OG 2 Shoting Updates: ‘గబ్బర్ సింగ్ ‘ చిత్రం తర్వాత పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) అభిమానులకు ఒక ఎమోషన్ లాగా మారిన చిత్రం ‘ఓజీ'(They Call Him OG). ఎందుకంటే వరుసగా ఫ్లాప్స్ వస్తున్న సమయం లో, ఇక మా హీరో నుండి మంచి సినిమాలు వచ్చే స్కోప్ లేదా అని అభిమానులు నిరుత్సాహానికి గురైన సమయం లో వచ్చిన సినిమాలు ఇవి. ‘హరి హర వీరమల్లు’ లాంటి దారుణమైన సినిమాని చూసిన తర్వాత, కేవలం రెండు నెలల గ్యాప్ లో రాబోయే ‘ఓజీ’ చిత్రం అద్భుతంగా ఉంటుందని ఎవ్వరూ ఊహించలేరు. ఒక్కసారిగా ప్రీమియర్ షోస్ లో ఆ రేంజ్ ఔట్పుట్ ని చూసిన అభిమానులు థియేటర్స్ లో చొక్కాలు చింపేసుకున్నారు. ముఖ్యంగా ఇంటర్వెల్ సమయం లో అయితే పవన్ కళ్యాణ్ అభిమానుల కేరింతలకు థియేటర్స్ రూఫ్ టాప్స్ లేచిపోయాయి. ఆ రేంజ్ రెస్పాన్స్ వచ్చింది. అభిమానుల రెస్పాన్స్ కి తగ్గట్టుగానే సెన్సేషనల్ ఓపెనింగ్స్ వచ్చాయి.
ఇతర భాషల్లో ఈ చిత్రాన్ని కొన్ని అనుకోని కారణాల వల్ల భారీ రేంజ్ లో విడుదల చేయలేకపోయారు కానీ, కేవలం తెలుగు వెర్షన్ నుండే ఈ చిత్రానికి మొదటి రోజు 150 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లు వచ్చాయి. ఇప్పటి వరకు ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ హిస్టరీ లో కేవలం ఒక్క భాష నుండి ఈ రేంజ్ గ్రాస్ ఓపెనింగ్ రావడం అనేది ఎప్పుడూ జరగలేదు. ‘కాంతారా 2’ లాంటి భారీ సినిమా పాజిటివ్ టాక్ తో నడుస్తున్నప్పటికీ కూడా ఈ చిత్రం ఫుల్ రన్ లో 316 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టి సంచలనం సృష్టించింది. ఇదంతా పక్కన పెడితే ఈ చిత్రానికి కచ్చితంగా సీక్వెల్, ప్రీక్వెల్ ఉంటుందని డైరెక్టర్ సుజిత్ ఖరారు చేసాడు. కానీ ఈ రెండు సినిమాలు ఎప్పుడు మొదలు అవ్వబోతున్నాయి అనే దానిపై మాత్రం ఆయన ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు అప్పట్లో.
కానీ అందుతున్న విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం చూస్తే వచ్చే ఏడాది మార్చ్ నెల నుండి ‘ఓజీ 2’ చిత్రం షూటింగ్ మొదలు అవుతుందని అంటున్నారు. డైరెక్టర్ సుజిత్ ముందుగా నేచురల్ స్టార్ నాని తో సినిమా చెయ్యాలని అనుకున్నాడు. కానీ పవన్ కళ్యాణ్ సుజిత్ ని పిలిచి డేట్స్ ఇస్తాను, సర్దుబాటు చేసుకోమని చెప్పడంతో, నాని మూవీ కంటే ముందు ఓజీ 2 సెట్స్ మీదకు వెళ్లే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. నాని కూడా ప్రస్తుతం ‘ది ప్యారడైజ్’ మూవీ షూటింగ్ లో ఫుల్ బిజీ గా ఉండడం వల్ల, మరో ఆరు నెలల పాటు ఆయన అందుబాటులో ఉండే అవకాశాలు కనిపించకపోవడం తో ఓజీ 2 ని సెట్స్ పైకి తీసుకొచ్చే ప్లాన్ చేస్తున్నారట. ‘ఓజీ 2’ లో పవన్ కళ్యాణ్ ద్విపాత్రాభినయం చేస్తున్నాడు . అందులో ఒక పాత్ర ఓజాస్ గంభీర కి తండ్రి. అతను ఆర్మీ చీఫ్, అందుకే పవన్ కళ్యాణ్ లేటెస్ట్ లుక్స్ ఆర్మీ స్టైల్ లో హెయిర్ స్టైల్ చేయించుకున్నట్టు తెలుస్తుంది. లుక్ టెస్ట్ కోసమే అలా చేశారట. కొత్త సంవత్సరం రోజున అభిమానులను సర్ప్రైజ్ కి గురి చేసే అప్డేట్ ని డైరెక్టర్ సుజిత్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.