Mahindra XUV 3XO EV
Mahindra XUV 3XO EV : మహీంద్రా తన ప్రఖ్యాత కాంపాక్ట్ ఎస్యూవీ XUV 300 అప్‌గ్రేడ్ వెర్షన్‌గా XUV 3XO ను గత సంవత్సరంలో లాంచ్ చేసింది. లాంచ్ అయిన తర్వాత, XUV 3XO వినియోగదారుల మధ్య అత్యంత ప్రజాదరణను పొందింది. ఈ కారు ప్రతి నెలలో సగటున 9,000 యూనిట్లు అమ్మకం జరుగుతోంది. ఈ డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకొని, మహీంద్రా ఇప్పుడు XUV 3XO ఎలక్ట్రిక్ వేరియంట్‌ను మార్కెట్లోకి విడుదల చేయాలని ప్లాన్ చేస్తోంది. XUV 3XO EV ని ఇప్పటికే పలు సార్లు టెస్టింగ్ చేయడంలో కనిపించింది.
డిజైన్: నూతన ఫీచర్లు, ఆధునిక లుక్స్ XUV 3XO EV డిజైన్ విషయానికి వస్తే, దీనిలో LED ప్రోజెక్టర్ హెడ్‌ల్యాంప్స్ , C-షేప్డ్ LED డే టైమ్ రన్నింగ్ లైట్స్ ఉండే అవకాశం ఉంది. ఈ EV లో నూతనంగా డిజైన్ చేసిన ఫ్రంట్ గ్రిల్, ఫ్రంట్ బంపర్ కూడా ఉంటాయి. ఈ ఎలక్ట్రిక్ ఎస్యూవీ లో ఒక ఛార్జింగ్ పోర్ట్ కూడా ఫ్రంట్ ఫెండర్ పై ఉంటుంది. వెనుక భాగంలో, కనెక్టెడ్ LED టెల్ లాంప్స్‌ను కొనసాగించడం జరుగుతుంది.
ఫీచర్స్: ఆధునిక టెక్నాలజీ ఈ ఎలక్ట్రిక్ ఎస్యూవీ లో 10.25 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఉండనుంది. డాష్‌బోర్డ్ లేఆవుట్ కూడా కొత్తగా ఉండనుంది. XUV 3XO EV ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర సుమారు రూ.10 లక్షలు ఉండొచ్చు.
పవర్‌ట్రెయిన్, రేంజ్: 400 కిమీ రేంజ్ పవర్‌ట్రెయిన్ విషయానికి వస్తే, XUV 3XO EVలో 34.5 kWh బ్యాటరీ ప్యాక్ ఉండే అవకాశం ఉంది. ఈ EV ఒక్కసారి ఛార్జ్ చేసిన తర్వాత 375-400 కిమీ వరకు రేంజ్‌ను అందించగలదు. అలాగే, ఈ EV ఫాస్ట్ ఛార్జింగ్‌ను కూడా మద్దతు ఇస్తుంది, ఇది వినియోగదారులకు మరింత సౌకర్యంగా ఉంటుంది.
మార్కెట్ పోటీ: ఈ ఎలక్ట్రిక్ ఎస్యూవీ మార్కెట్లో టాటా పంచ్ EV, సిట్రోయెన్ eC3, MG విడ్జర్ EV, ఎంట్రీ-లెవల్ నెక్సన్ EV వంటి కార్లతో పోటీలో ఉంటుంది.
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Read MoreWeb Title: Mahindra xuv 3xo ev mahindra xuv 3xo electric variant is coming to create sensation in the market
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com