Mahindra : మహీంద్రా అండ్ మహీంద్రా సాధారణంగా ప్రతేడాది ఆగస్టు 15న ఏదో ఒక పెద్ద ప్రకటన చేస్తుంది. గత కొన్నేళ్లుగా ఒక ఇయర్ ట్రెండ్‌గా మహీంద్రా ఆగస్టు 15న ఏదో ఒక కొత్త ఉత్పత్తిని విడుదల చేస్తోంది. థార్, థార్ రాక్స్‌తో పాటు, కంపెనీ తన ఈవీ కార్ల ప్లాట్‌ఫామ్‌ను కూడా ఆగస్టు 15నే ప్రారంభించింది. ఈ సంవత్సరం కూడా మహీంద్రా ఆగస్టు 15న ఏదో పెద్ద ప్రకటన చేయడానికి సిద్ధమవుతోంది.
మహీంద్రా అండ్ మహీంద్రా ఈ సంవత్సరం ఆగస్టు 15న తన పాపులర్ కారు బొలెరో న్యూ జనరేషన్ మోడల్‌ను ప్రదర్మించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే దీని లాంచింగ్ వచ్చే ఏడాది వరకు ఉండవచ్చని భావిస్తున్నారు. పెద్ద విషయం ఏమిటంటే ఈ కారు ఐసీఈ (పెట్రోల్-డీజిల్)తో పాటు ఈవీలో కూడా రావచ్చు.
Also Read : బంపర్ ఆఫర్! ఈ టాటా ఎలక్ట్రిక్ కారుపై ఏకంగా రూ. 1.7 లక్షల తగ్గింపు
ప్రస్తుతం దేశంలోని చాలా కంపెనీలు పెట్రోల్-డీజిల్ నుండి ఎలక్ట్రిక్ వాహనాల వైపు మారుతున్నాయి. అందువల్ల అవి కొత్త కార్ల ప్లాట్‌ఫామ్‌లను అభివృద్ధి చేయడంపై దృష్టి సారిస్తున్నాయి. ఈ ప్లాట్‌ఫామ్‌లు ఫ్లెక్సిబుల్‌గా ఉంటాయి, తద్వారా ఒకే ప్లాట్‌ఫామ్‌పై ఐసీఈ, ఈవీ లేదా హైబ్రిడ్ కార్లను అభివృద్ధి చేయవచ్చు.
మహీంద్రా అండ్ మహీంద్రా కూడా ‘న్యూ ఫ్లెక్సిబుల్ ఆర్కిటెక్చర్’ (NFA)పై పనిచేస్తోంది. రష్‌లేన్ వార్తల ప్రకారం.. ఇది కంపెనీకి ఒకే ప్లాట్‌ఫామ్‌పై అన్ని రకాల కార్లను తయారు చేసే అవకాశం ఇస్తుంది. కంపెనీ దీనిని ఆగస్టు 15న కాన్సెప్ట్‌గా తీసుకురావచ్చు. అలాగే ఈ మోడల్‌పై ఆధారపడిన బొలెరోను కూడా కంపెనీ ప్రవేశపెట్టవచ్చు.
ఆగస్టు 15న మహీంద్రా కొత్త తరం బొలెరోతో పాటు ఎలక్ట్రిక్ బొలెరో, టీజర్‌ను కూడా చూపించవచ్చు. ఇది కంపెనీ కొత్త ఫ్లెక్సిబుల్ ప్లాట్‌ఫామ్‌పై అభివృద్ధి చేయబడుతుంది. ఈ కార్లను వచ్చే ఏడాది విడుదల చేసే అవకాశం ఉంది. కొత్త ఎన్‌ఎఫ్‌ఏ ప్లాట్‌ఫామ్‌పై ఆధారపడిన ఎస్యూవీలను కంపెనీ కొత్త చాకన్ ఫ్యాక్టరీలో తయారు చేస్తారు. ప్రారంభంలో ఈ ఫ్యాక్టరీ ప్రతేడాది 12 లక్షల కార్లను ఉత్పత్తి చేయగలదు. మహీంద్రా అండ్ మహీంద్రా 2030 నాటికి దేశంలో 9 కొత్త పెట్రోల్-డీజిల్, 7 కొత్త ఎలక్ట్రిక్ వాహనాలను విడుదల చేయాలని యోచిస్తోంది.
Also Read : కొత్త కార్ల పోటీ నుంచి తట్టుకొని నిలబడ్డ పాతకాలం.. ఈ కారు గురించి తెలుసా?