Mark Zuckerberg Facebook scam: నేటి కాలంలో ఫేస్ బుక్ వాడని వారంటూ లేరంటే అతిశయోక్తి కాక మానదు. ఎందుకంటే ప్రస్తుత సమాజం సోషల్ మీడియా చుట్టూ తిరుగుతోంది. ఒకప్పుడు మీడియా ద్వారా ప్రపంచం వార్తల నుంచి మొదలుపెడితే సరికొత్త విషయాలను తెలుసుకునేది. కానీ ఇప్పుడు సోషల్ మీడియానే ఎక్కువగా విశ్వసిస్తున్నది. వార్త వెనుక ఉన్న మరో కోణాన్ని.. తెలుసుకోవాలనే ప్రయత్నం దాని ద్వారానే చేస్తున్నది. సోషల్ మీడియా ద్వారా సమాచారం మాత్రమే కాకుండా అన్ని రకాల విషయాలు తెలుసుకోవడానికి అవకాశం ఏర్పడుతున్నది. అందువల్లే సోషల్ మీడియాలో ఫేస్ బుక్ దిగ్గజ సంస్థగా వెలుగొందుతున్నది.. ఫేస్ బుక్ సృష్టించిన సంచలనం అనేక వేదికలు ఏర్పడేందుకు కారణమైంది. ఫేస్ బుక్ తర్వాత వాట్సాప్, ఇన్ స్టా గ్రామ్.. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో వచ్చాయి. ఇవన్నీ కూడా సమాచారంతోపాటు వినోదాన్ని, రీల్స్, వీడియోలు..ఇంకా చాలా అనుభూతులను నెటిజన్ల కు అందిస్తున్నాయి.
Also Read: వారి పింఛన్లు కట్.. కూటమి సర్కార్ షాక్!
సామాజిక మాధ్యమాలలో ఖాతాలను కలిగి ఉంటేనే వాటిని వాడేందుకు ఆస్కారం ఉంటుంది. లేనిపక్షంలో ఆ అవకాశం ఉండదు. ఇక సోషల్ మీడియా విస్పోటనం తర్వాత ప్రపంచ వ్యాప్తంగా వీటిని వాడే వారి సంఖ్య ఇటీవల కాలంలో ఈపరితంగా పెరిగిపోయింది. స్మార్ట్ఫోన్ ధరలు అందుబాటులోకి రావడం.. డాటా కూడా చవకగా లభించడంతో చాలామంది సామాజిక మాధ్యమాలను విరివిగా ఉపయోగిస్తున్నారు. సామాజిక మాధ్యమాల ద్వారానే చాలామంది సెలబ్రిటీలు కూడా అవుతున్నారు. ఇక నేటి కాలంలో సామాజిక మాధ్యమాలను వాడటం ఒక స్టేటస్ సింబల్ అయిపోయింది. సామాజిక మాధ్యమాల ద్వారా కొత్త కొత్త విషయాలను తెలుసుకోవడం మాత్రమే కాదు.. స్నేహితులతో నిత్యం టచ్లో ఉండడానికి కూడా వీలవుతోంది. ఇంతవరకు బాగానే ఉన్నప్పటికీ.. సామాజిక మాధ్యమాలలో రెండు కంటే ఎక్కువ ఖాతాలను కలిగి ఉన్న వారి సంఖ్య పెరిగిపోయినట్టు తెలుస్తోంది. తాజాగా వెలువడిన ఓ నివేదిక ఈ నిజాలను తేట తెల్లం చేసింది.
Also Read: ఏపీలో మెడికో విద్యార్థులపై పోలీసుల దౌర్జన్యం
వాస్తవానికి ప్రపంచ జనాభాలో ఆడవాళ్ళ సంఖ్య ప్రస్తుతం 4.9 బిలియన్ మార్కుకు చేరుకుంది. అయితే ఫేస్ బుక్ లో మాత్రం ఆడవాళ్లకు ఉన్న అకౌంట్ల సంఖ్య 5.77 బిలియన్లు గా ఉండడం విశేషం. వాస్తవానికి ప్రపంచంలో ఉన్న ప్రతి మహిళకు ఫేస్ బుక్ లో ఖాతా ఉంది అనుకుంటే.. ఆ సంఖ్య 4.9 బిలియన్ వరకే పరిమితం కావాలి. కానీ ముఖ పుస్తకంలో ఆడవాళ్ల పేరుతో ఉన్న ఖాతాలు ఏకంగా 5.77 బిలియన్లు గా ఉన్నాయంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. నిబంధనల విషయంలో తాము నిష్పక్షపాతంగా ఉంటామని ఫేస్ బుక్ వ్యవస్థాపకుడు జూకర్ బర్గ్ చెబుతుంటారు. కానీ వాస్తవం మాత్రం ఇలా ఉంది.. అంటే ఈ లెక్కన ముఖ పుస్తకంలో నిబంధనలు పేరుకే ఉంటాయని.. వాస్తవంలో పరిస్థితి వేరే విధంగా ఉంటుందని అర్థమవుతోంది. ” కొన్ని ఫోటోలు, వీడియోలను పోస్ట్ చేసినప్పుడు తమ నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయని ఫేస్ బుక్ చెబుతుంటుంది. అవసరమైతే ఖాతాను సస్పెండ్ చేస్తుంది. మరి అంతటి సామర్థ్యం ఉన్న మెటా యాజమాన్యానికి బహుళ ఖాతాలను నియంత్రించే సత్తా లేదా? ఇలా లెక్కకు మిక్కిలి ఖాతాలతో ఏం చేస్తున్నారు? దీనివల్ల ఎటువంటి ప్రయోజనాలు పొందుతున్నారు? వారి విషయంలో మెటా యాజమాన్యం ఎందుకంత ఉదాసీన వైఖరి ప్రదర్శిస్తోందని” నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.