Maruthi Suzuki : 3 కోట్ల సేల్స్.. మారుతి సుజుకీ సంచలనం..

ఇండియా వ్యాప్తంగా 40 సంవత్సరాల నాలుగు నెలల పాటు 3 కోట్ల యూనిట్లను ఉత్పతి చేశామని హిసాషి పేర్కొన్నారు. వీటిలో హర్యానా ప్లాంటులో 2.68 కోట్లకు పైగా వాహనాలు తయారు చేయగా.. MSIL అనుబంధ సంస్థ అయిన సుజుకీ మోటార్స్ గుజరాత్ లో 32 లక్షలకు పైగా వాహనాలను తయారు చేశారు. ప్రస్తుతం మారుతి కి చెందిన 18 మోడళ్లు అందుబాటులో ఉన్నాయి.

Written By: Chai Muchhata, Updated On : April 9, 2024 12:33 pm

Maruthi suzuki cars

Follow us on

Maruthi Suzuki : భారతదేశంలో కార్ల ఉత్పత్తిలో మారుతి సుజుకీ అగ్రగామిగా నిలుస్తుంది. వినియోగదారులకు అనుగుణంగా కొత్త కొత్త మోడళ్లను తీసుకొస్తూ.. తక్కువ ధరకు అందించేందుకు మారుతి కృషి చేస్తుంది. హ్యాచ్ బ్యాక్ నుంచి ఎస్ యూవీ వరకు ఎలాంటి కార్లనైనా ఉత్పత్తి చేసి కారు వాడే వారి మన్ననలను పొందుతుంది. ఇటీవల ఎలక్ట్రిక్ కారు లో కూడా తగ్గేదేలే అన్నట్లుగా కొత్త మోడల్ ను తీసుకొచ్చేందుకు రెడీ అవుతోంది. ఈ నేపథ్యంలో కార్ల విక్రయాల గురించి మేనేజింగ్ డైరెక్టర్, సీఈవో హిసాషి టేకుచి సంచలన విషయాలను చెప్పారు. ఆ విషయాల్లోకి వెళితే..

1983లో మారుతి నుంచి మొదటి కారు రోడ్లపైకి వచ్చింది. ఆప్పటి నుంచి ప్రతి ఏడాది లక్షలాదిగా వెహికల్ ను ఉత్పత్తి చేసి అందుబాటులోకి తీసుకొస్తున్నారు. ఓ వైపు వినియోగదారులను ఆకర్షించేలా.. మరోవైపు మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా ధరలను నిర్ణయిస్తూ కార్యకలాపాలను బలోపేతం చేస్తున్నట్లు హిసాషి తెలిపారు. ఇప్పటి వరకు మారుతి నుంచి ఆల్టో, స్విప్ట్, వ్యాగన్ ఆర్, ఎం800, డిజైర్, ఓమిని, బాలెనో, ఈకో, బ్రెజ్జా, ఎర్టిగా వంటి పది మోడళ్లు రికార్డులు సాధించాయి.

ఇండియా వ్యాప్తంగా 40 సంవత్సరాల నాలుగు నెలల పాటు 3 కోట్ల యూనిట్లను ఉత్పతి చేశామని హిసాషి పేర్కొన్నారు. వీటిలో హర్యానా ప్లాంటులో 2.68 కోట్లకు పైగా వాహనాలు తయారు చేయగా.. MSIL అనుబంధ సంస్థ అయిన సుజుకీ మోటార్స్ గుజరాత్ లో 32 లక్షలకు పైగా వాహనాలను తయారు చేశారు. ప్రస్తుతం మారుతి కి చెందిన 18 మోడళ్లు అందుబాటులో ఉన్నాయి.  వీటిలో 9 కార్లు అరేనా డీలర్ షిప్ ద్వారా, 8 కార్లు నెక్సా డీలర్ షిప్ ద్వారా సేల్స్ ను జరుపుకుంటున్నాయి.

ఈ సందర్భంగా హిసాషి టేకుచి మాట్లాడుతూ మారుతి కంపెనీ ప్రారంభం నుంచి ఇప్పటి వరకు వినియోగదారులు మాపై నమ్మకం ఉంచారు. వారందరికీ ధన్యవాదాలు. ‘మేక్ ఇన్ ఇండియా’ చొరవకు అనుగుణంగా ఉత్పత్తులను తీసుకురావడానికి సిద్ధంగా ఉన్నాం. ఇండియా నుంచి వాహనాల ఎగుమతుల్లో మారుతికి 40 శాతం వాటా ఉన్నట్లు ఆయన తెలిపారు.