Maruti New Mini Bus: ఫోర్ వీలర్ కావాలని అనుకునే విభిన్న కస్టమర్లకు వారికి అనుగుణంగా వెహికల్స్ ను అందించడంలో Maruti Suzuki మిగతా కంపెనీల కంటే ముందు ఉంటుంది. సామాన్యుల నుంచి ప్రీమియం కార్లు కోరుకునే వారికి అనుగుణంగా ఈ కార్లు మార్కెట్లోకి వస్తుంటాయి. అయితే మారుతి నుంచి అత్యంత సరసమైన ధరకు మినీ బస్సును అందించాలని ఉద్దేశంతో మారుతి Eco ఇప్పటికే మార్కెట్లోకి రిలీజ్ చేసిందని ఆకట్టుకుంది. అయితే ఇప్పుడు లేటెస్ట్ గా మినీ బస్సును అప్డేట్ చేస్తూ కొత్త వాహనాన్ని తీసుకురాబోతుంది.. ఇది సామాన్యులు ధనం ఇచ్చేలా ఉండడంతో పాటు అత్యధిక మైలేజ్ తో పాటు వాణిజ్య అవసరాలకు ఉపయోగపడే విధంగా ఉంటుంది. మరి దీని గురించి పూర్తి వివరాల్లోకి వెళితే..
ఇప్పటికే మార్కెట్లో ఉన్న మారుతి ఈకో అప్డేట్ చేస్తూ కొత్త మినీ బస్సును తీసుకురాబోతున్నారు. ఇది MPV కోరుకునే వారికి అనుగుణంగా ఉంటుంది. విశాలమైన క్యాబిన్ తో పాటు కంఫర్ట్ సీటింగ్ ఉండడంతో దూర ప్రయాణాలు చేసే వారికి అనుగుణంగా ఉంటుంది. అంతేకాకుండా ఈ వాహనం ఇంజన్ లీటర్ కు 28 కిలోమీటర్ల మైలేజ్ ఇవ్వనుంది. ఈ ఇంజన్ వాహనం మెయింటెనెన్స్ ఖర్చులు తగ్గిస్తుంది. ఉమ్మడి కుటుంబాలు ప్రయాణం చేయడంతో పాటు వాణిజ్య అవసరాలకు ఉపయోగపడే ఈ వెహికల్ను మార్కెట్లో రూ.4.99 లక్షల ప్రారంభ ధరతో విక్రయించనున్నారు. అయితే ఆయా ప్రాంతాల బట్టి ధరలు మారే అవకాశం ఉంటుంది.
ఈ వెహికల్ ను ఒకేసారి డబ్బు పెట్టి కొనకుండా ఈఎంఐ ద్వారా కొనుగోలు చేయాలనుకుంటే రూ, 5,999 తో అందుబాటులో ఉన్నట్టు కంపెనీ తెలిపింది. ఈ వెహికిల్ ఎక్స్టీరియర్ డిజైన్ విషయానికి వస్తే బాక్సింగ్ డిజైన్ను కలిగి ఉంది. స్పష్టమైన లెన్స్ తో కూడిన హెడ్ లాంచ్, విస్తృతమైన లగేజ్ లేదా ప్రయాణికులు ఎంట్రీ ఇవ్వడానికి అనుగుణంగా ఉండే డోర్లు, స్టీల్ చక్రాలు, లాకౌట్ బంపర్లు, హై రోప్ లైన్ మల్టీ ఫీచర్లు ఉన్నాయి. ఇంటీరియర్ ఫీచర్స్ విషయానికి వస్తే ప్రయాణికుల సౌకర్యార్థం ఫ్లెక్సిబుల్ సీటింగ్ లేఅవుట్, పెద్ద విండోస్, ఆకట్టుకునే స్మార్ట్ డాష్ బోర్డు, లగేజ్ వేసుకునేందుకు స్టోరేజ్ ప్యాకెట్స్ వంటివి ఉన్నాయి. యూఎస్బీ చార్జింగ్ పోర్ట్, మొబైల్ హోల్డర్స్, మాన్యువల్ హెయిర్ కండిషన్ వంటివి అమర్చారు. సేఫ్టీ కోసం ముందు కూర్చున్న వారికి సీట్ బెల్ట్, హాయ్ మౌంటాడు స్టాప్ లాంపు, ఎంపిక చేసిన వేరియంట్లలో రివర్స్ పార్కింగ్ వంటి సేఫ్టీ ఫీచర్లు ఉన్నాయి.
తక్కువ ధరలో వాణిజ్య అవసరాల కోసం వాహనం కావాలని అనుకునే వారికి ఇది అనుగుణంగా ఉంటుంది.