Maruti Car: ప్రస్తుత కాలంలో 7 సీటర్ కారంటే చాలా ఇష్టపడుతున్నారు. కార్యాలయ అవసరంతో పాటు ఫ్యామిలీ టూర్ కు వెళ్లడానికి ఈ కారు అనుగుణంగా ఉంటుంది. అంతేకాకుండా విశాలమైన స్పేస్ తో పాటు ఇంజిన్ సామర్థ్యం ఎక్కువగా ఉంటుంది. ఇప్పటికే మార్కెట్లోకి 7 సీటర్ కార్లు చాలా వచ్చాయి. కానీ ఎక్కువ మంది ఈ కారు కోసం ఎగబడుతున్నారు. ఇంతకీ ఈ కారు ఎదో తెలుసుకోవాలని ఉందా?
దేశంలో కార్ల ఉత్పత్తిలో అగ్రగామిగా నిలుస్తోంది మారుతి కంపెనీ. హ్యాచ్ బ్యాక్ నుంచి ఎస్ యూవీ వరకు వివిధ మోడళ్లను మార్కెట్లోకి తీసుకొచ్చిన మారుతి 7 సీటర్ ను కూడా అందుబాటులోకి తీసుకొచ్చింది. అదే మారుతి ఎర్టీగా. మారుతి ఎర్టీగా కారు ఇప్పటికే రోడ్లపై తిరుగుతూ వినియోగదారులను ఆకట్టుకుంటోంది. అయితే ఇందులో కొన్ని ప్రత్యేకతలు ఉండడంతో దీని కోసం ఎగబడుతున్నారు.
మారుతి ఎర్టిగా 1.5 లీటర్ పెట్రోల్ ఇంజిన్ తో పాటు 103 బీహెచ్ పీ పవర్, 137 ఎన్ఎం టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 5 స్పీడ్ మాన్యువల్, 6 స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్ మిషన్ తో అందిస్తుంది. పెట్రోల్ వేరియంట్ తో పాటు సీఎన్ జీ వెర్షన్ లో అందుబాటులో ఉన్న ఎర్టీగా ఈ వేరియం్ట్ లో 121.5 ఎన్ఎం టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది.
మారుతి ఎర్టీగా ఫీచర్స్ అద్భుతమనే చెప్పాలి. ముఖ్యంగా ఇందులో సేప్టీ పీచర్స్ ఆకట్టుకుంటున్నాయి. నాలుగు ఎయిర్ బ్యాగ్స్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, హిల్ హోల్డ్ అసిస్ట్, రియర్ పార్కింగ్ వంటివి ఆకర్షిస్తున్నాయి. మార్కెట్లో ఇప్పటి వరకు ఉన్న 7 సీటర్ కార్లు ఇన్నోవా, కియా కారెన్స్ కు మారుతి ఎర్టీగా గట్టి పోటీ ఇస్తోంది.
మారుతి ఎర్టీగా కోసం ఇటీవల ఎగబడుతున్నారు. 2024 మే నెలలో ఈమోడల్ 13,893 యూనిట్ల విక్రయాలు జరుపుకుంది. అయితే ఈ కారుకు ఉన్న ధర కూడా ఆకర్షణీయంగా ఉంది. మిగతా 7 సీటర్ కంటే ఎర్టీగా ధర తక్కువగా ఉంది. ప్రస్తుతం దీనిని రూ.8.69 లక్షల ప్రారంభ ధరతో విక్రయిస్తున్నారు. టాప్ ఎండ్ రూ.13.03 లక్షల వరకు విక్రయిస్తున్నారు.