకుంటున్నారు? అలాంటి కార్లు ఏవి?

Best AMT cars in India list 2026: భారతదేశంలో కార్లు నడిపే వారి మనస్తత్వాలు మారిపోతున్నాయి. ఒకప్పుడు కమాండర్ జీప్ ను నడపాలంటే శక్తి కావాల్సిందే. కానీ ఇప్పుడు ఎలాంటి అదనపు శక్తి లేకుండా కార్లను నడపొచ్చు. ఎందుకంటే ఇప్పుడు వచ్చే కార్లలో దాదాపు ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ గేర్ బాక్స్ ఉంటుంది. దీంతో ప్రత్యేకంగా క్లచ్ నొక్కకుండానే అవసరమైన చోట గేర్ మారిపోతుంది. ముఖ్యంగా నగరాల్లో ప్రయాణం చేసే వారికి ఇది అద్భుతంగా ఉంటుంది. అయితే కొన్ని కంపెనీలు వినియోగదారుల అవసరాలను దృష్టిలో ఉంచుకొని ఈ రకమైన కార్లను మార్కెట్లోకి తీసుకు వస్తున్నాయి. అలాంటి వాటిలో బెస్ట్ కార్లు ఏవి అంటే?

దేశంలో అత్యధికంగా విక్రయాలు జరుపుకుంటున్న కార్లలో మారుతి సుజుకి టాప్ లెవల్ లో ఉంటుంది. అయితే వినియోగదారుల అవసరాలను బాగా గ్రహించిన ఈ కంపెనీ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ గేర్ బాక్స్ తో కూడిన కార్లను మార్కెట్లోకి తీసుకువచ్చింది. అలాంటి వాటిలో Fronx ప్రత్యేకంగా ఉంటుంది. 1.2 లీటర్ పెట్రోల్ ఇంజన్ తో ఉన్న ఈ కారులో 88.5 బిహెచ్పి పవర్ తో పాటు 113 ఎన్ఎం టార్క్ ను రిలీజ్ చేసే ఈ కారు 5 స్పీడ్ ఆటోమేటిక్ గేర్ బాక్స్ తో కలిగి ఉంది. ఈ గేర్ బాక్స్ సౌకర్యంతో పాటు మైలేజ్ కూడా ఇవ్వడంతో చాలామంది దీనిని కోరుకుంటున్నారు.

టాటా కంపెనీకి చెందిన పంచ్ కారు ప్రత్యేకతను సాధించుకుంది. ఇందులో 1.2 లీటర్ పెట్రోల్ ఇంజన్ ఉండగా.. ఇది 86.6 బిహెచ్పి పవర్ తో పాటు 115 ఎన్ఎం టార్క్ ను రిలీజ్ చేస్తుంది. ఈ ఇంజన్ 5 స్పీడ్ ఆటోమేటిక్ గేర్ బాక్స్ తో పనిచేస్తుంది. సేఫ్టీ విషయంలో ఈ కారు ప్రత్యేకంగా నిలుస్తుంది. అలాగే రెనాల్ట్ కంపెనీకి చెందిన టైగర్ అనే కారు కూడా ఆటోమేటిక్ గేర్ బాక్స్ తో మిగతా కార్లకు గట్టి పోటీని ఇస్తుంది. ఇందులో 1.0 లీటర్ పెట్రోల్ తో పాటు 71 బిహెచ్పి పవర్, 96 ఎన్ఎం టార్క్ రిలీజ్ చేస్తూ 5 స్పీడ్ ఆటోమేటిక్ గేర్ బాక్స్ తో పనిచేస్తుంది.

Hyundai కంపెనీకి చెందిన ఎక్స్టర్ కారులో 1.2 లీటర్ పెట్రోల్ ఇంజన్ చూడొచ్చు. ఇది 81.9 బిహెచ్పి పవర్ తో పాటు 113.8 ఎన్ ఎం టార్క్ ను రిలీజ్ చేస్తూ 5 స్పీడ్ ఆటోమేటిక్ గేర్ బాక్స్ తో పనిచేస్తుంది. నిస్సాన్ కంపెనీకి చెందిన మాగ్నెట్ కారులో 1.0 లీటర్ పెట్రోల్ ఇంజన్ ఉంటుంది. ఇది 71 బిహెచ్పి పవర్, 96 ఎన్ఎం టార్క్ ను రిలీజ్ చేస్తూ 5 స్పీడ్ ఆటోమేటిక్ కేర్ బాక్స్ తో పనిచేస్తుంది.

ఇలా చాలా కంపెనీలు ఆటోమేటిక్ గేర్ బాక్స్ విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకొని మార్కెట్లోకి తీసుకు వస్తున్నాయి. ఆటోమేటిక్ గేర్ బాక్స్ వల్ల కొన్ని రకాలుగా ఉపయోగాలు ఉన్నా కూడా.. ఇప్పటికే మాన్యువల్ గేర్ బాక్స్ పై డ్రైవ్ చేసిన వారికి కాస్త అయోమయంగా ఉంటుంది. అయితే వీరు ఆటోమేటిక్ గేర్ బాక్స్కు మారినప్పుడు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version