Maruti 800 Alto: ఒకప్పుడు సొంత అవసరాల కోసం చిన్న కార్లను కొనుగోలు చేసేవారు. కానీ ఇప్పుడు పెద్ద కార్లు సైతం తక్కువ ధరలో వస్తుండడంతో చాలామంది వీటి కొనుగోలుకే ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. ఇటీవల కొన్ని కంపెనీలు గతంలో అమ్మకాల్లో సక్సెస్ సాధించిన కొన్ని మోడల్స్ ను తిరిగి అప్డేట్ చేస్తూ మార్కెట్లోకి తీసుకు వస్తున్నాయి. వీటిలో Maruti Suzuki కంపెనీకి చెందిన ఓ కారు గతంలో Sedan వేరియంట్ కారును ఇప్పుడు లేటెస్ట్ టెక్నాలజీతో వినియోగదారులకు అందిస్తున్నారు.ఈ కారు మార్కెట్లోకి రాకముందే సందడి చేస్తోంది. ఇంతకీ ఇది ఏ కారు? దీని విశేషాలు ఏంటి?
Maruti Suzuki కంపెనీ నుంచి దశాబ్దాల కిందట మార్కెట్లోకి వచ్చిన Alto 800 కారును చాలామంది సొంతం చేసుకున్నారు. అయితే ఇప్పుడు దీనిని పూర్తిగా మార్చివేశారు. ప్రస్తుతం ఈ కారు పూర్తిగా SUV కారు వలె తలపిస్తుంది. దీనిని మొత్తం బోల్డర్ మోడల్ లో డిజైన్ చేశారు. హెడ్ లైన్స్ తో పాటు గ్రిల్ ఆకట్టుకునే విధంగా ఉన్నాయి. నగరాల్లో ప్రయాణం చేసే వారితోపాటు దూర ప్రయాణాలు చేసే వారికి అనుగుణంగా దీనిని మార్చివేశారు. ఇప్పటివరకు వచ్చిన ఆల్టో 800 పెట్రోల్ వేరియంట్ లో లీడర్ ఇంధనానికి 22 కిలోమీటర్ల మైలేజ్ ఇచ్చేది. సిఎన్జీలో 31.59 కిలోమీటర్ల మైలేజ్ ఇచ్చేది. ఇప్పుడు కూడా అంతే మైలేజ్ ఇచ్చే అవకాశం ఉందని అంటున్నారు. అయితే మెరుగైన ఇంజన్ పనితీరుతో మరింత మైలేజ్ పెరిగే అవకాశం ఉందని అంటున్నారు.
ఈ కొత్త ఆల్టో లో 796 సిసి ఇంజన్ పనిచేయనుంది. గతంలో లాగే ఇందులో పెట్రోల్ ఇంజన్ తో పనిచేసే ఈ ఇంజన్ తక్కువ మెయింటెనెన్స్ తో పనిచేస్తుంది. ఇది రోజు వారి ప్రయాణికులతో పాటు లాంగ్ జర్నీ చేసే వారికి అదనంగా సేవ్ అయ్యే అవకాశం ఉంది. కొత్తగా కారు కొనుగోలు చేసే వారికి సైతం ఇంజన్ అనుగుణంగా ఉంటుంది. ఈ కారులో సేఫ్టీ ఫీచర్స్ ప్రధానంగా చేర్చారు. కొత్తగా ఇందులో సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ అమర్చారు. ఇది ప్రయాణికులకు అత్యంత భద్రతను కలిగిస్తుంది. అలాగే స్థిరమైన బాడీ నిర్మాణం, బ్రేకింగ్ పనితీరు కొత్త వినియోగదారులకు సైతం అనుకూలంగా ఉంటుంది.
ఇప్పటివరకు వచ్చిన ఆటోలో ఎలక్ట్రిక్ పవర్ స్టీరింగ్ ఉండేది. ఇప్పుడు డిజిటల్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టం అమర్చే అవకాశం ఉంది. అలాగే డ్రైవర్ డిస్ప్లే ఆకట్టుకొని ఉంది. విశాలమైన క్యాబిన్ తో పాటు ఏసీ వేరియంటు, పవర్ విండోస్ అనుకూలంగా ఉండనున్నాయి. ఇక ఈ కారును రూ.4.99 లక్షల ప్రారంభ ధరతో విక్రయించే అవకాశం ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. ఒకవేళ ఈఎంఐ ప్లాన్ చేసుకుంటే రూ.5,000 నుంచి ప్రారంభం అయ్యే అవకాశం ఉందని అంటున్నారు. ఇది మిడిల్ క్లాస్ వారికి ఎంతో అనుగుణంగా ఉంటుంది. అంతేకాకుండా కొత్తగా కారు కొనాలని అనుకునే వారికి ఆకట్టుకోనుంది.