Maruti Suzuki Alto K10: వినియోగదారులకు ఆకర్షించడానికి వస్తువులు అమ్మకాలు చేసే సంస్థలు, కంపెనీలు ఆఫర్లు ప్రకటిస్తూ ఉంటాయి. ఇటీవల కార్లు వినియోగించేవారి సంఖ్య విపరీతంగా పెరుగుతోంది.ప్రతి ఒక్కరూ దాదాపు ఓన్ వెహికిల్ ఉండేలా ట్రై చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కన్జ్యూమర్స్ కు అనుగుణంగా, వారిని ఆకట్టుకునే ఫీచర్స్ తో పాటు తక్కువ ధరలో కార్లను విక్రయిస్తున్నాయి కొన్ని కంపెనీలు. వీటిలో మారుతి ఇప్పటికే ఆయా వర్గాలను బేస్ చేసుకొని చాలా వరకు ఉత్పత్తులను మార్కెట్లోకి తీసుకొచ్చింది. తాజాగా పాత మోడల్ కారును అప్డేడ్ చేయడమే కాకుండా తక్కువ ధరకే విక్రయిస్తోంది. ఇదే సమయంలో భారీ డిస్కౌంట్లను ప్రకటించింది. ఏకంగా రూ.50వేలకు పైగా క్యాష్ బ్యాక్ ఇస్తోంది.
మారుతి సుజుకీ నుంచి రిలీజైన ఆల్టో గురించి కార్లు వాడే వారికి దాదాపు తెలిసే ఉంటుంది. అతి తక్కువ ధరలో చిన్న ఫ్యామిలీకి కన్వినెంట్ ఉంటుంది. హ్యాచ్ బ్యాక్ వెర్షన్లో వచ్చిన ఈ మోడల్ అమ్మకాలు విపరీతంగా జరిగాయి. తాజాగా దీనిని నేటికి అనుగుణంగా మార్చారు. అప్డేట్ ఫీచర్స్ ను అమర్చారు. ఆల్టో కె10 తో వచ్చిన ఇందులో 1 లీటర్ పెట్రోల్ తో పాటు 3 సిలిండర్ సీఎన్ జీని అమర్చారు. గరిష్టంగా 66 బీహెచ్ పీ, 89 ఎన్ ఎం టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. 5 స్పీడ్ మ్యానువల్ యూనిట్ లేదా ఏటఎంటీ యూనిట్ ట్రాన్స్ మిషన్ అప్షన్ష్ ఉన్నాయి.
ఆల్టో కె 10 లీటర్ కు 24.39 కిలోమీటర్ల మైలేజీ ఇస్తుంది. సీఎన్జీ మైలేజీ 33.85 కిలోమీటర్ల మైలేజీ ఇవ్వనుంది. అవసరాలకు అనుగుణంగా వేరియంట్ ను మార్చుకునే సౌకర్యం ఉంది. ఆల్టోకె 10ను రూ.3.99 లక్షల నుంచి ప్రారంభం అవుతుంది. గరిష్టంగా రూ.5.96 లక్షలకు పొందవచ్చు. ఈ కారు ఆన్ రోడ్ రేట్లు కాస్త ఎక్కువగా ఉండొచ్చని కంపెనీ ప్రతినిధులు చెబుతున్నారు. ఇక ఈ కారుపై భారీ డిస్కౌంట్ పొందవచ్చని కంపెనీ తెలిపింది
ఆల్టో కె 10 కొనుగోలు చేసేవారికి రూ.35 వేల క్యాష్ డిస్కౌంట్ ఇస్తున్నారు. ఎక్చేంజ్ బోనస్ కింద రూ.15 వేలు తగ్గుతుంది. కార్పొరేట్ డిస్కౌంట్ కింద రూ.4 వేల తగ్గింపు ఉంది. అయితే ఎంచుకునే కారును భట్టి డిస్కౌంట్లు వర్తిస్తాయి. ఇలా మొత్తంగా రూ.54వేల డిస్కౌంట్ ను సొంతం చేసుకోవచ్చు. ఈ ఆఫర్ సెప్టెంబర్ నెల వరకు మాత్రమే ఉంటుందని మారుతి సుజుకి తెలిపింది. అందువల్ల ఈ మోడల్ కొనుగోలు చేయాలనుకునేవారు ఈ నెలలోనే బుక్ చేసుకోవడం ఉత్తమం అని అంటున్నారు.