The Lady Killer: ఆ సినిమా బాలీవుడ్ చరిత్రలోనే భారీ ప్లాప్..కట్ చేస్తే ఓటిటీ లో సూపర్ హిట్..ఇంతకీ ఆ సినిమా ఏంటంటే..?

ఒక సినిమా ను తెరకెక్కించేటప్పుడు ఆ సినిమాకు సంబంధించిన కథ, కథనం ఎలా ఉన్నాయి అనేది ముందే చూసుకొని దర్శకుడు దానికి తగ్గట్టుగానే మేకింగ్ లో కొత్తదనాన్ని ప్రదర్శిస్తూ సినిమాని తెరకెక్కించాలి. అందులో ఏమాత్రం మిస్టేక్ జరిగిన కూడా ఆ సినిమా మీద భారీ ప్రభావం అయితే పడే అవకాశాలు ఉన్నాయి...

Written By: Gopi, Updated On : September 3, 2024 12:19 pm

The Lady Killer

Follow us on

The Lady Killer: బాలీవుడ్ సినిమా ఇండస్ట్రీ పరిస్థితి రోజురోజుకీ దారుణంగా తయారవుతుంది. వాళ్ల నుంచి వచ్చే ఒక్క సినిమా కూడా ఆశించిన మేరకు విజయం అయితే సాధించలేకపోతున్నాయి. ఇక రీసెంట్ గా వచ్చిన ‘స్త్రీ 2’ సినిమా భారీ సక్సెస్ ని అందుకున్నప్పటికీ ఆ తర్వాత వచ్చిన సినిమాలు ఏవి ఆశించిన మేరకు విజయాలను సాధించలేకపోతున్నాయి. మరి ఇలాంటి సందర్భంలో స్టార్ హీరోలు సైతం బాలీవుడ్ ఇండస్ట్రీని కాపాడుకోలేని పరిస్థితి అయితే ఎదురవుతుంది…అర్జున్ కపూర్, భూమి పెడ్నేకర్ హీరో హీరోయిన్లుగా వచ్చిన ‘ది లేడీ కిల్లర్’ సినిమా 45 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కినప్పటికీ థియేటర్లో కేవలం లక్ష రూపాయలను కూడా వసూలు చేయలేని పరిస్థితి అయితే నెలకొంది. దీని ద్వారా ఈ సినిమా భారీ డిజాస్టర్ ని మూటగట్టుకోవడమే కాకుండా ఈ సినిమాని చూసిన ప్రతి ప్రేక్షకుడు చాలావరకు అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఇక ఇదిలా ఉంటే ఈ సినిమా ఓటిటి లో మాత్రం అదరగొడుతుంది అంటూ వార్తలు అయితే వస్తున్నాయి. నిజానికి ఈ సినిమాని యూట్యూబ్ లో రిలీజ్ చేశారు. యూట్యూబ్ లో చాలా మంచి ఆదరణ దక్కించుకున్న ఈ సినిమా ప్రేక్షకుల అంచనాలకు మించి ఉందని ట్రెడ్ పండితులు సైతం వాళ్ళ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. మరి ఇలాంటి సినిమా థియేటర్లో ఎందుకు ఫ్లాప్ అయింది అంటూ మరికొన్ని సందేహాలు కూడా వెలువడుతున్నాయి.

ఇక ఈ విషయం మీద దర్శకుడు ‘అజయ్ బాహ్లు’ ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ సినిమా షూటింగ్ పుర్తవ్వకుండానే సినిమాని రిలీజ్ చేశామని నటీనటులు ఈ సినిమా నుంచి క్విట్ అయిపోయారని ఇక ఏం చేయాలో తెలియని పరిస్థితిలో క్లైమాక్స్ సరిగ్గా చిత్రీకరించకుండానే సినిమాని రిలీజ్ చేశామని చెప్పారు. అందువల్లే ఈ సినిమా భారీ డిజాస్టర్ అయింది అంటూ ఆయన చెప్పిన మాటలు పెను సంచలనాన్ని సృష్టించాయి.

మొత్తానికైతే అప్పటికే ఈ సినిమాకు డిజిటల్ రైట్స్ కింద కొంత అమౌంట్ అయితే వచ్చింది. దానివల్ల సినిమాని థియేటర్లో రిలీజ్ చేశామని చెప్పాడు. మొత్తానికైతే యూట్యూబ్ లో ఈ సినిమా మంచి వ్యూయర్షిప్ ను సంపాదించుకుంటూ ముందుకు దూసుకెళ్తుంది. ఇలా సినిమాని పూర్తిగా కంప్లీట్ చేయకుండానే రిలీజ్ చేసి భారీ విమర్శలను ఎదుర్కొంటున్నారు.

ఇక ఏది ఏమైనప్పటికి ఈ సినిమా విషయంలో థియేటర్ లో సినిమా ఫెయిల్ అయినప్పటికీ యూట్యూబ్ లో మాత్రం పెను సంచలనాన్ని సృష్టించడం ఆ సినిమా మేకర్స్ కి కొంతవరకు ఆనందాన్ని కలిగిస్తుందనే చెప్పాలి…