Mahindra Thar Roxx: అప్డేటెడ్ మహీంద్రా థార్ కారు.. అదిరిపోయే ఫీచర్లు.. త్వరలో మార్కెట్లోకి.. ఫిదా కావాల్సిందే

మహీంద్రా నుంచి రిలీజ్ అయిన థార్ మొదటి వెర్షన్ 2010లో మార్కెట్లోకి వచ్చింది. ఆ సమయంలో 2 డోర్లతో కూడిన ఎస్ యూవీ 2,5 లీటర్ టర్బో ఇంజిన్ తో మార్కెట్లోకి వచ్చింది. ఆ తరువాత 2018లో థార్ రోక్సర్ ను అందుబాటులోకి తెచ్చారు.

Written By: Chai Muchhata, Updated On : July 30, 2024 11:02 am

Mahindra Thar Roxx

Follow us on

Mahindra Thar Roxx: కొత్త కారు కొనాలనుకునే చాలా మంది SUVల వైపు చూస్తున్నారు. హ్యాచ్ బ్యాక్ కార్ల కంటే ఇవి విశాలంగా ఉండడంతో పాటు ఇంజన పనితీరు మెరుగ్గా ఉంటుంది. అంతేకాకుండా లాంగ్ జర్నీ చేసేవాళ్లకు ఇది కంపోర్ట్ గా ఉంటుంది. అందుకే ఎస్ యూవీ కార్ల వైపు ఎక్కువగా వినియోగదారులు చూస్తున్నారు. ఈ తరుణంలో కొన్ని కంపెనీలు ప్రత్యేకంగా ఎస్ యూవీల ఉత్పత్తిపైనే ఫోకస్ పెడుతున్నాయి. వీటిలో టాటా, మహీంద్రా, తదితర కంపెనీలు ఉన్నాయి. మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీ నుంచి ఇప్పటి వరకు చాలా ఎస్ యూవీ వెహికల్స్ వచ్చాయి. రావడమే కాకుండా మంచి ఆదరణ పొందాయి. అయితే వినియోగదారులు అభిరుచులు ఎప్పటిప్పుడు మారుతూ ఉంటాయి. కొత్త టెక్నాలజీతో పాటు అధునాత ఫీచర్స్ ఉండే కార్లను కోరుకుంటూ ఉంటారు. వీరికి అనుగుణంగా కంపెనీలు సైతం అప్ గ్రేడ్ అవుతూ కొత్త కార్లను మార్కెట్లోకి తీసుకొస్తాయి. లేటేస్టుగా మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీ నుంచి కొత్త కారు రాబోతుంది. అయితే ఇప్పటికే ఈ కంపెనీ నుంచి వచ్చి సక్సెస్ అయిన ‘థార్’ కు ఇది కొనసాగింపుగా ఉంటోంది. దీనికి థార్ రోక్స్ అని నామకరణం చేశారు. ఈ కారు వచ్చే నెలలో రిలీజ్ అవుతున్నా.. దీనికి సంబంధించిన ప్రాథమిక వివరాలు ఆన్ లైన్ లోకి వచ్చాయి. ఈ నేపథ్యంలో కారు ఫీచర్స్, ధర గురించి తెలిసి వినియోగదారులు షాక్ అవతున్నారు. కొత్త కారు.. అందులోనూ ఎస్ యూవీ కారు కోసం ఎదురుచూస్తున్న వాళ్లకు ఇది మంచి బూస్ట్ లాంటిది అని కంపెనీలు పేర్కొంటున్నాయి. మరి ఈ కారు ఫీచర్స్, ధర ఎలా ఉన్నాయో చూద్దాం..

మహీంద్రా నుంచి రిలీజ్ అయిన థార్ మొదటి వెర్షన్ 2010లో మార్కెట్లోకి వచ్చింది. ఆ సమయంలో 2 డోర్లతో కూడిన ఎస్ యూవీ 2,5 లీటర్ టర్బో ఇంజిన్ తో మార్కెట్లోకి వచ్చింది. ఆ తరువాత 2018లో థార్ రోక్సర్ ను అందుబాటులోకి తెచ్చారు. థార్ రెండో వెర్షన్ 2020లో రిలీజ్ అయింది. ఈ సమయంలో రెండు ఇంజిన్లను అమర్చారు. 6 స్పీడో ఆటోమేటిక్ ట్రాన్స్ మిషన్ తో పనిచేసింది. అయితే ఇది రిలీజ్ అయి దాదాపు 4 ఏళ్లు అవుతోంది. దీంతో థార్ నుంచి కొత్త కారును తీసుకురావాలని సంకల్పించారు. ఇందులో భాగంగా కొత్తగా థార్ రోక్స పేరుతో మార్కెట్లోకి రాబోతుంది.

మహీంద్రా థార్ రోక్స్ 2024 ఆగస్టు 15న మార్కెట్లోకి రాబోతుంది. దీని ఫీచర్ల గురించి ఇప్పటికే రిలీజ్ అయ్యాయి. ఇందులో ఎల్ ఈడీ హెడ్ లైట్స్, టెయిల్ ల్యాంప్ లు, 10.25 అంగుళాల ఇన్సోటైన్మెంట్ సిస్టమ్ ఉండనున్నాయి. ఇవన్నీ పాత వాటి కంటే అప్డేట్ చేయబడ్డాయి. ఇక ఇందులో కొత్తగా పనోరమిక్ సన్ రూఫ్ ను అమర్చారు. గతంలో ఉన్న థార్ కు 3 డోర్లు మాత్రమే ఉండేవి. ఇప్పుడు థార్ రోక్స్ ను 5 డోర్లో తీసుకొస్తున్నారు. డ్యూయెల్ టోన్ ఓఆర్ వీఎం, సిల్వర్ బంపర్లు ఉన్నాయి. వీటితో పాటు ఇందులో సేప్టీ ఫీచర్లను కూడా అమర్చారు. ఈ థార్ రోక్స్ లో 2 ఎయిర్ బ్యాగులు ఉన్నాయి.

మహీంద్రా థార్ రోక్స్ లో మూడు ఇంజిన్లు ఉండనున్నాయి. వీటిలో ఒకటి 2.0 లీటర్ టర్బో పెట్రోల్, 2.2 లీటర్ డీజిల్ ఇంజిన్, 1.5లీటర్ డీజిల్ ఇంజిన్ ఉంటాయి. ఇవి మొత్తం ఆటోమేటిక్ ట్రాన్స్ మిషన్ తో పనిచేయనున్నాయి. కొత్త థార్ కు వెనక వీల్స్ 4 డబ్ల్యూడీ సెటప్ రెండింటినీ కలిగి ఉంటాయి.