https://oktelugu.com/

Million Sales Car: 10 లక్షల కంటే ఎక్కువగా అమ్ముడుపోయిన కార్లు ఇవే..

క్రెటా మొత్తం ఒక మిలియన్ 10 లక్షల సేల్స్ ను జరుపుకుంది. మరో ఎస్ యూవీ మహీంద్రా స్కార్పియో సైతం 10 లక్షలకు పైగానే యూనిట్లు అమ్ముడుపోయింది.

Written By:
  • Srinivas
  • , Updated On : April 28, 2024 / 11:20 AM IST

    Millian Sales car

    Follow us on

    Million Sales Car: భారత్ లో కార్లకు రోజురోజుకు డిమాండ్ పెరిగిపోతుంది. దీంతో కంపెనీలు కొత్త కొత్త మోడళ్లను మార్కెట్లోకి తీసుకొస్తున్నాయి. లాంచ్ అయిన ప్రతీ కారు హిట్టు అవుతుందని చెప్పలేం. కానీ కొన్ని కార్లు మాత్రం ఇప్పటికీ అత్యధిక సేల్స్ ను నమోదు చేసుకుంటున్నాయి. వీటిలో ఎస్ యూవీ కార్లకు విపరీతమైన డిమాండ్ పెరుగుతోంది. ఎస్ యూవీకి చెందిన మూడు కార్లు 10 లక్షలకు పైగా సేల్స్ నమోదు చేసుకోవడం విశేషం. ఇంతకీ ఆ కార్లు ఏవో తెలుసా?

    ప్రపంచ కార్ల మార్కెట్లో భారత్ మూడో స్థానంలో ఉంది. ఇండియాకు చెందిన మూడు కంపెనీలు కొత్త కొత్త కార్లు ఉత్పత్తి చేస్తూ వినియోగదారులను ఆకట్టుకుంటున్నాయి. వీటిలో మారుతి, హ్యుందాయ్, మహీంద్రా కంపెనీలు ఉన్నాయి. ఈ కంపెనీలకు చెందిన బ్రెజ్జా, క్రెటా, స్కార్పియోల అమ్మకాలు 10 లక్షలకు పైగా సేల్స్ అయ్యాయి. భారత్ లో ఎన్నో కంపెనీలు ఎస్ యూవీలను మార్కెట్లోకి తీసుకొచ్చాయి. కానీ ఈ మూడు కార్లు మాత్రం సక్సెస్ అయ్యాయి.

    దేశీయ కార్ల మార్కెట్లో మారుతి కంపెనీ అగ్రగామిగా నిలుస్తోంది. ఈ కంపెనీకి చెందిన బ్రెజ్జా బెస్ట్ ఎస్ యూవీగా నిలిచింది. ఈ మోడల్ 1.5 లీటర్ పెట్రోల్ ఇంజిన్ ను కలిగి ఉంది. 103 పీఎస్ పవర్ ను ఉత్పత్తి చేస్తుంది. 137 ఎన్ ఎం టార్క్ ను రిలీజ్ చేస్తుంది. 6 స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్ మిషన్ ఎంపికతో ఉన్న ఈ మోడల్ ను రూ.8.34 లక్షల నుంచి రూ.14.14 లక్షల వరకు విక్రయిస్తున్నారు. బ్రెజ్జా పెట్రోల్ ఇంజిన్ తో పాటు సీఎన్ జీ వెర్షన్ కూడా ఉంది. దీంతో ఈ కారుకు అధిక డిమాండ్ ఏర్పడింది. ఈ మోడల్ 2023 డిసెంబర్ వరకు 9,96,608 యూనిట్లు విక్రయించింది. అంటే ఈ నాలుగు నెలల సేల్స్ కలపి రూ. 10 లక్షలు దాటే అవకాశం ఉంది.

    ప్రముఖ కార్ల కంపెనీ నుంచి మార్కెట్లోకి వచ్చిన క్రెటా బెస్ట్ ఎస్ యూవీగా నిలిచింది. ఇది 1.5 లీటర్ పెట్రోల్ ఇంజిన్ ను కలిగి ఉంది. ఇందులో 115 పీఎస్ పవర్, 114 ఎన్ ఎం టార్క్ ఉత్పత్తి అవుతుంది. దీనిని రూ.11 లక్షల ప్రారంభం నుంచి రూ.20.11 లక్షల వరకు విక్రయిస్తున్నారు. క్రెటా మొత్తం ఒక మిలియన్ 10 లక్షల సేల్స్ ను జరుపుకుంది. మరో ఎస్ యూవీ మహీంద్రా స్కార్పియో సైతం 10 లక్షలకు పైగానే యూనిట్లు అమ్ముడుపోయింది.