https://oktelugu.com/

Maruthi Hybrid Car: అతి తక్కువ ధరకే మారుతి హైబ్రిడ్ కారు..

కానీ మారుతి సుజుకీ కార్లలో సాంకేతికానికి విలువ ఇస్తూనే తక్కువ ధరకు అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలిపారు. అయితే ప్రస్తుతం హైబ్రిడ్ కార్లపై ప్రభుత్వం 43 శాతం టాక్సీ విధిస్తోందని అన్నారు. ఎలక్ట్రిక్ కార్లపై 5 శాతం మాత్రమే ట్యాక్స్ వేస్తున్నారని అన్నారు. అందువల్ల హైబ్రిడ్ కార్లపై ట్యాక్స్ తగ్గించాలని, అప్పుడు వినియోగదారులకు మరింత తక్కువ ధరకే కార్లు అందిస్తామని ఆర్ సీ భార్గవ అన్నారు.

Written By:
  • Srinivas
  • , Updated On : April 28, 2024 / 11:24 AM IST

    Maruthi Hybrid Car

    Follow us on

    Maruthi Hybrid Car: దేశంలోని కార్ల ఉత్పత్తిలో మారుతి సుజుకీ అగ్రగామిలో ఉంది. ఈ కంపెనీ నుంచి ఎన్నో మోడళ్లు మార్కెట్లోకి వచ్చాయి. పెట్రోల్ ధరలు, కాలుష్యం కారణంగా పెట్రోల్, డీజిల్ కార్ల స్థానంలో ఎలక్ట్రిక్ కార్లను తీసుకొస్తున్నారు. వీటితో పాటు హైబ్రిడ్ కార్లు కూడా రానున్నాయి. అయితే మారుతి నుంచి కూడా ఎలక్ట్రిక్ కారుతో పాటు హైబ్రిడ్ కారును తీసుకొస్తున్నారు. ఈ మేరకు కంపెనీ చైర్మన్ ఆర్ సీ భార్గవ వెల్లడించారు. త్వరలో మారుతి నుంచి ఎలక్ట్రిక్ కారు రాబోతుందని ఆయన పేర్కొన్నారు. అయితే ఈ సందర్భంగా ఆయన ప్రభుత్వం విధించే జీఎస్టీపై సంచలన వ్యాఖ్యలు చేశారు.

    జపాన్ కు చెందిన సుజుకీ కంపెనీనీతో కలిసి మారుతి సుజుకీ పనిచేస్తోంది. హైబ్రిడ్ కార్ల ను మార్కెట్లోకి తేవడమే లక్ష్యంగా ఈ ఒప్పందం జరిగినట్లు చెబుతున్నారు. ప్రస్తుతం ఎక్కువ మంది పెట్రోల్, డీజిల్ రహిత కార్లను కోరుకుంటున్నారని, ఈ నేపథ్యంలో ఎక్కువ మైలేజ్ ఇచ్చే హైబ్రిడ్ కార్లను అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలిపారు. ఇక టయోటా హైబ్రిడ్ కార్లు సైతం రెడీ అవుతున్నా.. అందులో ఉపయోగించే సాంకేతికత చాలా విలువైందని అన్నారు. దీని వల్ల ధర ఎక్కువగా ఉంటుందని అన్నారు.

    కానీ మారుతి సుజుకీ కార్లలో సాంకేతికానికి విలువ ఇస్తూనే తక్కువ ధరకు అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలిపారు. అయితే ప్రస్తుతం హైబ్రిడ్ కార్లపై ప్రభుత్వం 43 శాతం టాక్సీ విధిస్తోందని అన్నారు. ఎలక్ట్రిక్ కార్లపై 5 శాతం మాత్రమే ట్యాక్స్ వేస్తున్నారని అన్నారు. అందువల్ల హైబ్రిడ్ కార్లపై ట్యాక్స్ తగ్గించాలని, అప్పుడు వినియోగదారులకు మరింత తక్కువ ధరకే కార్లు అందిస్తామని ఆర్ సీ భార్గవ అన్నారు. ఈ విషయాన్ని ఇప్పటికే కేంద్ర మంత్రి నితిన్ గడ్గరీ వద్దకు తీసుకెళ్లామని, పన్ను తగ్గించడం వల్ల కార్ల ఉత్పత్తి ఖర్చు తగ్గి తక్కువ ధరకే మార్కెట్లోకి తీసుకొస్తామని అన్నారు.

    మారుతి నుంచి వచ్చే తొలి ఎలక్ట్రిక్ కారు కు సంబంధించిన ఫొటోలు ఇప్పటికే ఆన్ లైన్ లో లీక్ అయ్యాయి. దీనిని టెస్ట్ డ్రైవ్ కూడా చేశారు. ఈవీఎక్స్ పేరుతో వచ్చే ఈ కారు ఈ ఏడాదిలోపే రోడ్లపై తిప్పుతామని ఆర్ సీ భార్గవ తెలిపారు. ఇందులో 60kWh బ్యాటరీ ఉండనుంది. దీనిని ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే 550 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది.