Mahindra Cars: రూ.8 లక్షలలోపు SUV కారు.. మైలైజ్ మైండ్ బ్లోయింగ్..

XUV 3x0 మోడల్ రెండు ఇంజన్లను కలిగి ఉంది. ఇందులో మొదటిది 1.2 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్, రెండోది 1.5 లీటర్ డీజిల్ ఇంజిన్ సహా 3 పవర్ ట్రెయిన్ లు ఏర్పాటు చేశారు. ఈ ఇంజిన్లు 6 స్పీడ్ మాన్యువల్, 6 స్పీడ్ ఆటో ట్రాన్స్ మిషన్ తో పనిచేస్తాయి.

Written By: Srinivas, Updated On : May 4, 2024 11:55 am

Mahindra Mahindra XUV 3x0

Follow us on

Mahindra Cars:  నేటి కాలంలో ఎస్ యూవీ కార్లను కొరుకునేవారు ఎక్కువ మందే ఉన్నారు. అయితే కొన్ని కంపెనీలు మాత్రమే ఎస్ యూవీ కార్ల ఉత్పత్తికి ప్రిఫరెన్స్ ఇస్తాయి. వీటిలో మహీంద్రా అండ్ మహీంద్రా. ఎస్ యూవీ కార్లను మార్కెట్లోకి తీసుకురావడంలో ఈ కంపనీకి ప్రత్యేకత ఉందని చెప్పొచ్చు. ఇప్పటికే ఎన్నో మోడళ్లు మార్కెట్లోకి వచ్చి ఆకర్షించాయి. లేటేస్టుగా లో బడ్జెట్ లో ఓ కారును తీసుకొచ్చింది. ఇది ఇటీవలే లాంచ్ అయింది. ఓ వైపు ఈ కారు రూ.8 లక్షలలోపే లభిస్తూ..మరో వైపు మైలేజ్ విషయంలో మైండ్ బ్లోయింగ్ చేసే న్యూస్ తీసుకొచ్చింది. ఈ కారు ఎలా ఉందంటే?

సాధారణంగా ఎస్ యూవీ కార్లు అంటే రూ.10 లక్షల పైమాటే. కానీ నార్మల్ పీపుల్స్ కు సైతం ఎస్ యూవీ మోడల్ ను అందించాలని కొన్ని కంపెనీలు లో బడ్జెట్ ఎస్ యూవీలను తీసుకొస్తున్నాయి. తాజాగా మహీంద్రా కంపెనీ నుంచి XUV 3×0 మోడల్ రిలీజ్ అయింది. కాంపాక్ట్ ఎస్ యూవీ అయిన ఈ కారు చూడ్డానికి ఆకర్షణీయంగా ఉంది. ఇది nexon SUVకి గట్టిపోటీ ఇవ్వనున్నట్లు కంపెనీ ప్రతినిధులు తెలిపారు. అంతకుముందున్న XUV 300 ను XUV 3×0గా అప్డేట్ చేసిన ఈ కారు ఎలా ఉందంటే?

XUV 3×0 మోడల్ రెండు ఇంజన్లను కలిగి ఉంది. ఇందులో మొదటిది 1.2 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్, రెండోది 1.5 లీటర్ డీజిల్ ఇంజిన్ సహా 3 పవర్ ట్రెయిన్ లు ఏర్పాటు చేశారు. ఈ ఇంజిన్లు 6 స్పీడ్ మాన్యువల్, 6 స్పీడ్ ఆటో ట్రాన్స్ మిషన్ తో పనిచేస్తాయి. కొత్త XUV 3×0 సీ ఆకారపు ఎల్ ఈడీ, డీఆర్ఎల్ ను కలిగి ఉంది. మెష్ నమూనాల్లో బ్లాక్ గ్రిల్, రీ డిజైన్ చేసిన ఫ్రంట్ బంపర్ ను అమర్చారు. కంపెనీకి చెందిన స్ప్లిట్ ఎల్ ఈడీ లైట్ ను కలిగి ఉన్న ఈ కారు మొత్తం 9 వేరియంట్లలో లభిస్తాయి.

కారు డిజైన్ ఆకర్షణీయంగా ఉంటుంది. వెనుక బాగంలో కనెక్ట్ చేసిన టెయిల్ లైట్ ను ఉంచారు. వెనుక ఏసీ సౌకర్యంతో పాటు పనోరమిక్ సన్ రూఫ్, లెవెల్ 2 అడాస్ సూట్ వంటి ఫస్ట్ ఇన్ సెగ్మెంట్ సేప్టీ ఫీచర్స్ ఈ కారులో చూడొచ్చు. ఈ ఎస్ యూవీని అందరికీన అందించాలనే ఉద్దేశంతో రూ.7.49 లక్షల ప్రారంభ ధరను నిర్ణయించారు. టాప్ మోడల్ రూ.13.99 లక్షల ఎక్స్ షో రూం ధరతో విక్రయించనున్నారు.