https://oktelugu.com/

Mahindra : మార్కెట్లోకి మహీంద్రా కొత్త ఈవీలు.. స్టైలిష్ లుక్.. సూపర్ మైలేజ్.. వెంటనే తెలుసుకోండి..

భారతదేశంలో మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీకి అగ్రస్థానం ఉంది. SUVలను మార్కెట్లోకి తీసుకురావడంలో దిట్ట అని పేరు తెచ్చుకున్న ఈ కంపెనీ ఎలక్ట్రిక్ వేరియంట్ లను కూడా మార్కెట్లోకి ప్రవేశపెట్టింది.

Written By:
  • Srinivas
  • , Updated On : November 27, 2024 / 12:04 PM IST

    Mahindra

    Follow us on

    Mahindra : భారతదేశంలో మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీకి అగ్రస్థానం ఉంది. SUVలను మార్కెట్లోకి తీసుకురావడంలో దిట్ట అని పేరు తెచ్చుకున్న ఈ కంపెనీ ఎలక్ట్రిక్ వేరియంట్ లను కూడా మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. ఇంతకాలం పెట్రోల్, డీజిల్ వేరియంట్ లను అందుబాటులో ఉంచిన కంపెనీ ఇప్పుడు సరికొత్త మోడల్ లో యూత్ ను ఆకర్షించే కార్లను విడుదల చేసింది. వీటిలో ఒకటి BE 6e కాగా.. మరొకటి XEV 9E. ఇవి సామాన్యులకు అందుబాటులో లేకపోయినప్పటికీ యూత్ ను తెగ ఇంప్రెస్ చేస్తోంది. అత్యాధునిక ఫీచర్లు, ఇంజిన్ తో పాటు ఆకట్టుకునే డిజైన్ తో ఉన్న మోడల్ ను చూసి తీవ్రంగా చర్చించుకుంటున్నారు. ఇంతకీ ఈ కారు ఎలా ఉంది.

    ప్రస్తుతం ఎలక్ట్రిక్ కార్లకు డిమాండ్ పెరిగపోతుంది. దీంతో చాలా కంపెనీలు ఈ వీలను ఉత్పత్తి చేసి మార్కెట్లోకి తీసుకొస్తున్నాయి. ఇదే తరహాలో మహీంద్రా అండ్ మహీంద్రా నుంచి కూడా ఈవీలు ఎప్పుడొస్తాయా? అని వినియోగదారులు ఎదురుచూశారు. తాజాగా ఈ కంపెనీ నుంచి రెండు కార్లను మార్కెట్లోకి తీసుకొచ్చారు. Mahindra Be 6E, XEV 9e ఫీచర్లు, ఇంజిన్ దాదాపు సమానంగా ఉంటాయి. వీటి డిజైన్ స్టైలిష్ గా ఉన్నాయి. ఇన్నర్ స్పేస్ ఎక్కువగా ఉండడంతో విశాలమైన కారుగా అనిపిస్తుంది.

    ఈ రెండు కార్లలో 12. 3 అంగుళాల ప్లోటింగ్ స్క్రీన్ కలిగిన డిస్ ప్లేను అమర్చారు. ఇందులో 30కి పైగా యాప్ లను ఇన్ స్టాల్ చేసి ఇస్తారు. పుస్ బటన్ స్టార్ట్, ఆటోమేటిక్ గా వెలిగే హెడ్ లైట్స్, బ్యాక్ సైడ్ ఏసీ వెంట్ లు ఉన్నాయి. ఇటీవల వినియోగదారులు ఎక్కువగా కోరుకుంటున్న పనోరమిక్ సన్ రూఫ్ ఫీచర్ ఇందులో ఆకర్షిస్తుంది. 16 స్పీక్ హార్మన్ కార్డాన్ సిస్టమ్ తో ఉన్న ఇందులో సేప్టీ కోసం కేర్ తీసుకున్నారు. ఇందులో భాగంగా 7 ఎయిర్ బ్యాగ్స్ ను అందించారు. ఆడాస్ సూట్ తో పాటు 360 డిగ్రీ కెమెరా, బ్లైండ్ స్పాట్ మానిటరింగ్ ఫీచర్ ఆకట్టుకుంటుంది.

    రెండు ఈవీల్లో రెండు రకాల బ్యాటరీలు ఉంటాయి. వీటిలో ఒకటి 59 కిలోవాట్ కలిగి ఉంటే..మరొకటి 79 కిలోవాట్ తో ఉండనుంది. ఇవి ఫుల్ ఛార్జింగ్ అయితే 500 లకు పైగా కిలోమీటర్ల వరకు మైలేజ్ వస్తుంది. ఈ బ్యాటరీలో 20 నిమిషాల్లోనే 80 శాతం వరకు ఛార్జ్ అవుతుంది. ఈ బ్యాటరీ ప్యాక్ లపై లైఫ్ టైమ్ వారంటీ ఇవ్వనున్నారు. మహీంద్రా నుంచి రిలీజ్ అయిన ఈ కొత్త ఎలక్ట్రిక్ కార్లు సామాన్యులకు అందని ధరల్లో ఉన్నాయి. వీటీలో BE 6e రూ.18.90 లక్షల ప్రారంభ ధరతో విక్రయించనున్నారు. XEV 9e ని రూ.21.90 లక్షల ధరతో సేల్ చేస్తున్నారు. మహీంద్రా కార్లు అంటే ధర ఎక్కువగా ఉన్నా నాణ్యమైనవిగా ఉంటాయన్న పేరుంది. అందుకే కంపెనీ ధర విషయాన్ని చూడకుండా క్వాలిటీ ప్రొడక్టు ఇవ్వాలని చూస్తుంది. అందుకే ధర ఎంత ఉన్నా ఈ కంపెనీ కార్లు ఎక్కువగా సేల్స్ అవుతూ ఉంటాయి. మరి ఈ ఎలక్ట్రిక్ కార్ల అమ్మకాలు ఎలా ఉండనున్నాయో చూద్దాం..