https://oktelugu.com/

Kantilal Bhuria: ఇద్దరు భార్యలు ఉంటే రెండు లక్షలు.. ఈ కాంగ్రెసోళ్లు మారరా?

కేంద్ర మాజీ మంత్రి, రత్లాం కాంగ్రెస్‌ ఎంపీ అభ్యర్థి కాంతిలాల్‌ బహురియాలో గురువారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘కేంద్రంలో కాంగ్రెస్‌ అధికారంలో వస్తే మహాలక్ష్మీ పథకం కింద రూ.లక్ష ఇస్తుంది.

Written By:
  • Raj Shekar
  • , Updated On : May 10, 2024 10:49 am
    Kantilal Bhuria

    Kantilal Bhuria

    Follow us on

    Kantilal Bhuria: పార్లమెంటు ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజకీయ నాయకులు ప్రజలకు హామీలు కుమ్మరిస్తున్నారు. ఈ క్రమంలో కొందరు నేతలు ఇస్తున్న హామీలు శృతి మించుతున్నాయి. తాజాగా మధ్యప్రదేశ్‌కు చెందిన కాంగ్రెస్‌ ఎంపీ అభ్యర్థి ఇచ్చిన హామీ వివాదాస్పదమైంది. ఇద్దరు భార్యలు ఉన్నవారికీ స్కీం ప్రకటించారు. ఇప్పుడు ఆయన చేసిన వ్యాఖ్యలు వైరల్‌ అవుతున్నాయి.

    స్కీం ఏమిటంటే..
    కేంద్ర మాజీ మంత్రి, రత్లాం కాంగ్రెస్‌ ఎంపీ అభ్యర్థి కాంతిలాల్‌ బహురియాలో గురువారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘కేంద్రంలో కాంగ్రెస్‌ అధికారంలో వస్తే మహాలక్ష్మీ పథకం కింద రూ.లక్ష ఇస్తుంది. ఎవరికైనా ఇద్దరు భార్యలు ఉంటే.. వారిద్దరికీ స్కీం వర్తింపజేస్తాం. ఇద్దరికీ కలిపి ఏడాదికి రూ.2 లక్షలు ఇస్తాం’ అని వివాదాస్పద హామీ చేశారు.

    పొలిటికల్‌ హీట్‌..
    కాంగ్రెస్‌ ఎంపీ అభ్యర్థి కాంతిలాల్‌ ఇచ్చిన హామీ ఇప్పుడు వివాదాస్పదమైంది. రాజకీయాలను వేడెక్కించింది. కాంతిలాల్‌ వ్యాఖ్యలపై అధికార బీజేపీ తీవ్రంగా స్పందించింది. ఈసీ కాంతిలాల్‌ వ్యాఖ్యలపై చర్య తీసుకోవాలని డిమాండ్‌ చేసింది.

    ఎన్నికల తాయిలాలుగా..
    కాంగ్రెస్‌ మేనిఫెస్టోలో పెట్టిన హామీని మించి కాంతిలాల్‌ ఇచ్చిన హామీని ఎన్నికల తాయిలంగా పరిగణించాలని బీజేపీ నాయకులు డిమాండ్‌ చేస్తున్నారు. ఈమేరక బీజేపీ అధికార ప్రతినిధి నరేంద్ర సలుజా భూరియా కాంతిలాల్‌ వీడియోను సోషల్‌ మీడియాలో పోస్టు చేసి ఎన్నికల సంఘానికి ట్యాగ్‌ చేశారు. కాంతిలాల్‌పై చర్యలు తీసుకోవాలని కోరారు.