Devara: జూనియర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో వస్తున్న దేవర సినిమా మీద ప్రేక్షకుల్లో మంచి అంచనాలైతే ఉన్నాయి. ఇక రీసెంట్ గా ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ ను కూడా రిలీజ్ చేసి ప్రేక్షకుల్లో అంచనాలను తారా స్థాయికి పెంచే ప్రయత్నం అయితే చేశారు. ఇక ఇదిలా ఉంటే రీసెంట్ గా ఈ సినిమాను సెన్సార్ వాళ్ళు సర్టిఫికెట్ కోసం పంపించారు. ఇక ఈ సినిమాను చూసిన సెన్సార్ బోర్డు మెంబర్స్ 10 షాట్స్ ను కట్ చేయమని మేకర్స్ కి చెప్పినట్టుగా తెలుస్తుంది. ఇక వాటిని తొలగించిన తర్వాత ఈ సినిమాకి ‘యూ బై ఏ’ సర్టిఫికెట్ ని కూడా జారీ చేసినట్టుగా తెలుస్తోంది.ఇక సెన్సార్ బోర్డు మెంబర్స్ చెబుతున్న మాటలను బట్టి చూస్తే దేవర సినిమా మీద అంచనాలు మరింత పెరిగిపోతున్నాయనే చెప్పాలి… ఇక ఈ సినిమాను చూసిన సెన్సార్ బోర్డు మెంబర్స్ స్పందిస్తూ ‘సినిమా చాలా అద్భుతంగా ఉందని ఎన్టీఆర్ చాలా కొత్తగా కనిపించడమే కాకుండా రెండు గెటప్పుల్లో ప్రేక్షకులను అలరించే ప్రయత్నం చేశాడు అంటూ వాళ్ళు చెబుతున్న మాటలు ఇప్పుడు ఎన్టీఆర్ అభిమానులతో పాటు సగటు ప్రేక్షకులను కూడా అలరిస్తున్నాయనే చెప్పాలి. ఇక ముఖ్యంగా క్లైమాక్స్ అయితే ఈ సినిమాకి చాలా హైలెట్ గా నిలువబోతుందని కూడా వాళ్ళు చెబుతున్నారు’.
ఇక సెప్టెంబర్ 27వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తున్న నేపథ్యంలో ఇప్పటికే ఈ సినిమా మీద భారీ హైప్ అయితే క్రియేట్ చేసే పనిలో సినిమా మేకర్స్ ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇక ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి బాలీవుడ్ స్టార్ హీరో అయిన హృతిక్ రోషన్ కూడా హాజరు కాబోతున్నాడనే వార్తలైతే వినిపిస్తున్నాయి. ఇక ఎన్టీఆర్ హృతిక్ రోషన్ ఇద్దరూ కలిసి ‘వార్ 2’ సినిమాలో నటిస్తున్న విషయం మనకు తెలిసిందే. కాబట్టి వీరిద్దరి మధ్య ఉన్న మంచి రిలేషన్ వల్లే హృతిక్ రోషన్ ఈ ఈవెంట్ కి హాజరవ్వబోతున్నాడనే వార్తలు వస్తున్నాయి.
ఇక తొందర్లోనే ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను కూడా నిర్వహించే పనుల్లో మేకర్స్ ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇక సెన్సార్ బోర్డు వాళ్ళు ఇచ్చిన సర్టిఫికెట్ కి గాని వాళ్ళు ఇచ్చిన కాంప్లిమెంట్స్ కి గాని దర్శకుడు ‘కొరటాల శివ’ చాలా వరకు ఇంప్రెస్ అయినట్టుగా తెలుస్తోంది. ఇక ప్రేక్షకులు కూడా ఈనెల 27వ తేదీన ఎన్టీయార్ చేసే మాస్ జాతరను చూడడానికి రెడీగా ఉండండి అంటూ కొరటాల తన అభిప్రాయాన్ని తెలియజేస్తున్నాడు.
ఇక మొత్తానికైతే కొరటాల ‘ఆచార్య’ సినిమాతో ఢీలాపడిన విషయం మనకు తెలిసిందే. మరి ఈ సినిమాతో సూపర్ సక్సెస్ ని సాధించి ప్లాప్ దర్శకుడిగా ఉన్న ముద్రను తొలిగించుకుంటాడా లేదా అనేది తెలియాల్సి ఉంది…ఇక ఎన్టీఆర్ మాత్రం ఈ సినిమా మీద భారీ అంచనాలైతే పెట్టుకున్నాడు. ఇక ఆ అంచనాలను రీచ్ అయ్యేవిధంగా ఈ సినిమా సక్సెస్ ని సాధిస్తుందా లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది…