Maruti : మారుతి సుజుకి మార్చి 2025 నుంచి తమ అన్ని మోడళ్ల ధరలను పెంచుతున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా కంపెనీ తన పాపులర్ కాంపాక్ట్ SUV ఫ్రాంక్స్ (Fronx) ధరలను కూడా పెంచింది. ఇప్పుడు ఫ్రాంక్స్ ఎక్స్-షోరూమ్ ధరలు రూ. 7.54 లక్షల నుండి మొదలై రూ.13.06 లక్షల వరకు ఉన్నాయి. ఈసారి రూ. 2,500 మేరకు ధర పెరిగింది. ఇది తక్షణమే అమల్లోకి వస్తుంది. అంతకుముందు ఫిబ్రవరిలో కూడా కంపెనీ రూ.5,500 ధర పెంచింది. ఫిబ్రవరి 2025లో మారుతి ఫ్రాంక్స్ దేశంలోనే నంబర్-1 కారుగా నిలిచింది.
మారుతి ఫ్రాంక్స్ రెండు ఇంజన్ ఆప్షన్‌లతో అందుబాటులో ఉంది. వీటిని ప్రత్యేకంగా పవర్, మైలేజ్‌ను బ్యాలెన్స్ చేసేలా రూపొందించారు. మొదటిది 1.0-లీటర్ టర్బో బూస్టర్‌జెట్ ఇంజన్. ఇది కేవలం 5.3 సెకన్లలో 0 నుండి 60 కిమీ/గం వేగాన్ని అందుకోగలదు. రెండవది 1.2-లీటర్ కె-సిరీస్ డ్యూయల్-జెట్, డ్యూయల్ VVT ఇంజన్. ఇందులో స్మార్ట్ హైబ్రిడ్ టెక్నాలజీని ఉపయోగించారు. ఈ ఇంజన్‌లతో 6-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ ప్యాడిల్ షిఫ్టర్‌లతో లభిస్తుంది. అలాగే ఆటో గేర్ షిఫ్ట్ (AGS) ఎంపిక కూడా ఉంది. మైలేజ్ విషయానికి వస్తే ఈ కారు లీటరుకు 22.89 కిమీ వరకు ఇవ్వగలదు. ఈ కారు పొడవు 3995ఎంఎం, వెడల్పు 1765ఎంఎం, ఎత్తు 1550ఎంఎం. దీని వీల్‌బేస్ 2520ఎంఎం. ఇందులో 308 లీటర్ల బూట్ స్పేస్ ఉంది. ఇది ఫ్యామిలీ ప్రయాణాలకు సరిపోతుంది.
Also Read : లీటరుకు ఏకంగా 34 కిమీ మైలేజ్.. రోజూ ప్రయాణించడానికి బెస్ట్ కార్లు ఇవే !
మారుతి ఫ్రాంక్స్ డిజైన్ మోడ్రన్, యూత్‌ఫుల్ అప్పీల్‌తో వస్తుంది. దీని ఇంటీరియర్, ఎక్స్‌టీరియర్ రెండూ చాలా ఆకర్షణీయంగా ఉంటాయి. ఇందులో 9-ఇంచుల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఉంది. ఇది ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌ప్లేకు సపోర్ట్ చేస్తుంది. దీనితో పాటు హెడ్-అప్ డిస్‌ప్లే, క్రూయిజ్ కంట్రోల్, వైర్‌లెస్ ఛార్జర్, వైర్‌లెస్ స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి. ఈ కారులో 16-ఇంచుల డైమండ్-కట్ అల్లాయ్ వీల్స్, కలర్డ్ MIDతో కూడిన ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, హైట్ అడ్జస్టబుల్ డ్రైవర్ సీట్, ఫాస్ట్ USB ఛార్జింగ్ పోర్ట్, కనెక్టెడ్ కార్ ఫీచర్లు, రియర్ AC వెంట్స్, లెదర్ ర్యాప్డ్ స్టీరింగ్ వీల్ వంటి లేటెస్ట్ ఫీచర్లు కూడా ఉన్నాయి. ఇవి యువతకు, ఫ్యామిలీకు బెస్ట్ ఆఫ్షన్ గా నిలుపుతాయి.
సేఫ్టీ విషయంలో మారుతి ఫ్రాంక్స్ చాలా అద్భుతంగా ఉంది. ఇందులో డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్‌బ్యాగ్‌లతో పాటు కొన్ని వేరియంట్‌లలో సైడ్, కర్టెన్ ఎయిర్‌బ్యాగ్‌లు కూడా ఉన్నాయి. దీనితో పాటు ABS, EBD, హిల్ హోల్డ్ అసిస్ట్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్ (ESP) వంటి సేఫ్టీ ఫీచర్లు ఉన్నాయి. రియర్ వ్యూ కెమెరా, రివర్స్ పార్కింగ్ సెన్సార్, కొన్ని వేరియంట్‌లలో లభించే 360-డిగ్రీ కెమెరా దీనిని మరింత సురక్షితంగా చేస్తాయి. అలాగే ఇందులో సీట్ బెల్ట్ రిమైండర్, స్పీడ్ అలర్ట్ సిస్టమ్, ISOFIX చైల్డ్ సీట్ యాంకరేజ్ వంటి సేఫ్టీ స్టాండర్డ్స్ కూడా ఉన్నాయి.
Also Read : మారుతి వెబ్‌సైట్‌లో గ్రాండ్ విటారా సీఎన్‌జీ మాయం.. అసలేమైందంటే ?