https://oktelugu.com/

Mahindra Thar Roxx : అదిరిపోయేలా ఉన్న మహేంద్ర తార్ రాక్స్.. ఫీచర్ చూస్తే మైండ్ బ్లాక్

లేటేస్ట్ గా థార్ రాక్స్ ను మార్కెట్లోకి తీసుకొచ్చారు. థార్ రాక్స్ ఫీచర్స్ చూసి అదరహో.. అంటున్నారు. ఎందుకంటే లేటేస్ట్ టెక్నాలజీతో పోటా హైఫై ఫీచర్లు కలిగిన ఈ మోడల్ ను చూసి ఇంప్రస్ అవుతున్నారు. ఇంతకీ ఇందులో ఎటువంటి ఫీచర్లు ఉన్నాయో చూద్దాం..

Written By:
  • Srinivas
  • , Updated On : October 1, 2024 / 12:34 PM IST

    Mahindra Thar Roxx

    Follow us on

    Mahindra Thar Roxx :  SUVలకు పెట్టింది పేరు మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీ. దీని నుంచి ఇప్పటి వరకు వెలువడిన చాలా కార్లు హైలెట్ గా నిలిచాయి. వీటిలో థార్ ఎవర్ గ్రీన్ అని చెప్పవచ్చు. 2010 సంవత్సరంలో జీపును పోలిన థార్ మార్కెట్లోకి వచ్చింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు 1.31 కోట్ల యూనిట్లు అమ్ముడు పోయాయి. ఈ నేపథ్యంలో ఈ మోడల్ నుంచి వివిధ వేరియంట్లు మార్కెట్లోకి వచ్చాయి. లేటేస్ట్ గా థార్ రాక్స్ ను మార్కెట్లోకి తీసుకొచ్చారు. థార్ రాక్స్ ఫీచర్స్ చూసి అదరహో.. అంటున్నారు. ఎందుకంటే లేటేస్ట్ టెక్నాలజీతో పోటా హైఫై ఫీచర్లు కలిగిన ఈ మోడల్ ను చూసి ఇంప్రస్ అవుతున్నారు. ఇంతకీ ఇందులో ఎటువంటి ఫీచర్లు ఉన్నాయో చూద్దాం..

    థార్ రాక్స్ లో ఫీచర్ష్ కేక అని చెప్పొచ్చు అని కొందరు వినియోగదారులు పేర్కొంటున్నారు. SUV సెగ్మెంట్ లో ఉన్న ఈ కారులో 360 డిగ్రీ కెమెరాతోనే డ్రైవ్ చేయొచ్చు. level 2 ADAS టెక్నాలజీ, వెంటిలేటేడ్ ఫ్రంట్ సీట్, ఆకర్షణీయమైన డ్యాష్ బోర్డ్, ఆటో డిమ్మింగ్ IRVM, ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేకర్, 9 స్పీకర్లతో కూడిన హర్మన్ కార్డన్ సౌండ్ సిస్టమ్ వంటివి ఉన్నాయి. ఇక ముందరి భాగంలో ఏదైనా వెహికల్ ఉంటే స్టీరింగ్ వైబ్రేషన్ ఇస్తుంది. మొబైల్ ఫోన్స్ కి 65 వాట్ కలిగిన వైర్ లెస్ ఛార్జింగ్ ఉంది. దీనికి ల్యాప్ ట్యాప్ కుడా ఉపయోగించుకోవచ్చు.

    థార్ ఇంటీరియర్ లగ్జరీ లుక్ కనిపిస్తుంది. ముఖ్యంగా సీటింగ్ ప్రీమియర్ లా కనిపిస్తాయి. వెనకాలో ముగ్గురు, ముందరి భాగంలో డ్రైవర్ తో సహా ఇద్దరు… మొత్తం 5గురు సౌకర్యవంతంగా ఉంటుంది. అయితే ఈ మోడల్ ఎస్ యూవీ కనుగ బూట్ స్పేస్ ఎక్కువగా ఉంటుంది. ఇందులో 447 లీటర్ల బూట్ స్పేస్ ను కలిగి ఉంది. లాంగ్ డ్రైవ్ చేసేవారికి ఇది అనుకూలమైన కారు. వయసు మళ్లిన వారు ఇందులోకి రావడానికి, బయటకు వెళ్లడానికి సౌకర్యవంతమైన ఏర్పాట్లు ఉన్నాయి.

    ఈ మోడల్ ఎక్సీటీరియర్ విషయానికొస్తే 19 అంగుళాల డైమండ్ కట్ అల్లాయ్ వీల్స్ ఉన్నాయి. అలాగే ఆకర్షణీయమైన ఎల్ ఈడీ లైట్లు ఉన్నాయి. థార్ రాక్స్ ఇంజిన్ డీజిల్ తో కూడుకొని ఉంది. ఇది 172 బీహెచ్ పీ పవర్ తో పాటు 370 ఎన్ ఎం టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. లీటర్ ఇంధనానికి 15.2 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది. ఇక సేప్టీ కోసం ఇందులో 6 ఎయిర్ బ్యాగ్స్ ను అమర్చారు. ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ తో పాటు ఎయిర్ కండిషన్ సౌకర్యవంతంగా ఉంటుంది. ఈ మోడల్ ప్రస్తుతం రూ.12.99 లక్షల ప్రారంభ ధరతో విక్రయిస్తున్నారు. ఆయా ప్రాంతాలను భట్టి ధర మారుతుంది. యూత్ తో పాటు అన్ని వర్గాలను ఆకట్టుకునే విధంగా థార్ రాక్స్ ను డిజైన్ చేశారు. ముఖ్యంగా లాంగ్ ట్రిప్ వెళ్లే వారికి థార్ రాక్స్ మంచి అనుభూతిని ఇస్తుంది.