https://oktelugu.com/

Maruthi Swift 2024: మైలేజ్ కు మొగుడు.. ఫీచర్లకు పెట్టింది పేరు.. కొత్త స్విప్ట్ మామలుగా లేదుగా..

ఈ కారు లో 1.2 లీటర్ 4 సిలిండర్ హైబ్రిడ్ పెట్రోల్ ఇంజిన్ ను కలిగి ఉంది. ఇది 89.8 బీహెచ్ పీ పవర్ ను, 113ఎన్ ఎం టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది.

Written By:
  • Srinivas
  • , Updated On : May 4, 2024 / 11:51 AM IST

    Maruthi Swift 2024 Millage

    Follow us on

    Maruthi Swift 2024:  మారుతి కంపెనీ కారు మార్కెట్లోకి వస్తుందంటే కారు ప్రియులు ఆసక్తిగా ఎదురుచూస్తారు. అందులోనూ ఎవర్ గ్రీన్ మోడల్ గా నిలచిన స్విప్ట్ కొత్త రూపాంతరం చెంది మార్కెట్లోకి వస్తోంది. దీంతో ఇప్పటికే చాలా మంది ఈ కారు ఎప్పుడెప్పుడు వస్తుందా? అని ఎదురుచూస్తున్నారు. ఈ తరుణంలో కారు గురించి వివరాలు బయటకు రానే వచ్చాయి. దీనిని మే 9న మార్కెట్లో లాంచ్ చేయనున్నారు. అయితే అంతకంటే ముందే కొత్త స్విప్ట్ గురించి తీవ్రంగా చర్చించుకుంటున్నారు. ముఖ్యంగా ఈ కారు ఇచ్చేర మైలేజ్ ను చూసి షాక్ అవుతున్నారు. ఫీచర్స్ ను చూసి ఫిదా అవుతున్నారు. కారు పూర్తి వివరాల్లోకి వెళితే..

    2024 మారుతి స్విప్ట్ ను 2023 ఏడాదిలో జపాన్ లోని టోక్యోలో ప్రదర్శించారు. అప్పటి నుంచి ఈ కారుపై క్రేజ్ పెరిగింది. ఈ కారు డిజైన్, ఫీచర్స్ గురించి లీక్ కాగానే ఈ కారును సొంతం చేసుకోవాలని చాలా మంది అనుకుంటున్నారు. కొత్త స్విప్ట్ లో ఇంటీరియర్ డిజైన్ విషయానికొస్తే 9 అంగుళాల టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ ఉంది. ఇందులో వైర్ లెస్ ఛార్జింగ్, ఏసీ వేరియంట్ వి ఆకర్షిస్తాయి. ఎక్స్ టీరియర్ లో ఎల్ ఈడీ ఫాగ్ ల్యాంప్స్ ఆకర్షిస్తాయి.

    ఈ కారు లో 1.2 లీటర్ 4 సిలిండర్ హైబ్రిడ్ పెట్రోల్ ఇంజిన్ ను కలిగి ఉంది. ఇది 89.8 బీహెచ్ పీ పవర్ ను, 113ఎన్ ఎం టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. పాత స్విప్ట్ కంటే కొత్త కారు తక్కువ పవర్ ఉన్నా ఇంధర సామర్థ్య పనితీరు బాగుంటుందనిపిస్తుంది. ఈ కారు లాంచ్ దగ్గరవుతున్న కొద్దీ మరింత క్రేజ్ సంపాదించుకుంటోంది. సేప్టీలోనూ ఏమాత్రం తగ్గేదేలే అన్నట్లు ఈ కారులో అధునాతన సౌకర్యాలు ఉంచారు. ఇందులో 6 ఎయిర్ బ్యాగ్స్ ఉండనున్నాయి.

    మైలేజ్ కు మొగుడులా ఈ కారు పనితీరు ఉండనుందన్న చర్చ సాగుతోంది. సరికొత్త స్విప్ట్ లీటర్ పెట్రోల్ కు 22.56 కిలోమీటర్ల మైలేజ్ ఇచ్చి ఆకర్షిస్తోంది. ఇక ధర విషయానికొస్తే దీనిని మిడిల్ క్లాస్ పీపుల్స్ కు అందించాలనే ఉద్దేశంతో తక్కువ ధరనే నిర్ణయించారు. ఈ కాు ఎక్స్ షో రూం వద్ద రూ.6.5 లక్షల ప్రారంభ ధరతో విక్రయించనున్నారు. ఇప్పటికే రూ.11,000 టోకెన్ తో బుకింగ్ ప్రారంభమైన ఈ కారు మార్కెట్లోకి వచ్చాక ఎలాంటి మాయ చేస్తుందో చూడాలి.