Maruthi Cars: మారుతి నుంచి హోండా వరకు.. అతి తక్కువ బడ్జెట్ కార్లు ఇవే.. కానీ ఫీచర్స్ నో కాంప్రమైజ్..

తక్కువ ధరకు కార్లను అందిస్తున్నా.. ఫీచర్స్ విషయంలో మాత్రం ఏమాత్రం తగ్గేదేలే అంటున్నాయి. మారుతి నుంచి హోండా సిటీ వరకు అతి తక్కువ బడ్జెట్ తో ఉండి.. మెగా ఫీచర్లు అందించే ఈ కార్ల గురించి తెలుసుకోండి..

Written By: Chai Muchhata, Updated On : March 15, 2024 10:39 am

Low budget cars

Follow us on

Maruthi Cars: కారు కొనాలని ప్రతి ఒక్కరికీ ఉంటుంది. కానీ లో బడ్జెట్ కారు కావాలని కోరుకునే వారు ఎక్కువే ఉంటారు. ప్రస్తుత కాలంలో మిడిల్ క్లాస్ పీపుల్స్ ఎక్కువగా కార్లు కొనడానికి ఇష్టపడుతున్నారు. ఇదే సమయంలో కొన్ని కంపెనీలు సైతం వీరికి అనుగుణంగా తక్కువ ధరకు మార్కెట్లోకి తీసుకొస్తున్నాయి. అయితే తక్కువ ధరకు కార్లను అందిస్తున్నా.. ఫీచర్స్ విషయంలో మాత్రం ఏమాత్రం తగ్గేదేలే అంటున్నాయి. మారుతి నుంచి హోండా సిటీ వరకు అతి తక్కువ బడ్జెట్ తో ఉండి.. మెగా ఫీచర్లు అందించే ఈ కార్ల గురించి తెలుసుకోండి..

దేశంలో కార్ల ఉత్పత్తిలో అగ్రగామిగా నిలుస్తుంది మారుతి సుజుకీ కంపెనీ. దీని నుంచి వచ్చిన కార్లను చాలా మంది లైక్ చేస్తారు. హ్యాచ్ బ్యాక్ నుంచి స్పోర్ట్స్ వరకు అందించే ఈ కంపెనీ తక్కువ బడ్జెట్ కార్లను అందించడంలో ముందు ఉంటుంది. మారుతి సుజుకీ నుంచి రిలీజ్ అయిన బ్రెజ్జా సబ్ కాంపాక్టు ఎస్ యూవీ ఆకర్షణీయమైన ఫీచర్స్ ను కలిగి ఉంది. ఇది 5 స్పీడ్ మాన్యువల్ తో పాటు 6 స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్ మిషన్ తో పనిచేస్తుంది. దీనిని రూ.8.34 లక్షల ప్రారంభ ధరతో విక్రయిస్తున్నాు.

ఇదే కంపెనీకి చెందిన టొయోటా గ్లాంజా ఇటీవల ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు. ఇది పెట్రోల్ తో పాటు సీఎన్ జీ వేరయింట్ లో లభ్యమవుతుంది. ఇందులో 1.2 లీటర్ Lk Series ఇంజిన్ ఆధారంగా పనిచేస్తుంది. కొత్త ఫీచర్లతో ఆకట్టుకునే ఈ కారు రూ.6.86 లక్షల ప్రారంభ ధరతో విక్రయిస్తున్నారు. దక్షిణ కొరియా కంపెనీ హ్యుందాయ్ నుంచి తక్కువ ధరకు లభించే కార్లు ఉన్ానయి. దీని నుంచి వెన్యూ సబ్ కాంపాక్ట్ ఎస్ యూవీ ఎక్కువగా ఆదరణ పొందుతోంది. ఇది 6 స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ తో మంచి డ్రైవింగ్ అనుభూతిని కలిగిస్తుంది. దీనిని రూ.10.70 లక్షల ప్రారంభ ధరతో విక్రయిస్తున్నారు.

హోండా సిటీ కార్లు ఇటీవల ఎక్కువగా అమ్ముడు పోతున్నాయి. ఈ కంపెనీ నుంచి రిలీజ్ అయిన ఐ వీ టెక్ ఇంజిన్ ద్వారా పనిచేస్తుంది. ఇది 6 స్పీడ్ మాన్యువల్ లేదా సీవీటీకి అనుగుణంగా పనిచేస్తుంది. దీనిని రూ.11.74 లక్షల ప్రారంభధరతో విక్రయిస్తున్నారు. ఇదే కంపెనీకి చెందిన ఎలివేట్ 2023లో మార్కెట్లోకి వచ్చింది. లేటేస్ట్ ఫీచర్లతో ఆకట్టుకునే ఈ కారు 6 స్పీడ్ మాన్యువల్ లేదా సీవీటీ ఆధారంగా పనిచేస్తుంది. దీనిని రూ.11.57 లక్షల ప్రారంభ ధరతో విక్రయిస్తున్నారు.