OnePlus 15R Price: నేటి కాలంలో బ్రాండెడ్ స్మార్ట్ ఫోన్లకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. వీటిలో One Plus కంపెనీ ఫోన్లకు ఎక్కవ ఆదరణ ఉంది. ఇప్పటికే ఈ కంపెనీ నుంచి రిలీజ్ అయిన ఎన్నో మోడల్స్ వినియోగదారులను ఆకట్టుకున్నాయి. అయితే ఎప్పటికప్పుడు అప్డేట్ వెర్షన్స్ మార్కెట్లోకి వచ్చి ఆకట్టుకుంటున్నాయి. డిసెంబర్ 22న మార్కెట్లోకి రాబోతున్న One Plus 15R డిస్ ప్లే గురించి ఆసక్తికర చర్చ సాగుతోంది. ఇందులో ఎవరూ ఊహించని హై టెక్నాలజీ డిస్ ప్లేను అమర్చారు. ఇప్పటి వరకు చాలా మంది ఇందులో సాధారణ డిస్ ప్లే ఉంటుందని భావించారు. కానీ ఇందులో OLEDడిస్ ప్లేను అమర్చారు. అసలు ఈ డిస్ ప్లే తో ఉన్న బెనిఫిట్స్ ఏంటీ? ఇది ఎలా పనిచేస్తుంది?
ఈ ఏడాదిలో అమెరికాలో One Plus 13R అందుబాటులోకి తీసుకొచ్చారు. అయితే దీనిని అప్ గ్రేడ్ చేస్తూ ఇటీవల One Plus 15R ను తీసుకొచ్చారు. ఇందులో 8 Gen 5 ప్రాసెసర్ తో పాటు 165 Hz రిష్రెష్ రేట్ OLEDడిస్ ప్లే ను అమర్చారు. ఇది 3200 Hz శాంప్లింగ్ రేట్ తో ఉండడంతో విజువల్స్ అద్భుతంగా ఉంటుంది. అంతేకాకుండా గేమింగ్ కోరుకునేవారికి ఇది బాగా అనుకూలంగా ఉంటుంది.
One Plus 15R అనేది ఏమాత్రం రాజీపడకుండా టాప టైర్ బ్రైట్ నెస్ ను కలిగి ఉంటుంది. అవుట్ డోర్ లో ఉన్న సమయంలో అద్భతమైన విజుబిలిటీని అందిస్తుంది. 3840Hz PWM డిమ్మింగ్ రేట్ తో కలిగిన మొట్టమొదటి ఫోన్ ఇది. అందుకే దీని కొనుగోలుకు ఆసక్తి చూపుతున్నారు. అంతేకాకుండా OLED టెక్నాలజీని అమర్చడంతో ఇది చీకటిగదిలోనూ ప్రకాశవంతంగా డిస్ ప్లేను అందిస్తుంది.
ఈ మొబైల్ లో12 జీబి Ram, 256 స్టోరేజ్ ఉంది. దీనిని రూ.47,999తో విక్రయిస్తున్నారు. అయితే 12 జీబీ Ram, 512 జీబీ స్టోరేజ్ కలిగిన మొబైల్ 52,999తో విక్రయిస్తున్నారు. క్రెడిట్ కార్డుల ద్వారా కొనుగోలు చేస్తే మరింత తగ్గే అవకాశం ఉంది. ఇందులో ప్రధానంగా బ్యాటరీ వ్యవస్థ గురించి చెప్పుకోవచ్చు. 7400mAh బ్యాటీరీని అమర్చిన ఇది 80 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సౌకర్యం ఉంటుంది. త్వరలో మార్కెట్లోకి రాబోతున్న ఈ మొబైల్ చార్ కోల్ బ్లాక్, మింట్ బ్రీజ్ కలర్లలో అందుబాటులో ఉండనుంది. 50 మెగా పిక్సెల్ ప్రధాన కెమెరాను కలిగి ఉన్న ఇందులో సెల్ఫీ కోసం 32 మెగా పిక్సెల్ తో పనిచేస్తుంది. 112 డిగ్రీల ఫీల్డ్ ఆఫ్ బ్యూత్ 8 ఎంపీ ఆల్ట్రా వైడ్ సెన్సాన్ తో పనిచేస్తుంది.