Bollywood Heroine: కొంతమంది కెరియర్ బాగా ఫామ్ లో ఉన్న సమయంలోనే నటనకు గుడ్ బై చెప్పేశారు. అలాగే మరి కొంతమంది పెళ్లి చేసుకొని సినిమా ఇండస్ట్రీకి దూరం అయ్యారు. మరి కొంతమంది మాత్రం ఇతర వ్యాపారాలలో బిజీగా మారిపోయారు. గత సంవత్సరం సినిమా ఇండస్ట్రీలో పెళ్లి భాజలు చాలానే మోగాయి. సినిమా ఇండస్ట్రీలో యంగ్ హీరోలు, హీరోయిన్లు కూడా చాలామంది పెళ్లి చేసుకున్నారు. కానీ కొంతమంది మాత్రం ఎంత వయస్సు వచ్చినా కూడా ఇప్పటికీ సింగిల్ గానే ఉంటున్నారు. ఇండస్ట్రీలో కొంతమంది ముద్దుగుమ్మలు నాలుగు బదుల వయసు దాటిన కూడా సింగిల్ గా ఉంటున్నారు. మనం చెప్పుకోబోయే ఈనటి ఏకంగా 51 ఏళ్లు దాటినా కూడా ఇప్పటికీ పెళ్లి మాట ఎత్తకుండా సింగిల్ గా ఉంటుంది.
Also Read: అడ్డంగా బుక్ అయిన సందీప్ రెడ్డి వంగ, సోషల్ మీడియాలో ట్రోలింగ్!
మొన్నటి వరకు ఈ బ్యూటీ ఒక యంగ్ హీరోతో యవ్వారం నడుపుతూ వార్తల్లో నిలిచింది. కానీ ఇప్పుడు అతన్ని కూడా వదిలేసింది. తెలుగులో ఈ బ్యూటీ సూపర్ స్టార్ మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ లాంటి స్టార్ హీరోలతో జతకట్టింది. ఈ బ్యూటీ మరెవరో కాదో బాలీవుడ్ హాట్ బ్యూటీగా పేరు తెచ్చుకున్న మలైకా అరోరా. మలైకా అరోరా గురించి బాలీవుడ్ ప్రేక్షకులతో పాటు తెలుగు ప్రేక్షకులకు కూడా ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో ఈ అమ్మడు చాలా ఫేమస్. ముఖ్యంగా మలైకా అరోరా స్పెషల్ సాంగ్స్ కు కేర్ ఆఫ్ అడ్రస్. టాలీవుడ్ లో కూడా ఈమె పలు సినిమాలలో స్పెషల్ సాంగ్స్ తో తెలుగు ప్రేక్షకులను అలరించింది. మహేష్ బాబు హీరోగా నటించిన అతిధి సినిమాలో మలైకా అరోరా స్పెషల్ సాంగ్ చేసింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన గబ్బర్ సింగ్ సినిమాలో కూడా స్పెషల్ సాంగ్ తో తెలుగు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది.
View this post on Instagram
ప్రస్తుతం బాలీవుడ్ లో మలైకా అరోరా పలు టీవీ షోలలో సందడి చేస్తుంది. అయితే ఈ బ్యూటీ బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ సోదరుడిని పెళ్లి చేసుకొని కొన్ని కారణాల వలన అతనికి విడాకులు ఇచ్చి విడిపోయిన సంగతి అందరికీ తెలిసిందే. ఆ తర్వాత కొన్నాళ్లపాటు ఈ బాలీవుడ్ బ్యూటీ బాలీవుడ్ యంగ్ హీరో అర్జున్ కపూర్ తో కూడా ప్రేమాయణం సాధించింది. వీళ్ళిద్దరూ తరచుగా వార్తల్లో కూడా నిలిచేవాళ్ళు. తనకన్నా వయసులో చాలా చిన్నవాడైన అర్జున్ కపూర్ తో ప్రేమాయణం నడిపింది. కానీ ఇటీవలే వీరిద్దరూ కూడా బ్రేకప్ చెప్పుకున్నారు. ప్రస్తుతం మలైకా అరోరా సింగిల్ గా ఉంటుంది. సోషల్ మీడియాలో 51 ఏళ్ల వయసులో కూడా అందాలు ఆరబోస్తూ ఓ రేంజ్ లో ఫోటోలు షేర్ చేస్తూ ఉంటుంది.
Also Read: జయం సినిమా చిన్నారి ప్రస్తుతం ఎంతలా మారిపోయిందో చూశారా..