Mahindra : మహీంద్రా భారతీయ మార్కెట్‌లో తన పవర్ ఫుల్ SUVలకు ప్రసిద్ధి చెందింది. కంపెనీ పోర్ట్‌ఫోలియోలో ఎంట్రీ-లెవెల్ మహీంద్రా XUV 3XO నుండి ప్రీమియం, హై టెక్నికల్ వాల్యూస్ తో నిండిన XEV 9e వరకు అనేక ఆఫ్షన్లు ఉన్నాయి. ఇటీవలి కాలంలో మహీంద్రా తన మార్కెట్ వాటాను మరింత బలోపేతం చేసుకుంది.
Also Read : పవర్, స్టైల్, సేఫ్టీ.. మళ్లీ పెరిగిన మారుతి నంబర్ వన్ కారు ధర
రానున్న కాలంలో మరిన్ని కొత్త లాంచ్‌లు
అమ్మకాలలో ఉన్న ఊపును కొనసాగించడానికి మహీంద్రా రాబోయే నెలల్లో అనేక కొత్త కార్లను విడుదల చేయడానికి సిద్ధమవుతోంది. వీటిలో కొన్ని పూర్తిగా కొత్త SUVలు కాగా, కొన్ని ఇప్పటికే ఉన్న మోడళ్ల ఫేస్‌లిఫ్టెడ్ వెర్షన్‌లు ఉంటాయి. ఈ జాబితాలో థార్ ఫేస్‌లిఫ్ట్, XUV 3XO EV వంటి వాహనాలు ఉన్నాయి.
మహీంద్రా XUV 3XO EV
మహీంద్రా ఈ రాబోయే ఎలక్ట్రిక్ SUV అనేకసార్లు టెస్టింగ్ సమయంలో కనిపించింది. ఇది XUV400 కంటే చౌకగా ఉంటుందని భావిస్తున్నారు. దీనిని రెండు బ్యాటరీ ఎంపికలతో అందించవచ్చు. 34.5 kWh, 39.4 kWh. దీని అంచనా పరిధి దాదాపు 450 కిమీ వరకు ఉండవచ్చు.
ఫీచర్స్
ఈ SUVలో 10.25-ఇంచుల డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే, ఫ్రీ-స్టాండింగ్ 10.25-అంగుళాల టచ్‌స్క్రీన్, వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌ప్లే, డ్యూయల్-జోన్ ఆటోమేటిక్ AC, వైర్‌లెస్ ఫోన్ ఛార్జర్ , పనోరమిక్ సన్‌రూఫ్ వంటి ప్రీమియం ఫీచర్లు ఉండే అవకాశం ఉంది. ఈ కారు జూన్ 2025లో విడుదలయ్యే అవకాశం ఉంది. దీని ధర సుమారు రూ.15.00 – రూ.18.00 లక్షలు ఉండవచ్చు.
మహీంద్రా థార్ ఫేస్‌లిఫ్ట్
థార్ భారతదేశంలో చాలా ప్రజాదరణ పొందిన SUV, దీని ఫేస్‌లిఫ్టెడ్ వెర్షన్ త్వరలో 3-డోర్ అవతార్‌లో విడుదల కావచ్చు. డిజైన్, స్టైలింగ్‌లో థార్ రాక్స్ నుండి ఇన్ స్పైర్ పొందవచ్చు. అయితే, ఇంజన్ ఎంపికలు పాత వాటిలాగే ఉంటాయి. పెట్రోల్, డీజిల్ రెండూ. ఈ కారు జూన్ 2025లో విడుదలయ్యే అవకాశం ఉంది. దీని ధర సుమారు రూ. 12 – రూ.15 లక్షలు ఉండవచ్చు.
మహీంద్రా XUV700 ఫేస్‌లిఫ్ట్
2021లో విడుదలైన XUV700 కూడా త్వరలో అప్‌డేటెడ్ వెర్షన్‌లో రానుంది. ఈ 7-సీటర్ SUV కొత్త డిజైన్, మెరుగైన ఇంటీరియర్, లేటెస్ట్ ఫీచర్లతో 2026 మొదటి త్రైమాసికంలో విడుదల కావచ్చు. దీని డిజైన్ BE6, XEV 9e నుండి ప్రేరణ పొందవచ్చు. కానీ మెకానికల్ మార్పులు ఉండకపోవచ్చు.
Also Read : వెయిటింగ్ కు ఎండ్ కార్డ్.. మారుతి ఈవీ వచ్చేస్తోంది.. ప్రత్యేకతలు ఇవే!