https://oktelugu.com/

Maruthi cars : ఈ రెండు కార్లపై ధర తగ్గించిన మారుతి.. వెంటనే త్వరపడండి..

హ్యాచ్ బ్యాక్ వేరియంట్లను ఎక్కువగా విక్రయించడం మారుతి కంపెనీకే సాధ్యమవుతుంది. అయితే ఈ కంపెనీకి చెందిన కొన్ని కార్ల అమ్మకాలు క్షీణించాయి. ఈ నేపథ్యంలో మారుతికి చెందిన ఆల్టో కే 10, ఎస్ ప్రెస్సో మోడళ్లపై వరుగా రూ.6,500, రూ.2,000 తక్కువధరతో విక్రయిస్తోంది. చిన్న ఫ్యామిలీకి అనుగుణంగా ఉండే ఈ కార్లలు 5గురు ప్రయాణం చేయొచ్చు.

Written By:
  • Srinivas
  • , Updated On : September 3, 2024 12:04 pm
    Maruthi cars

    Maruthi cars

    Follow us on

    Maruthi cars : మారుతి కార్లకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉంటుంది. సామాన్యుల నుంచి ఖరీదైన కార్లు కొనే వారి వరకు వివిధ మోడళ్లను మార్కెట్లోకి తీసుకొస్తుంది. మారుతి కంపెనీకి చెందిన కార్లలోని ఫీచర్లు ప్రీమియం కార్లను తలపిస్తాయి. అందుకే వ్యాగన్ఆర్, స్విప్ట్ వంటివాటికి ఇప్పటికీ ఇప్పటికీ డిమాండ్ తగ్గడం లేదు. కొన్ని సార్లు మారుతి కార్ల సేల్స్ తక్కువగా అయ్యే అవకాశం ఉంది. ఇలాంటి సమయంలో వినియోగదారులను ఆకర్షించేందుకు ఆఫర్లు ప్రకటిస్తారు. ఇప్పుడు మారుతి కంపెనీ కూడా రెండు మోడళ్లకు ధరను తగ్గించింది. ఇవి ఇప్పటికే మార్కెట్లో ఉన్నప్పటికీ వీటి కొనుగోళ్లను పెంచేందుకు లేటేస్ట్ గా నిర్ణయం తీసుకుంది. ఇంతకీ మారుతికి చెందిన ఏ కార్ల ధరలు తగ్గాయి? వాటి ఫీచర్లు ఎలా ఉన్నాయి?

    హ్యాచ్ బ్యాక్ వేరియంట్లను ఎక్కువగా విక్రయించడం మారుతి కంపెనీకే సాధ్యమవుతుంది. అయితే ఈ కంపెనీకి చెందిన కొన్ని కార్ల అమ్మకాలు క్షీణించాయి. ఈ నేపథ్యంలో మారుతికి చెందిన ఆల్టో కే 10, ఎస్ ప్రెస్సో మోడళ్లపై వరుగా రూ.6,500, రూ.2,000 తక్కువధరతో విక్రయిస్తోంది. చిన్న ఫ్యామిలీకి అనుగుణంగా ఉండే ఈ కార్లలు 5గురు ప్రయాణం చేయొచ్చు. అంతేకాకుండా లో బడ్జెట్ కు అనుగుణంగా ఉన్న ఈ కార్ల ఎలా ఉన్నాయంటే?

    మారుతి కంపెనీ నుంచి లో బడ్జెట్ లో ఎక్కువ మైలేజ్ ఇచ్చే కారు ఏదంటే ముందుగా ఆల్టే కే 10 గురించే చెబుతూ ఉంటారు. ఇందులో 1.0 లీటర్ పెట్రోల్ ఇంజిన్ తో పాటు సీఎన్ జీ ఆప్షన్ కూడా ఉంది. సీఎన్ జీ వేరియంట్ల ో 33.85 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది. ఇందులో యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ తో పాటు సేప్టీ కోసం ఎయిర్ బ్యాగులు ఉన్నాయి. అల్టో కే 10 ఢిల్లీ షో రూం ప్రకారం రూ.5.96 లక్షల ప్రారంభ ధరతో విక్రయిస్తున్నారు. దీనిపై రూ.6,500 తగ్గింపు ను ప్రకటించారు.

    మారుతి నుంచి మరో కారు ఎస్ ప్రెస్సో మైక్రో ఎస్ యూవీలా అనిపిస్తుంది. ఎందుకంటే ఇందులో 4 సీటర్ ఉన్నప్పటికీ విశాలమైన స్పేస్ ఉంటుంది. ఇది 1.0 లీటర్ పెట్రోల్ ఇంజిన్ తో పాటు సీఎన్ జీ ఆప్షన్ కూడా అందుబాటులో ఉంది. వీటిపై ఇది 32.73 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది. మారుతి ఎస్ ప్రెస్సో యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ తో కూడిన ఎయిర్ బ్యాగులు ఉన్నాయి. దీనిని రూ.5.91 లక్షల ప్రారంభ ధరతో విక్రయిస్తున్నారు. దీనిపై రూ.2,500 తగ్గింపు ధరను పొందవచ్చు.

    మారుతి కంపెనీ అగుస్టు నెల వరకు 1,81,782 యూనిట్లు విక్రయించింది. గతేడాది ఇదే సమయానికి 1,89,082 యూనిట్లు అమ్మింది. గత ఏడాది కంటే ఈసారి 3.9 శాతం అమ్మకాలు తగ్గాయి. దీంతో ఈ రెండు మోడళ్లపై తగ్గింపు ధరను ప్రకటించింది. లో బడ్జెట్ లో కారు కొనాలనుకునేవారు ఈ రెండు కార్లు బెస్ట్ ఆప్షన్ అని కొందరు పేర్కొంటున్నారు. ఇదే సమయంలో ఆఫర్ ప్రకటించడం ప్లస్ పాయింట్ గా ఉంటుందని అంటున్నారు.