Mahindra SUV : మహీంద్రా SUVల సేల్స్ జాతర.. ఆ మూడు కార్లు ఎన్ని విక్రయించారో తెలుసా?

మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీ తొలి ఆర్థిక సంవత్సర సేల్స్ ఫలితాలను ప్రకటించింది. ప్రతి నెలలో మహీంద్రా నుంచి దాదాపు 1.24.000 యూనిట్లు విక్రయించింది. ఇది ఏప్రిల్ నుంచి జూన్ వరకు మాత్రమే. అయితే జలై నెలలో 1.78 లక్షల కార్లు బుకింగ్ అయ్యాయి. మహీంద్రా నుంచి ఎక్కువగా ఎస్ యూవీలనే కోరుకుంటున్నారు. దీంతో ఈ కార్లపైనే ఎక్కవగా ఫోకస్ చేసింది.

Written By: Srinivas, Updated On : August 7, 2024 6:25 pm
Follow us on

Mahindra SUV : కొత్తగా కార్లు కొనాలనుకునేవారు ఈమధ్య ఎక్కువగా ఎస్ యూవీలపై ఫోకస్ పెడుతున్నారు. విశాలమైన స్సేస్ తో పాటు వివిధ రకాల అదనపు ప్రయోజనాలు ఉండడంతో ఇలాంటి కార్లపై మక్కువ పెంచుకుంటున్నారు. ఈ నేపథ్యంలో కొన్ని కంపెనీలు ప్రత్యేకంగా ఎస్ యూవీలను ఉత్పత్తి చేస్తున్నాయి. వీటిలో మహీంద్రా అండ్ మహీంద్రా ఒకటి. ఈ కంపెనీ నుంచి ఎన్నో ఎస్ యూవీలు మార్కెట్లోకి వచ్చాయి. కానీ కొన్ని మాత్రమే సేల్స్ లో రారాజుగా నిలిచాయి. అయితే ఇటీవల తేలిన లెక్క ప్రకారం మూడు కార్లు మాత్రం హైలెట్ గా నిలుస్తున్నాయి. ఒకదానితో ఒకటి పోటీ పడి మహీంగ్రా నుంచే మూడు ఎస్ యూవీలు అత్యధిక సేల్స్ ను నమోదు చేసుకున్నాయి. ఈ కార్లలో ఉండే ఫీచర్స్ తో పాటు ఇంజిన్ సామర్థ్యంపై వినియోగదారులు ఎక్కువగా ఆసక్తి చూపి ఈ కార్లను ఎక్కువగా కొనుగోలు చేస్తున్నట్లు తెలుస్తోంది. మిగతా కార్ల కంటే మహీంద్రా కార్లలో స్పేసీయెస్ తక్కువగా ఉన్నా ఇవి సేప్టీ విషయంలో 5 స్టార్ రేటింగ్ ను పొందుతూ ఉంటాయి. అంతేకాంకుడా ఎత్తైన ప్రదేశాల్లో మహీంద్రా వెహికల్స్ అక్కడి వారికి అనుగుణంగా ఉంటాయి. అందువల్ల ఓవరాల్ గా ఎస్ యూవీ కోరుకునేవారు మహీంద్రా అండ్ మహీంద్రా కార్ల వైపు చూస్తారు. ఈ తరుణంలో కంపెనీ ప్రకటించిన లెక్కల ప్రకారం ఓ మూడు కార్లు అత్యధిక సేల్స్ ను సొంతం చేసుకున్నాయి. ఆ కార్ల గురించి పూర్తి వివరాల్లోకి వెళితే..

మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీ తొలి ఆర్థిక సంవత్సర సేల్స్ ఫలితాలను ప్రకటించింది. ప్రతి నెలలో మహీంద్రా నుంచి దాదాపు 1.24.000 యూనిట్లు విక్రయించింది. ఇది ఏప్రిల్ నుంచి జూన్ వరకు మాత్రమే. అయితే జలై నెలలో 1.78 లక్షల కార్లు బుకింగ్ అయ్యాయి. మహీంద్రా నుంచి ఎక్కువగా ఎస్ యూవీలనే కోరుకుంటున్నారు. దీంతో ఈ కార్లపైనే ఎక్కవగా ఫోకస్ చేసింది. దీంతో ఈ కంపెనీ నుంచి రిలీజ్ అయినా థార్, ఎక్స్ యూవీ 400 వంటి కార్లను ఎక్కువగా కొనుగోలు చేశారు.

తొలి త్రైమాసికంలో మహీంద్రా కార్లలో స్కార్పియోను ఎక్కువగా కోరుకున్నారు. ఈ కారును 58 వేల మంది కోరుకున్నారు. ఆ తరువాత XUV 3xo 55 వేల యూనిట్లు విక్రయం అయ్యాయి. మూడోస్థానంలో థార్ 42 వేల కార్లు అమ్ముడు పోయాయి. అయితే వీటి తరువాత XUV 700 13,000.. బోలెరో 8 వేలు బుకింగ్స్ అయ్యాయి. మొత్తంగా చూస్తే మిగతా కార్ల కంటే ఎక్కువగా ఎస్ యూవీ కార్లనే కోరుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఈ కార్ల సేల్స్ పైనే కంపెనీ ఫోకస్ పెడుతుంది.

ప్రస్తుతం ఎస్ యూవీ కార్ల హవా సాగుతోంది. 2019-20 ఆర్థిక సంవత్సంలో 19 వేల ఎస్ యూవీ కార్లు విక్రయం జరిగాయి. ఆ తరువాత 2023-24 ఆర్థిక సంవత్సరంలో మొదటి త్రైమాసికంలో 49 వేలు విక్రయించబడ్డాయి. కానీ ఈ ఏడాది మొదటి త్రైమాసికంలో 41 కార్లు బుకింగ్ అయ్యాయి. కానీ 10 వేల బుకింగ్స్ రద్దయ్యాయి. ఈ ఏడాది మొత్తంగా 64 వేల కార్ల బుకింగ్స్ లక్ష్యంగా ముందుకు వెల్తోంది. అయితే థార్, ఎక్స్ యూవీ 3 ఎక్ష్ 0, ఓక్స్ యూవీ 400 కార్ల సేల్స్ ఎక్కువగా ఉంటాయని కంపెనీ భావిస్తోంది. అయితే ప్రస్తుతం పండుగల సీజన్ ఉన్నందున ఈ లక్ష్యం పెద్దగా కష్టం కాదని కొందరు భావిస్తున్నారు. అయినా ఏ కార్లు ఎక్కువగా సేల్స్ నమోదు చేసుకుంటాయో చూడాలి.